Saif Ali Khan: పటౌడీ సామ్రాజ్యానికి రారాజు.. రూ.5000 వేల కోట్లకు అధిపతి.. సైఫ్ ఆస్తులు ఇంకా ఎంతంటే..

బీటౌన్ స్టార్ సైఫ్ అలీ ఖాన్. దాదాపు మూడు దశాబ్దాలుగా సినీ పరిశ్రమలో ఎన్నో చిత్రాలతో ఓ వెలుగు వెలిగారు. నటన, స్థిరమైన ఫిట్ నెస్.. వ్యక్తిగత జీవితం ఇలా అతనికి సంబంధించిన ప్రతి విషయం నిత్యం సోషల్ మీడియాలో వైరలవుతుంటాయి. ఇటీవల యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమాతో ఇటు దక్షిణాద ప్రేక్షకులకు సైతం దగ్గరయ్యాడు సైఫ్. ఇందులో రావణాసుర పాత్రలో నటించి మంచి మార్కులు కొట్టేశాడు.

Saif Ali Khan: పటౌడీ సామ్రాజ్యానికి రారాజు.. రూ.5000 వేల కోట్లకు అధిపతి.. సైఫ్ ఆస్తులు ఇంకా ఎంతంటే..
Saif Ali Khan
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 19, 2023 | 3:17 PM

ఒకప్పుడు బాలీవుడ్ స్టార్ హీరో.. కానీ ఇప్పుడు పాన్ ఇండియా సూపర్ స్టార్. అందిరి హీరోల మాదిరిగా కాకుండా విలనిజంతో బాక్సాఫీస్‏ను షేక్ చేస్తున్నాడు. అతనే బీటౌన్ స్టార్ సైఫ్ అలీ ఖాన్. దాదాపు మూడు దశాబ్దాలుగా సినీ పరిశ్రమలో ఎన్నో చిత్రాలతో ఓ వెలుగు వెలిగారు. నటన, స్థిరమైన ఫిట్ నెస్.. వ్యక్తిగత జీవితం ఇలా అతనికి సంబంధించిన ప్రతి విషయం నిత్యం సోషల్ మీడియాలో వైరలవుతుంటాయి. ఇటీవల యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమాతో ఇటు దక్షిణాద ప్రేక్షకులకు సైతం దగ్గరయ్యాడు సైఫ్. ఇందులో రావణాసుర పాత్రలో నటించి మంచి మార్కులు కొట్టేశాడు. ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర చిత్రంలో కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఇటీవల సైఫ్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం సైఫ్ వ్యక్తిగత జీవితం.. ఆస్తి వివరాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

వ్యక్తిగత జీవితం..

ఇవి కూడా చదవండి

సైఫ్ అలీ ఖాన్.. 1970 ఆగస్ట్ 16న జన్మించారు. ప్రముఖ క్రికెటర్, భారత జట్టు మాజీ కెప్టెన్ మన్సూర్ అలీ ఖాన్ పటౌడి.. హిందీ నటి షర్మిలా టాగోర్ దంపతుల కుమారుడే సైఫ్. వీరి పటౌడీ సంస్థానానికి చెందిన నవాబులు. సైఫ్ ముత్తాత, తండ్రి పటౌడీ నవాబులుగా ఉన్నారు. 1991లో ప్రముఖ హిందీ నటి అమృతా సింగ్ ను వివాహాం చేసుకున్నారు. వీరికి సారా అలీ ఖాన్, ఇబ్రహీం అలీ ఖాన్ జన్మించారు. దాదాపు 12 సంవత్సరాల తర్వాత 2004లో వీరిద్దరు విడాకులు తీసుకున్నారు. 2012 అక్టోబర్ 16న హీరోయిన్ కరీనా కపూర్ ను పెళ్లి చేసుకున్నారు. వీరికి తైమూర్ అలీ ఖాన్, జహంగీర్ అలీ ఖాన్ ఇద్దరు కుమారులున్నారు.

