Daily Horoscope: వారు ఒకటి రెండు శుభవార్తలు.. 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు..!
Horoscope Today in Telugu(August 23): జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహనక్షత్రాలు మీ జాతకచక్రానికి అనుకూలంగా ఉన్నాయా..? ఆరోగ్యం, ఆర్థికపరంగా మీ జాతకం ఎలా ఉండబోతుంది..? ఉద్యోగపరంగా మీ రాశికి దిన ఫలాలు సానుకూలంగానే ఉన్నాయా..? ఆగస్టు 23, 2023న(బుధవారం) 12 రాశుల వారి రాశిఫలాలు ఎలా ఉంటాయో తెలుసుకోండి..
Horoscope Today in Telugu(August 23): జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహనక్షత్రాలు మీ జాతకచక్రానికి అనుకూలంగా ఉన్నాయా..? ఆరోగ్యం, ఆర్థికపరంగా మీ జాతకం ఎలా ఉండబోతుంది..? ఉద్యోగపరంగా మీ రాశికి దిన ఫలాలు సానుకూలంగానే ఉన్నాయా..? ఆగస్టు 23, 2023న(బుధవారం) 12 రాశుల వారి రాశిఫలాలు ఎలా ఉంటాయో తెలుసుకోండి..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): ఆర్థికంగా అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది. బంధువుల నుంచి శుభ కార్యాలకు సంబంధించిన ఆహ్వానాలు అందుతాయి. తలపెట్టిన కార్యకలాపాలు సజావుగా సాగిపోతాయి. వృత్తి ఉద్యోగాలు కొత్త పుంతలు తొక్కుతాయి. కొత్త ప్రాజెక్టులు, కొత్త కార్యక్రమాలు ఊపందుకుం టాయి. వ్యాపారాల్లో మీ ఆలోచనలు, వ్యూహాలు లాభాలను తీసుకు వస్తాయి. దైవ చింతన పెరుగుతుంది. విద్యార్థులు పురోగతి చెందుతారు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగుతాయి.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): వృత్తి, ఉద్యోగాలలో ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు. ప్రయాణాల్లో మంచి పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులు వేగంగా పూర్తి చేస్తారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారాల్లో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. దూర ప్రాంత బంధువులతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. కొద్ది శ్రమతో విద్యార్థులు రాణిస్తారు.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక సమస్యలు, ఆర్థిక సంబంధమైన ప్రతిబంధకాలు తగ్గిపోతాయి. ఆదాయం పెరుగుతుంది కానీ, అందుకు దీటుగా ఖర్చులు కూడా పెరుగుతాయి. ఉద్యోగ జీవితంలో సాను కూల వాతావరణం ఉంటుంది. అధికారులు మీ సలహాలు, సూచనలతో ప్రయోజనం పొందుతారు. కుటుంబ సభ్యులతో సామరస్యం పెరుగుతుంది. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. ఆస్తిపాస్తులకు సంబంధించి విలువైన సమాచారం అందుకుంటారు. విద్యార్థులు పురోగతి సాధిస్తారు.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): అధికారులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. అపార్థాలు తలెత్తే సూచనలున్నాయి. జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగిపోతాయి. ముఖ్యమైన పనులు, కార్యకలాపాలు నిదానంగా పూర్తవుతాయి. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. పుణ్యకార్యాల్లో పాల్గొంటారు. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. ఆహార, విహార విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేసుకో గలుగుతారు. ఇంటికి బంధువుల రాకపోకలుంటాయి. పిల్లల చదువుల విషయంలో శుభ వార్తలు అందుకుంటారు. ఉద్యోగ జీవితం సంతృప్తికరంగా సాగిపోతుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో రాబడి పెరిగే అవకాశం ఉంది. ఒకటి రెండు శుభవార్తలు వింటారు. రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. విద్యార్థులకు సమయం బాగుంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): తలపెట్టిన పనులన్నిటినీ పట్టుదలగా పూర్తి చేస్తారు. చిన్ననాటి స్నేహితులు సహాయ సహకారాలు అందజేస్తారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. వృథా ఖర్చులకు కళ్లెం వేస్తారు. