Pawan Kalyan’s Varahi Yatra: పవన్ వారాహి యాత్ర రూటు మారనుందా?.. నాలుగో విడతపై ఇంట్రిస్టింగ్ డిస్కర్షన్..!

మూడు విడ‌త‌లు వారాహి యాత్ర పూర్తి చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్.. పార్టీ కేడ‌ర్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపారు. ఉమ్మడి గోదావ‌రి జిల్లాలు టార్గెట్‌గా ప‌వ‌న్ త‌న మొదటి యాత్ర ప్రారంభించారు. గోదావ‌రి జిల్లాల‌ను వైసీపీ నుంచి విముక్తి క‌లిగించాలంటూ త‌న ప‌ర్యట‌న కొన‌సాగించారు. అంద‌రూ ఊహించిన దానికంటే ఎక్కువ‌గానే ప‌వ‌న్ జోరు కొన‌సాగింది. ప్రధానంగా పార్టీకి ఎక్కువ ప‌ట్టు ఉన్న గోదావ‌రి జిల్లాల‌ను మొద‌టి ప్రయార్టీగా పెట్టుకోవ‌డం ప‌వ‌న్‌కు బాగా క‌లిసొచ్చింది. ప్రభుత్వంపై..

Pawan Kalyan's Varahi Yatra: పవన్ వారాహి యాత్ర రూటు మారనుందా?.. నాలుగో విడతపై ఇంట్రిస్టింగ్ డిస్కర్షన్..!
Pawan Kalyan's Varahi Yatra
Follow us
S Haseena

| Edited By: TV9 Telugu

Updated on: Oct 19, 2023 | 3:05 PM

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్ర మళ్లీ ఎప్పుడు? మూడు విడతల విజయ యాత్ర ద్వారా మూడు ఉమ్మడి జిల్లాల్లో పర్యటించిన పవన్ కళ్యాణ్.. నాలుగో విడత యాత్రకు కాస్త గ్యాప్ తీసుకుంటారని తెలిసింది. ఎన్నికలకు సుమారు ఏడాది ముందుగా వారాహి ద్వారా ప్రజల్లోకి ఎంట్రీ ఇచ్చారు పవన్ కళ్యాణ్. అప్పటి వరకూ స్తబ్దుగా ఉన్న జనసేన నేతలు, కార్యకర్తలకు వారాహి యాత్ర మంచి ఊపునిచ్చింది.

మూడు విడ‌త‌లు వారాహి యాత్ర పూర్తి చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్.. పార్టీ కేడ‌ర్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపారు. ఉమ్మడి గోదావ‌రి జిల్లాలు టార్గెట్‌గా ప‌వ‌న్ త‌న మొదటి యాత్ర ప్రారంభించారు. గోదావ‌రి జిల్లాల‌ను వైసీపీ నుంచి విముక్తి క‌లిగించాలంటూ త‌న ప‌ర్యట‌న కొన‌సాగించారు. అంద‌రూ ఊహించిన దానికంటే ఎక్కువ‌గానే ప‌వ‌న్ జోరు కొన‌సాగింది. ప్రధానంగా పార్టీకి ఎక్కువ ప‌ట్టు ఉన్న గోదావ‌రి జిల్లాల‌ను మొద‌టి ప్రయార్టీగా పెట్టుకోవ‌డం ప‌వ‌న్‌కు బాగా క‌లిసొచ్చింది. ప్రభుత్వంపై విమ‌ర్శలు ఎక్కుపెడుతూ యాత్రను కొన‌సాగించారు ప‌వ‌న్ క‌ళ్యాణ్.

జూన్ 14వ తేదీన క‌త్తిపూడి నుంచి ప్రారంభ‌మైన మొద‌టి విడ‌త టూర్ అదే నెల 30వ తేదీన భీమ‌వ‌రం స‌భ‌తో ముగిసింది. ఉమ్మడి జిల్లాల్లో ప‌ది నియోజ‌క‌వ‌ర్గాల‌ను ప‌వ‌న్ త‌న మొద‌టి ప‌ర్యట‌న ద్వారా క‌వ‌ర్ చేసారు. ఇక జూలై 9న ఏలూరు నుంచి రెండో విడ‌త యాత్ర ప్రారంభ‌మై 14వ తేదీన త‌ణుకు స‌భ‌తో ముగిసింది. ఆ త‌ర్వాత చేరికలు, ఇత‌ర కార్యక్రమాలతో వారాహి మూడో విడ‌త యాత్రకు కాస్త గ్యాప్ వ‌చ్చింది. ఆగస్ట్ 10 నుంచి 19 వరకూ ఉమ్మడి విశాఖ జిల్లాలో వారాహి టూర్ కొనసాగించారు పవన్ కళ్యాణ్. అయితే వారాహి యాత్ర తిరిగి ప్రరంభించడానికి కొంచెం విరామం తీసుకుంటారని జనసేన వర్గాలు చెబుతున్నాయి.

