TS TET 2023 Exam: తెలంగాణ ‘టెట్‌’కు ముగిసిన ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ.. గతేడాది కంటే లక్షన్నర తక్కువ..

గతేడాది జరిగిన టెట్‌ పరీక్షకు దాదాపు 6.28 లక్షల దరఖాస్తురాగా ఈసారి దరఖాస్తుల సంఖ్య లక్షన్నర వరకు తగ్గింది. ఇక టెట్‌ పరీక్ష రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష తేదీల్లో సెప్టెంబరు 15న పరీక్ష జరగనుంది. అయితే ఇప్పటి వరకు విద్యాశాఖ పరీక్షా కేంద్రాల సంఖ్యను వెల్లడించలేదు. దీంతో అభ్యర్ధులు ఆందోళన చెందుతున్నారు. రెండు పేపర్లకు పరీక్ష కేంద్రాలు ఒకే చోట వస్తాయో.. లేదా వేరేవేరు చోట్ల పరీక్ష కేంద్రాలు కేటాయిస్తారో తెలియక తికమక పడుతున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను తర్వాత..

TS TET 2023 Exam: తెలంగాణ ‘టెట్‌’కు ముగిసిన ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ.. గతేడాది కంటే లక్షన్నర తక్కువ..
TS TET 2023
Follow us
Srilakshmi C

|

Updated on: Aug 18, 2023 | 9:25 PM

హైదరాబాద్‌, ఆగస్టు 18: తెలంగాణ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (టెట్‌) 2023 దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 17 అర్ధరాత్రి 12 గంటలతో ముగిసింది. ఆన్‌లైన్‌ ఫీజు చెల్లింపులు కూడా గురువారంతోనే ముగిసింది. గడువు తేదీ ముగిసేనాటికి పేపర్‌-1, పేపర్‌-2కు కలిపి మొత్తం 4.78 లక్షల దరఖాస్తులు అందాయి. వాటిల్లో పేపర్‌-1కు 2,69,557 లక్షల దరఖాస్తులు రాగా, పేపర్‌-2కు 2,08,498 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఇక రెండు పేపర్లకు దరఖాస్తు చేసుకున్న వారు 1,86,997 మంది అభ్యర్ధులు ఉన్నారు. ఇక మొత్తం 2,91,058 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.

కాగా గతేడాది జరిగిన టెట్‌ పరీక్షకు దాదాపు 6.28 లక్షల దరఖాస్తురాగా ఈసారి దరఖాస్తుల సంఖ్య లక్షన్నర వరకు తగ్గింది. ఇక టెట్‌ పరీక్ష రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష తేదీల్లో సెప్టెంబరు 15న పరీక్ష జరగనుంది. అయితే ఇప్పటి వరకు విద్యాశాఖ పరీక్షా కేంద్రాల సంఖ్యను వెల్లడించలేదు. దీంతో అభ్యర్ధులు ఆందోళన చెందుతున్నారు. రెండు పేపర్లకు పరీక్ష కేంద్రాలు ఒకే చోట వస్తాయో.. లేదా వేరేవేరు చోట్ల పరీక్ష కేంద్రాలు కేటాయిస్తారో తెలియక తికమక పడుతున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను తర్వాత వెల్లడిస్తామని టెట్‌ కన్వీనర్‌ రాధారెడ్డి తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.