S Haseena

S Haseena

Associate Editor - TV9 Telugu

haseena.shaik@tv9.com

ఎలక్ట్రానిక్ మీడియాలో 20 ఏళ్ల అనుభవం ఉంది. తిరుపతిలో మాస్టర్స్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చదివి 2003లో టీవీ9 ఛానెల్‌లో క్రైమ్ రిపోర్టర్‌గా కెరీర్ ప్రారంభించాను. 2008లో సాక్షి ఛానెల్‌లో క్రైమ్ బ్యూరో చీఫ్‌గా, యాంకర్‌గా పని చేశాను. 2011 లో తిరిగి టీవీ9లో పొలిటికల్ రిపోర్టర్‌గా జాయిన్ అయ్యాను. ప్రస్తుతం అమరావతి నుంచి టీవీ9 ఏపీ అసోసియేట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను.

Read More
Follow On:
AP BJP: వైసీపీపై దూకుడు పెంచిన బీజేపీ.. అగ్రనేతల ఎంట్రీతో కొత్త జోష్.. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై ఉద్య‌మాల‌కు కార్యాచ‌ర‌ణ‌..

AP BJP: వైసీపీపై దూకుడు పెంచిన బీజేపీ.. అగ్రనేతల ఎంట్రీతో కొత్త జోష్.. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై ఉద్య‌మాల‌కు కార్యాచ‌ర‌ణ‌..

భార‌తీయ జ‌న‌తాపార్టీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ అధ్య‌క్షురాలిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత పార్టీ కార్య‌వ‌ర్గంలో భారీగా మార్పులు చేసారు పురంధేశ్వ‌రి.గ‌తంలో సోము వీర్రాజు అధ్య‌క్షుడిగా ఉన్న స‌మ‌యంలో కీల‌క ప‌ద‌వుల్లో ఉన్న వారిని చాలామందిని ప‌క్క‌కు త‌ప్పించ‌డంతో పాటు కొంత‌మంది నేత‌ల‌కు వేరే బాధ్య‌త‌లు అప్ప‌గించారు.సామాజిక స‌మీక‌ర‌ణాల‌కు పెద్ద‌పీట వేస్తూ పార్టీ బ‌లోపేతానికి కష్ట‌ప‌డే నేత‌ల‌ను త‌న టీంలోకి తీసుకున్నారు.ఇప్ప‌టికే ఆయా రాష్ట్ర స్థాయి నేత‌లు ప్ర‌భుత్వంపై తీవ్రంగా విమ‌ర్శ‌లు చేస్తున్నారు.

AP Politics: జనసేనతో జై కొట్టుడా.. నైకొట్టుడా.. క‌లిసి ముందుకెళ్లడంపై క్లారిటీకి వచ్చిన ఏపీ బీజేపీ..

AP Politics: జనసేనతో జై కొట్టుడా.. నైకొట్టుడా.. క‌లిసి ముందుకెళ్లడంపై క్లారిటీకి వచ్చిన ఏపీ బీజేపీ..

ప్ర‌స్తుతం ఇరు పార్టీల అధ్యక్షులు క‌ల‌వ‌క‌పోయినా కొన్ని విష‌యాల్లో మాత్రం క్యాడ‌ర్ తో క‌లిసి ప‌నిచేయాల‌ని నిర్న‌యానికి వ‌చ్చాయి. మొద‌టి నుంచీ మిత్ర‌పక్షం ప్ర‌స్తావ‌న బీజేపీ నేత‌లే తీసుకొస్తున్నారు. అయితే ఇటీవ‌ల స్థానిక సంస్థ‌ల నిధులు మ‌ళ్లింపు,స‌ర్పంచ్ ల స‌మ‌స్య‌ల‌పై ప్ర‌భుత్వ తీరుపై రెండు పార్టీలు ఆందోళ‌న‌లు నిర్వ‌హించాయి. జిల్లా కేంద్రాల వ‌ద్ద జ‌రిగిన ధ‌ర్నాల్లో బీజేపీ నాయ‌కుల‌తో క‌లిసి జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు కూడా పాల్గొన్నారు.

Pawan Kalyan’s Varahi Yatra: పవన్ వారాహి యాత్ర రూటు మారనుందా?.. నాలుగో విడతపై ఇంట్రిస్టింగ్ డిస్కర్షన్..!