వారాహి యాత్ర రూటు మారనుందా?

ఇప్పటికే మూడు విడతలు వారాహి యాత్ర ద్వారా పార్టీలో కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చారు పవన్ కళ్యాణ్. అంతే కాదు వారాహి టూర్ ద్వారా జనసేన పార్టీ గ్రాఫ్ కూడా పెరిగిందని పార్టీ నేతలు చెబుతున్నారు. ఉమ్మడి గోదావరి జిల్లాల్లో జనసేనకు మంచి పట్టుంది. సామాజిక సమీకరణాల ప్రకారం కూడా ఈ జిల్లాలో పార్టీకి మంచి కేడర్ ఉంది. దీంతో ఉమ్మడి గోదావరి జిల్లాల్లో ఊహించిన దానికంటే ఎక్కువ ఆదరణ వచ్చింది. అదే ఊపుతో రెండో విడత యాత్ర కూడా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని చేశారు పవన్ కళ్యాణ్. మూడో విడత యాత్రను ఉమ్మడి విశాఖ జిల్లాలో కొనసాగించారు. అయితే కేవలం రెండు బహిరంగ సభలు మాత్రమే నిర్వహించి.. మిగిలిన రోజులు క్షేత్ర పర్యటనలు చేశారాయన. నాలుగో విడత వారాహి యాత్రను సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభించే ఆలోచనలో ఉన్నారట. అయితే ఈసారి యాత్రను ఉమ్మడి విజయనగరం జిల్లాలో జరపాలని కొంతమంది నేతలు కోరుతున్నప్పటికీ.. కృష్ణా లేదా గుంటూరు జిల్లాలో చేస్తే ఎలా ఉంటుందనే దానిపై ఆయా జిల్లాల నేతల అభిప్రాయాలు తీసుకుంటున్నారట. వీలైతే ఈసారి రూటు మార్చి కృష్ణా లేదా గుంటూరు జిల్లాలో జరపడం ద్వారా అక్కడ పార్టీ బలోపేతం అవుతుందని కూడా ఆలోచనలో ఉన్నారట.

నాలుగో విడత టార్గెట్ ఏంటి?

ఒక్కో విడత వారాహి యాత్రలో ప్రభుత్వంపై పలురకాలుగా విమర్శల దాడి చేస్తున్నారు జనసేన అధినేత. మొదటి విడతలో ఇసుక అక్రమాలు వంటి అరోపణలు, రెండో విడతలో వాలంటీర్లపై చేసిన కామెంట్స్ రాజకీయంగా రచ్చకు దారి తీశాయి. మూడో విడతలో విశాఖపట్నం జిల్లా పర్యటనలో రుషికొండ, ఎర్ర మట్టి దిబ్బలు పరిశీలనతో విమర్శల వేడి పెంచారు. ప్రభుత్వంపై విమర్శలు పెంచడం ద్వారా పార్టీకి మంచి మైలేజీ వస్తుందని చెప్తున్నారు. అందుకే నాలుగో విడత యాత్రకు అదే రకంగా ముందుకెళ్లేలా జనసేన అధినేత కసరత్తు చేస్తున్నారని పార్టీ వర్గాల సమాచారం. కొంచెం ఆలస్యంగా నాలుగో విడత యాత్ర ప్రారంభించి విమర్శల పదును పెంచేలా ముందుకెళ్తున్నారని జనసేన వర్గాలు చెబుతున్నాయి.

మొత్తానికి పవన్ వారాహి యాత్ర ఎప్పుడు ఉంటుంది? ఎలాంటి టార్గెట్‌తో ముందుకు వెళ్తారు అనేది రాజకీయవర్గాల్లో చర్చగా మారింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..