SSC GD Vacancy 2023 Revised: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. కానిస్టేబుల్‌ పోస్టులను 50,187కి పెంచిన స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌

కేంద్ర సాయుధ బలగాలైన బీఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, ఎస్‌ఎస్ఎఫ్‌, అస్సాం రైఫిల్స్‌లో కానిస్టేబుల్/రైఫిల్‌మ్యాన్/సిపాయి పోస్టుల కోసం జీడీ పరీక్ష రాసిన అభ్యర్ధులకు స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (SSC) గుడ్‌న్యూస్‌ చెప్పింది. పోస్టుల సంఖ్యను మరోసారి భారీగా పెంచుతూ..

SSC GD Vacancy 2023 Revised: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. కానిస్టేబుల్‌ పోస్టులను 50,187కి పెంచిన స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌
SSC GD Vacancy 2023 Revised
Follow us
Srilakshmi C

|

Updated on: Mar 20, 2023 | 9:47 PM

కేంద్ర సాయుధ బలగాలైన బీఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, ఎస్‌ఎస్ఎఫ్‌, అస్సాం రైఫిల్స్‌లో కానిస్టేబుల్/రైఫిల్‌మ్యాన్/సిపాయి పోస్టుల కోసం జీడీ పరీక్ష రాసిన అభ్యర్ధులకు స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (SSC) గుడ్‌న్యూస్‌ చెప్పింది. పోస్టుల సంఖ్యను మరోసారి భారీగా పెంచుతూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా పోస్టుల సంఖ్యను 50,187కి పెంచుతున్నట్టు ఎస్సెస్సీ ప్రకటించింది. నోటిఫికేషన్‌ విడుదల చేసిన సమయంలో పేర్కొన్న పోస్టుల సంఖ్యలో ఇప్పటికే రెండుసార్లు స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ సవరణ చేసింది. తొలుత సీఏపీఎఫ్‌ జీడీ కానిస్టేబుల్‌ ఉద్యోగ నియామక నోటిఫికేషన్‌లో 24,369 పోస్టులను కమిషన్‌ ప్రకటించింది. ఆ తర్వాత గతేడాది నవంబర్‌లో ఆ పోస్టుల సంఖ్యను 45,284కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో 1,151 ఖాళీలను కలపడంతో మొత్తం పోస్టుల సంఖ్య 46,435కి పెరిగింది. తాజాగా ఐటీబీపీ విభాగంలో మరో 3,257 పోస్టులను కలపడంతో మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య 50,187కు పెరిగింది.

దీంతో బీఎస్‌ఎఫ్‌లో 21,052 పోస్టులు, సీఐఎస్‌ఎఫ్‌లో 6,060 పోస్టులు, సీఆర్‌పీఎఫ్‌లో 11,169 పోస్టులు, ఎస్‌ఎస్‌బీలో 2,274 పోస్టులు, ఐటీబీపీలో 5,642 పోస్టులు, ఏఆర్‌లో 3,601 పోస్టులు, ఎస్‌ఎస్‌ఎఫ్‌లో 214 పోస్టులు, ఎన్‌సీబీలో 175 పోస్టులకు ఖాళీల సంఖ్య పెరిగాయి. మొత్తం ఖాళీలు 50,187కి చేరుకున్నాయి. కాగా కానిస్టేబుల్‌(జీడీ)/ రైఫిల్‌మ్యాన్‌(జీడీ) ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ ఏడాది జనవరిలో కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష నిర్వహించింది. ఈ పరీక్షకు సంబంధించి ప్రిలిమినరీ ఆన్సర్ కీ ఫిబ్రవరి 18న విడుదల చేసింది. ఫలితాలు వెల్లడించాక శారీరక సామర్థ్య పరీక్షలు నిర్వహించి తుది ఎంపిక ప్రక్రియను చేపట్టనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.