Pawan Kalyan’s Varahi Yatra: పవన్ వారాహి యాత్ర రూటు మారనుందా?.. నాలుగో విడతపై ఇంట్రిస్టింగ్ డిస్కర్షన్..!

మూడు విడ‌త‌లు వారాహి యాత్ర పూర్తి చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్.. పార్టీ కేడ‌ర్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపారు. ఉమ్మడి గోదావ‌రి జిల్లాలు టార్గెట్‌గా ప‌వ‌న్ త‌న మొదటి యాత్ర ప్రారంభించారు. గోదావ‌రి జిల్లాల‌ను వైసీపీ నుంచి విముక్తి క‌లిగించాలంటూ త‌న ప‌ర్యట‌న కొన‌సాగించారు. అంద‌రూ ఊహించిన దానికంటే ఎక్కువ‌గానే ప‌వ‌న్ జోరు కొన‌సాగింది. ప్రధానంగా పార్టీకి ఎక్కువ ప‌ట్టు ఉన్న గోదావ‌రి జిల్లాల‌ను మొద‌టి ప్రయార్టీగా పెట్టుకోవ‌డం ప‌వ‌న్‌కు బాగా క‌లిసొచ్చింది. ప్రభుత్వంపై..

AP Politics: లోకేష్ పాద‌యాత్ర‌కు దూరంగా ఆ ఇద్ద‌రు కీల‌క నేత‌లు.. పార్టీలో మొదలైన చర్చ..

AP Politics: లోకేష్ పాద‌యాత్ర‌కు దూరంగా ఆ ఇద్ద‌రు కీల‌క నేత‌లు.. పార్టీలో మొదలైన చర్చ..

Lokesh Yuva Galam: రాజ‌కీయ ఆధిప‌త్యం కోసం జిల్లాలో ఉన్న మెజార్టీ ఇంచార్జిలు,ఎమ్మెల్యేల‌ను త‌న‌వైపు తిప్పుకునే ప్ర‌య‌త్నం చేసారు చిన్ని. దీంతో అవ‌కాశం దొరికిన‌ప్పుడ‌ల్లా అధిష్టానంపై, కొంత‌మంది నాయ‌కుల‌మీదా త‌న అక్క‌సు వెళ్ల‌గ‌క్కుతున్నారు ఎంపీ కేశినేని.అటు లోకేష్ యువ‌గ‌ళం పాద‌యాత్ర బాధ్య‌త‌లు కూడా సోద‌రుడు చిన్నికి అప్ప‌గించ‌డంతో మ‌రింత అసంతృప్తికి లోన‌య్యార‌ని స‌మాచారం. లోకేష్ పాద‌యాత్ర విజ‌య‌వాడ‌లో కొన‌సాగిన‌ప్ప‌డు..

Andhra Pradesh: ఆ నాయకుడికి అనివార్యంగా మారిన గెలుపు.. అందరి చూపు ఆ నియోజకవర్గంపైనే

Andhra Pradesh: ఆ నాయకుడికి అనివార్యంగా మారిన గెలుపు.. అందరి చూపు ఆ నియోజకవర్గంపైనే

గన్నవరం లో ఇపుడు హాట్ హాట్ పాలిటిక్స్‌ కొనసాగుతున్నాయి. వచ్చే 2024 ఎన్నిక వల్లభనేని వంశీ కి అత్యంత కీలకం కానుంది. వంశీ రాజకీయ జీవితంలోనే ఇపుడు ఇక్కడ నుంచి పోటీ చేయటం ఒక టర్నింగ్ పాయింట్ కానుంది. ఒకవిధంగా చెప్పాలంటే వంశీ కి గెలుపు అనివార్యం అయింది. 2014 ఎన్నిక ముందు వంశీ దాదాపు వైఎస్సార్సీపీలో చేరినట్టే అని అంత అనుకొన్నారు. విజయవాడ ఎన్నికల ప్రచార సమయం లో వంశీ నీ ఆలింగనం చేసుకున్నారు దృశ్యం చాలా మందికి గుర్తుండే వుంటుంది...

