Tirupati: టీటీడీ బోర్డు మెంబర్ ఎవరికి దక్కేనో.. తేల్చలేక తలలు పట్టుకొంటున్న పార్టీ పెద్దలు.. పరిశీలనలో వారి పేర్లు..!
Tirupati: తిరుమల తిరుపతి దేశస్థానంలోని ఆ పదవి మాకు ఇవ్వాలంటే మాకే ఇవ్వాలని ప్రెషర్ పెడుతున్నారు పార్టీలోని కొందరు నాయకులు. ఆ ఒత్తిడి కేంద్రంలో పెద్ద పెద్ద దిగ్గజాల దగ్గరి నుంచి పొరుగు రాష్ట్రాలు సమీప రాష్ట్రాల పెద్దల నుంచి వస్తుంది. వీరంతా సిఫారసులు చేస్తుంటే ఎవరికి ఆ పదవులు ఇవ్వాలి అనే దానిపై తర్జన భర్జన పడుతున్నారు అధికార పార్టీ పెద్దలు. ఆ పదవి మరేదో కాదు, ఎంతో ప్రతిష్టాత్మకమైన టీటీడీ బోర్డ్ మెంబెర్స్ పదవి. దీని కోసం ఆశావహుల..
తిరుపతి, ఆగస్టు 19: ఆంధ్రపదేశ్ ముఖ్య మంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఇప్పుడు పెద్ద చిక్కే వచ్చి పడింది. తిరుమల తిరుపతి దేశస్థానంలోని ఆ పదవి మాకు ఇవ్వాలంటే మాకే ఇవ్వాలని ప్రెషర్ పెడుతున్నారు పార్టీలోని కొందరు నాయకులు. ఆ ఒత్తిడి కేంద్రంలో పెద్ద పెద్ద దిగ్గజాల దగ్గరి నుంచి పొరుగు రాష్ట్రాలు సమీప రాష్ట్రాల పెద్దల నుంచి వస్తుంది. వీరంతా సిఫారసులు చేస్తుంటే ఎవరికి ఆ పదవులు ఇవ్వాలి అనే దానిపై తర్జన భర్జన పడుతున్నారు అధికార పార్టీ పెద్దలు. ఆ పదవి మరేదో కాదు, ఎంతో ప్రతిష్టాత్మకమైన టీటీడీ బోర్డ్ మెంబెర్స్ పదవి. దీని కోసం ఆశావహుల సంఖ్య నానాటికీ పెరిగిపోవటం, రికమండేషన్ లిస్టు కూడా ఎక్కువై పోవటంతో టీటీడీ బోర్డ్ మెంబెర్స్ జాబితాను తయారు చేయటం తలకు మించిన భారంగా మారింది.
అయితే ఇప్పటికే జాబితా సిద్దం చేయటం కోసం పలు మార్లు పార్టీ పెద్దలలో సీఎం జగన్ సమావేశం అయ్యారు. అయినా లిస్ట్ ఇంకా ఫైనల్ కాలేదు. వచ్చే రెండు మూడు రోజుల్లో జాబితా రిలీజ్ చేస్తామని సజ్జలు రామకృష్ణ రెడ్డి ఇటీవలే అన్నారు. తిరుపతి తిరుమల దేశస్థానం బోర్డ్ చైర్మన్‌తో పాటు టీటీడీ బోర్డు మెంబర్లు 25 మంది వుంటారు. తాజాగా టీటీడీ చైర్మెన్‌గా భూమన కరుణాకర రెడ్డిని నియమించిన సంగతి తెలిసిందే. ఇక మిగతా 24 మంది బోర్డ్ మెంబెర్స్‌ను నియమించాల్సి వుంది. ఈ లిస్టులో కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర నుంచి ఆలయ అభివృద్ధికి పాటు పడుతున్న పారిశ్రామిక వేత్తలకు కూడా చోటు కల్పించాల్సి వుంది. ఇంతే కాక వివిధ సామాజిక వర్గాల వారికి కూడా టీటీడీ బోర్డ్ మెంబర్లుగా ప్రాతినిధ్యం కల్పించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో టీటీడీ బోర్డు కూర్పు అన్నది ఇప్పుడు కష్టంగా మారింది.
కాగా, ఎమ్మెల్యే కోటాలో ఏపీ నుంచి పేర్ని నాని, ద్వారంపూడి చంద్ర శేఖర్ రెడ్డి, అలజంగి జోగారావుకి బోర్డ్ మెంబర్లుగా అవకాశం దక్కనుందని ప్రచారం సాగుతోంది. అలాగే పశ్చిమ గోదావరి జిల్లా నుంచి సుబ్బరాజు, రంగావతి.. రాయలసీమ నుంచి ఆనందరెడ్డి సహా రాష్ట్రంలోని వివిధ సామాజిక వర్గాలకు చెందిన ప్రముఖులను.. కర్ణాటక నుంచి సిద్ధరామయ్య కోటలో దేశ్‌పాండేని తీసుకోనున్నారన్న చర్చలు సాగుతున్నాయి. అయితే ఇవన్నీ ఎంత వరకు నిజమో, లేదో ఇంకా తెలియాల్సి ఉంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..