Salman Khan: సల్మాన్‌ ఖాన్‌కు మరోసారి బెదిరింపులు.. ఈసారి ఈ-మెయిల్‌లో ఏం పంపారో తెలుసా?

బాలీవుడ్‌ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌కు మరోసారి బెదిరింపులు వచ్చాయి. గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ నుంచి ఆయనకు ఈ-మెయిల్‌ ద్వారా బెదిరింపులు వచ్చాయి. దీనిపై ముంబయిలోని బాంద్రా పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు సల్మాన్‌ టీమ్‌ వెల్లడించింది

Salman Khan: సల్మాన్‌ ఖాన్‌కు మరోసారి బెదిరింపులు.. ఈసారి ఈ-మెయిల్‌లో ఏం పంపారో తెలుసా?
Salman Khan
Follow us
Basha Shek

|

Updated on: Mar 20, 2023 | 8:04 AM

బాలీవుడ్‌ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌కు మరోసారి బెదిరింపులు వచ్చాయి. గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ నుంచి ఆయనకు ఈ-మెయిల్‌ ద్వారా బెదిరింపులు వచ్చాయి. దీనిపై ముంబయిలోని బాంద్రా పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు సల్మాన్‌ టీమ్‌ వెల్లడించింది. ఈమేరకు మెయిల్‌ బెదిరింపులపై గ్యాంగ్‌స్టర్లు లారెన్స్ బిష్ణోయ్, గోల్డీ బ్రార్‌లపై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదిలా ఉంటే గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ సల్మాన్ ఖాన్‌తో మాట్లాడాలనుకుంటున్నాడని ఈ-మెయిల్‌లో పేర్కొన్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అందులో సల్మాన్ ఖాన్‌ను చంపడమే తన జీవిత లక్ష్యమని చెప్పారని ప్రస్తావించారు. కాగా గ్యాంగ్‌స్టర్‌ బిష్ణోయ్‌ నుంచి సల్మాన్‌ఖాన్‌కు బెదిరింపులు రావడం ఇది మొదటిసారేం కాదు. కృష్ణజింకల కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న సల్మాన్‌ఖాన్‌ని హత్య చేస్తానంటూ 2018లో కోర్టు ఆవరణలోనే గ్యాంగ్‌స్టర్ లారెన్స్‌ బిష్ణోయ్‌ ప్రకటించాడు. అయితే చివరకు ఈ కేసులో సల్మాన్‌ నిర్దోషిగా విడుదలయ్యారు.

కాగా గతేడాది పంజాబీ సింగర్‌ సిద్ధూ మూసేవాలా హత్య తర్వాత సల్మాన్‌కు బెదిరింపు లేఖ వచ్చింది. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం సల్మాన్ భద్రతను కూడా పెంచింది. ఇప్పటికీ సాయుధ గార్డ్‌లు సల్మాన్‌కు అనునిత్యం భద్రతగా ఉంటున్నారు. ఆ తర్వాత కొందరు దుండగులు సల్మాన్‌ ఖాన్‌తోపాటు ఆయన తండ్రి సలీం ఖాన్‌ను చంపేస్తామని లేఖ పంపారు. తాజాగా మరోసారి బెదిరింపులతో సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. కాగా గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ ప్రస్తుతం ఢిల్లీ జైలులో ఉన్న విషయం తెలిసిందే. పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసులో ప్రధాన సూత్రధారిగా ఆరోపణలు రావడంతో పోలీసులు అతనిని అరెస్టు చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..