Tirupati: టీటీడీ బోర్డు మెంబర్ ఎవరికి దక్కేనో.. తేల్చలేక తలలు పట్టుకొంటున్న పార్టీ పెద్దలు.. పరిశీలనలో వారి పేర్లు..!

Tirupati: టీటీడీ బోర్డు మెంబర్ ఎవరికి దక్కేనో.. తేల్చలేక తలలు పట్టుకొంటున్న పార్టీ పెద్దలు.. పరిశీలనలో వారి పేర్లు..!

Tirupati: తిరుమల తిరుపతి దేశస్థానంలోని ఆ పదవి మాకు ఇవ్వాలంటే మాకే ఇవ్వాలని ప్రెషర్ పెడుతున్నారు పార్టీలోని కొందరు నాయకులు. ఆ ఒత్తిడి కేంద్రంలో పెద్ద పెద్ద దిగ్గజాల దగ్గరి నుంచి పొరుగు రాష్ట్రాలు సమీప రాష్ట్రాల పెద్దల నుంచి వస్తుంది. వీరంతా సిఫారసులు చేస్తుంటే ఎవరికి ఆ పదవులు ఇవ్వాలి అనే దానిపై తర్జన భర్జన పడుతున్నారు అధికార పార్టీ పెద్దలు. ఆ పదవి మరేదో కాదు, ఎంతో ప్రతిష్టాత్మకమైన టీటీడీ బోర్డ్ మెంబెర్స్ పదవి. దీని కోసం ఆశావహుల..

Andhra Pradesh: సీఎం జగన్ కీలక నిర్ణయం.. నామినేటెడ్ పదవుల్లో ఎక్కువ మంది పాతవారికే ఛాన్స్..

Andhra Pradesh: సీఎం జగన్ కీలక నిర్ణయం.. నామినేటెడ్ పదవుల్లో ఎక్కువ మంది పాతవారికే ఛాన్స్..

ఆయా సామాజిక వర్గాలకు పెద్ద సంఖ్యలో కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా 53 బీసీ కార్పొరేషన్లు, ఎస్సీ, ఎస్టీ కమీషన్‌లు, ఇతర కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. ఇక ప్రభుత్వ శాఖల అభివృద్ధికి సంబందించిన కార్పోరేషన్‌లు కూడా ఉన్నాయి. వీటిలో 100కు పైగా కార్పొరేషన్‌లకు బోర్డుల పదవీకాలం ముగిసింది. ఇక తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇప్పటికే చైర్మన్ గా భూమన కరుణాకర్ రెడ్డి ని నియమించారు ముఖ్యమంత్రి. చైర్మన్‌తో పాటు బోర్డు సభ్యుల పదవీకాలం కూడా ముగియడంతో కొత్త సభ్యులను నియమించే పనిలో ఉన్నారు జగన్.

Vangaveeti Radha Krishna: పెళ్లి పీటలెక్కనున్న వంగవీటి రాధాకృష్ణ.. త్వరలోనే ఎంగేజ్‌మెంట్.. అమ్మాయి ఎవరంటే..

Vangaveeti Radha Krishna: పెళ్లి పీటలెక్కనున్న వంగవీటి రాధాకృష్ణ.. త్వరలోనే ఎంగేజ్‌మెంట్.. అమ్మాయి ఎవరంటే..

Vangaveeti Radha Krishna: వంగవీటి రాధా కృష్ణ.. గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఏపీ పాలిటిక్స్ లో కీలక నేత.. పొలిటికల్ లీడర్ అయిన రాధా.. పెళ్ళి ఎప్పుడు చేసుకుంటారని ఆయన అభిమానులు ఎప్పటినుంచో ఎదురచూస్తున్నారు. ఆ సమయం రానే వచ్చింది. త్వరలోనే వంగవీటి రాధా పెళ్ళి చేసుకోనున్నారు. ప్రస్తుతం ఈ వార్త వంగవీటి అభిమానుల్లో ఆనందాన్ని కలిగిస్తోంది.

Rushikonda Issue: రిషికొండపై నిర్మాణాలకు పర్మిషన్లు లేవా? మరి వివాదం ఎందుకు? ఏం జరుగుతోంది..

Rushikonda Issue: రిషికొండపై నిర్మాణాలకు పర్మిషన్లు లేవా? మరి వివాదం ఎందుకు? ఏం జరుగుతోంది..

