Gold Price Today: పెరుగుతున్న బంగారం ధరలకు బ్రేక్.. తెలుగు రాష్ట్రాల్లో తులం రేటు ఎంత ఉందంటే..?

Gold, Silver Price Today: బులియన్ మార్కెట్‌లో గత కొన్ని రోజులుగా బంగారం ధరలు పరుగులు పెడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పెరుగుతున్న ధరలకు బ్రేక్ పడింది. తాజాగా.. బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతుండగా.. వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి.

Gold Price Today: పెరుగుతున్న బంగారం ధరలకు బ్రేక్.. తెలుగు రాష్ట్రాల్లో తులం రేటు ఎంత ఉందంటే..?
Gold Price
Follow us
Shaik Madar Saheb

|

Updated on: May 03, 2023 | 6:23 AM

Gold, Silver Price Today: బులియన్ మార్కెట్‌లో గత కొన్ని రోజులుగా బంగారం ధరలు పరుగులు పెడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పెరుగుతున్న ధరలకు బ్రేక్ పడింది. తాజాగా.. బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతుండగా.. వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. బుధవారం (మే 03) ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.55,700 లు ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.60,7600 గా ఉంది. కాగా, కిలో వెండి ధర రూ.100 మేర పెరిగి రూ.76,100 గా కొనసాగుతోంది. కాగా, దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

  • దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,850 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,910 గా ఉంది.
  • ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,760
  • చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.56,150, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,250
  • కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,760
  • బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,810 లుగా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో..

  • హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,700 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.60,760 గా ఉంది.
  • విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,760
  • విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,760 లుగా కొనసాగుతోంది.

వెండి ధరలు..

ఢిల్లీలో కిలో వెండి ధర రూ.76,100 లుగా ఉంది. ముంబైలో కిలో వెండి ధర రూ.76,100, చెన్నైలో కిలో వెండి ధర రూ.80,500, బెంగళూరులో రూ.80,700, కేరళలో రూ.80,500, కోల్‌కతాలో రూ.76,100, హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.80,500, విజయవాడలో రూ.80,500, విశాఖపట్నంలో రూ.80,500 లుగా కొనసాగుతోంది.

గమనిక: ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..