Saif Ali Khan's Personal Life

Saif Ali Khan’s Personal Life

కరీనా కపూర్ ఇన్ స్టా పోస్ట్..

నికర విలువ.. సైఫ్ అలీ ఖాన్ ఇప్పటివరకు దాదాపు రూ.1,180 కోట్లకు పైగానే సంపాదించారు. ఆయన సుమారు దశాబ్దాల కాలంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో చిత్రాలలో నటించారు. ముంబై ల్యాండ్‌స్కేప్‌లో అతనికి విలువైన ఆస్తులు ఉన్నాయి. ఫార్చ్యూన్ హైట్స్‌లో ఒక విలాసవంతమైన ఫ్లాట్ ఉంది. దీని విలువ సుమారు రూ. 4.2 కోట్లు. అదనంగా, అతను విశాలమైన ఇంటిని కలిగి ఉన్నాడు. మరికొన్ని ఇళ్లు అద్దెకు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ముంబైలో రూ. 6కోట్ల విలువైన బంగ్లా ఉంది. అలాగే స్విట్జర్లాండ్ లో సైఫ్ కోసం ప్రత్యేకమైన భవనం ఉంది. దాని విలువ రూ.33 కోట్లు. తన భార్య కరీనా కపూర్, కుమారులు తైమూర్, జహంగీర్ తో కలిసి వేకేషన్స్ వెళ్తుంటారు.

Sail Ali Khan's House

Sail Ali Khan’s House

కరీనా కపూర్ ఇన్ స్టా పోస్ట్..

పటౌడీ ప్యాలెస్.. సైఫ్ అలీ ఖాన్ ప్రతిష్టాత్మకమైన పూర్వీకుల ఇల్లు పటౌడీ ప్యాలెస్ హర్యానాలో ఉంది. గతంలో నవాబ్ ఇఫ్తికార్ ఖాన్, ఆ తర్వాత మన్సూర్ అలీఖాన్ ఆధీనంలో ఉండేది. ఇప్పుడు సైఫ్ ఆధీనంలో ఉంది. దాదాపు 10 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్యాలెస్ లో 150 గదులు, ఏడు పడక గదులు ఉన్నాయి. ఇబ్రహీం కోఠిగా పిలిచే ఈ పటౌడీ ప్యాలెస్ విలువ రూ.800 కోట్లు.

Pataudi Palace

Pataudi Palace

Sail Ali Khan Life

Sail Ali Khan Life

సైఫ్ కలల గ్యారేజ్.. సైఫ్ వద్ద అనేక విలువైన కార్లు ఉన్నారు. ఫోర్డ్ ముస్టాంగ్ GT (రూ. 74 లక్షల నుండి రూ. 76 లక్షలు), రేంజ్ రోవర్ వోగ్ (రూ. 2.39 కోట్ల నుండి 4.17 కోట్లు), ల్యాండ్ రోవర్ డిఫెండర్ (రూ. 93 లక్షలు), లెక్సస్ 470 (రూ. . 35 లక్షల నుండి రూ. 38 లక్షలు), BMW 7 సిరీస్ (రూ. 1.70 కోట్లు), Mercedes-Benz S- క్లాస్ (రూ. 1.71 కోట్ల నుండి 1.80 కోట్లు), ఆడి R8 (రూ. 2.72 కోట్లు).

సైఫ్ రెమ్యూనరేషన్… సైఫ్ అలీ ఖాన్.. బాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది స్టార్ హీరో. ఒక్కో సినిమాకు అతను రూ. 10 నుంచి 15 కోట్లు తీసుకుంటారు. ఇక ఆదిపురుష్ సినిమాలోని రావణ పాత్రకు రూ. 12 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. అలాగే ఎండార్స్మెంట్స్, ఓటీటీ వెంచర్లలోనూ సైఫ్ చాలా యాక్టివ్. వీటి ద్వారా రూ.28 నుంచి రూ. 30 కోట్ల వరకు ఉంటుందట.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.