Visakhapatnam News: విశాఖపట్నంలో రిషికొండలో ప్రభుత్వ నిర్మాణాలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో రగిలిస్తున్న వేడి అంతా ఇంతాకాదు. మొత్తం ఈ అంశం చుట్టూనే ఉత్తరాంధ్ర సహా, విశాఖ రాజకీయాలు నడుస్తున్నాయి. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ వరుసగా రెండోసారి రిషికొండను విజిట్‌ చేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితోపాటు, ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోశారు. పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలపైనే అటు వైసీపీ నుంచికూడా కౌంటర్లు గట్టిగానే పడ్డాయి. ఇది పక్కనపెడితే అసలు..

Bhola Shankar: చిరంజీవి భోళాశంకర్‌ సినిమా టికెట్ల విషయంలో ఏం జరిగింది..? కారణాలేంటీ.. ఆ ఆరోపణల్లో నిజమెంత..

Bhola Shankar: చిరంజీవి భోళాశంకర్‌ సినిమా టికెట్ల విషయంలో ఏం జరిగింది..? కారణాలేంటీ.. ఆ ఆరోపణల్లో నిజమెంత..

Bhola Shankar Ticket Price Controversy: సినిమా టికెట్ల రేట్లు పెంచుకునేందుకు సమాచార ప్రసార విభాగం జారీ చేసిన నిబంధనల ప్రకారం మొత్తం సెన్సార్‌ అయిన సినిమాలో కనీసం 20 శాతం సినిమా షూటింగ్‌ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో జరగాలనే ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ సూచించింది. అనుమతి కోరుతూ నిర్మాతలిచ్చిన లేఖలో వైజాగ్‌ పోర్టు, అరకులో 25 రోజులు పాటు షూటింగ్‌ చేసినట్టు ప్రకటించారు.

AP Politics: తమ్ముని వెంటే అన్నయ్య..! మధ్యలో టీడీపీ.. ‘చిరు’ వ్యాఖ్యలతో దూకుడు పెంచిన వైసీపీ..  

AP Politics: తమ్ముని వెంటే అన్నయ్య..! మధ్యలో టీడీపీ.. ‘చిరు’ వ్యాఖ్యలతో దూకుడు పెంచిన వైసీపీ..  

పిచ్చుకపై బ్రహ్మాస్త్రం ఎందుకు.. సార్.. అంటూ చిరు చేసిన కామెంట్స్ తో ఏపీలో ఒక్కసారిగా రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. ఏపీకి ప్రత్యేక హోదా తీసుకురావడంతో పాటు రోడ్లను అభివృద్ధి చేయండి.. అంటూ జగన్ ప్రభుత్వంపై వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి వ్యాఖ్యలపై వైసీపీ ప్రభుత్వం రియాక్ట్ కావడంతో అటు టీడీపీ, ఇటు చిరంజీవి అభిమానులు కూడా ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు.

Andhra Pradesh: ఏపీలో అప్పుడే మొదలైన ఎన్నికల హడావుడి.. వ్యూహాలకు పదును పెడుతోన్న నాయకులు

Andhra Pradesh: ఏపీలో అప్పుడే మొదలైన ఎన్నికల హడావుడి.. వ్యూహాలకు పదును పెడుతోన్న నాయకులు

రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాల‌ను ఇచ్చిన మాట ప్రకారం ఎన్నిక‌ల వ‌ర‌కూ అందేలా ముందుకెళ్తున్నట్లు ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. ఇక వృద్దాప్య పెన్షన్‌లు కూడా ఇచ్చిన హామీ ప్రకారం వ‌చ్చే జ‌న‌వ‌రి నుంచి మూడు వేల‌కు పెంచాల్సి ఉంద‌ని చెబుతున్నారు. ఇలా అన్ని హామీలు మాట త‌ప్పకుండా పూర్తిచేయాల్సి ఉంది కాబ‌ట్టి ముందస్తు ఊసే లేద‌ని అంటున్నారు.ఇటీవ‌ల కూడా ప్రభుత్వం ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళుతుంద‌ని పెద్ద ఎత్తున ప్రచారం జ‌రిగితే స్వయంగా వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యద‌ర్శి...