ఏఐఎంఐఎం పార్టీ లోక్సభ ఎన్నికల ఫలితాలు
ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్(ఏఐఎంఐఎం) స్వాతంత్ర్యానికి చాలా కాలం ముందు ఏర్పడింది
ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్(ఏఐఎంఐఎం) స్వాతంత్ర్యానికి చాలా కాలం ముందు ఏర్పడింది. AIMIM పార్టీని 1927 నవంబర్ 12న నవాబ్ మహమూద్ ఖాన్ కిలేదార్ హైదరాబాద్లో స్థాపించారు. ఆ పార్టీ తెలంగాణలోనే కీలక పార్టీల్లో ఒకటి. ఆ పార్టీ ప్రధాన కార్యాలయం హైదరాబాద్లోని దారుస్సలాంలో ఉంది. తొలినాళ్లలో హైదరాబాద్కు మాత్రమే దీని ప్రాభవం పరిమితమయ్యింది. అయితే ఇప్పుడు ఈ పార్టీ పలు రాష్ట్రాలకు విస్తరిస్తోంది.
తన అభిప్రాయాలను ముక్కు సూటిగా వెల్లడించే అసదుద్దీన్ ఒవైసీ AIMIM అధినేత. దేశ రాజకీయాల్లో ఏఐఎంఐఎంకు ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. ఒవైసీకి చెందిన ఈ పార్టీ దేశంలోని పలు రాష్ట్రాల్లో ఎన్నికల్లో పోటీ చేసింది. తెలంగాణతో పాటు, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, గుజరాత్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఉత్తరాఖండ్, బీహార్ ఎన్నికల్లో AIMIM పోటీ చేసింది. ఔరంగాబాద్ లోక్సభ నియోజకవర్గం నుంచి ఎంఐఎంకి చెందిన ఇంతియాజ్ జలీల్ ఎంపీగా గెలిచారు. 2020 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ 5 స్థానాల్లో విజయం సాధించింది. తెలంగాణలో గతేడాది జరిగిన ఎన్నికల్లో ఏఐఎంఐఎం 7 స్థానాల్లో విజయం సాధించింది.
1984 నుండి హైదరాబాద్ లోక్సభ స్థానానికి AIMIM ప్రాతినిధ్యంవహిస్తోంది. హైదరాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి వరుసగా 4 సార్లు అసదుద్దీన్ ఒవైసీ స్వయంగా గెలుపొందారు. ఎంఐఎం ఎన్నికల గుర్తు గాలిపటం.
Party Name | Leads + Result | Party Logo | Party President | Party Establishment Year |
---|---|---|---|---|
Bharatiya Janata Party | JP Nadda | April 1980 | ||
Indian National Congress | Mallikarjun Kharge | December 1885 | ||
Aam Aadmi Party | Arvind Kejriwal | November 2012 | ||
Bahujan Samaj Party | Mayawati | April 1984 | ||
Communist Party of India (Marxist-Leninist) | Sitaram Yechury | November 1964 | ||
All India Majlis-E-Ittehadul Muslimeen | Asaduddin Owaisi | November 1927 | ||
Bharat Rashtra Samithi | K. Chandrashekar Rao | April 2001 | ||
Telugu Desam | N. Chandrababu Naidu | March 1982 | ||
Yuvajana Sramika Rythu Congress Party | YS Jagan Mohan Reddy | March 2011 |