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఉద్యోగంలో అలవికాని లక్ష్యాలతో ఇబ్బంది పడడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. అనేక మార్గాలలో ఆదాయం పెరుగుతుంది. వృథా ఖర్చుల విషయంలో పునరాలోచన చేయడం మంచిది. కుటుంబ సభ్యులతో ఆనందంగా కాలక్షేపం చేయడం, దైవ కార్యాల్లో పాల్గొనడం జరుగుతుంది. ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు వేగం పుంజుకుంటాయి. దూర ప్రాంతం నుంచి శుభవార్తలు వింటారు. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. విద్యార్థులు సునాయాసంగా విజయాలు సాధిస్తారు. ఆరోగ్యానికి లోటు లేదు.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): కుటుంబపరంగా ఒక శుభ కార్యం నిర్వహించాల్సి వస్తుంది. కొద్దిగా మానసిక ఒత్తిడి ఉంటుంది. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. చిన్ననాటి మిత్రుల నుంచి సహకారం లభిస్తుంది. ప్రధాన మైన కార్యకలాపాలను నిదానంగా పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. కుటుంబ సభ్యులతో దైవ కార్యాల్లో పాల్గొంటారు. బంధువు లతో కొద్దిగా సమస్యలు తలెత్తుతాయి. విద్యార్థులు చదువుల మీద శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): ఆర్థిక లావాదేవీలు, స్పెక్యులేషన్ వంటివి ఆశించిన ఫలితాలను ఇస్తాయి. బంధుమిత్రులతో శుభ కార్యంలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. స్థిరాస్తి క్రయ విక్రయాలు లాభ సాటిగా సాగుతాయి. ఉద్యోగాల్లో మంచి అవకాశాలు అందివస్తాయి. నిరుద్యోగులకు కూడా ఆఫర్లు అందుతాయి. సమాజంలో మీ మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. రాజకీయ నాయ కులతో పరిచయాలు పెరుగుతాయి. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం పరవాలేదు.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): ఆర్థిక సహాయం విషయంలో బంధుమిత్రుల నుంచి కొద్దిగా ఇబ్బందులుంటాయి. వృత్తి, ఉద్యోగాల్లో శ్రమ, ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది. వ్యాపారంలో బాగా బిజీ అవుతారు. యాక్టివిటీ పెరుగుతుంది. కుటుంబపరంగా బాధ్యతలు పెరుగుతాయి. తలపెట్టిన పనులు వేగంగా పూర్తవుతాయి. రాదను కుని వదిలేసుకున్న డబ్బు కొద్ది ప్రయత్నంతో వసూలు అవుతుంది. ముఖ్యమైన అవసరాలు తీరిపోతాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): ఆర్థికంగా కొద్దిపాటి పురోగతి సాధిస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలకు సానుకూల స్పందన లభి స్తుంది. సమాజంలో విశేషమైన ఆదరణ పొందుతారు. ఉన్నతస్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో సొంత నిర్ణయాలు తీసుకుని అమలు చేయడం వల్ల లబ్ధి పొందుతారు. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. ఇతరుల విమర్శలను పట్టించుకోవద్దు. విద్యార్థులు శ్రమపడాల్సి ఉంటుంది. ఆరోగ్యం పరవాలేదు.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): కొందరు సన్నిహితుల ద్వారా వృత్తి, ఉద్యోగాలపరంగా అధిక ప్రయోజనాలను పొందుతారు. ఆర్థిక ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. సమాజంలో పలుకుబడి, గౌరవమర్యాదలు పెరుగుతాయి. వ్యాపారాల్లో మీ ఆలోచనలు, ప్రయత్నాలు లాభాలను తెచ్చిపెడతాయి. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. వివాహ ప్రయత్నాలు ఫలించి పరిచయస్థులలో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆర్థిక లావాదేవీలు, స్పెక్యులేషన్ లాభిస్తాయి. విద్యార్థులు విజయాలు సాధిస్తారు.
Note: ఇక్కడ సమకూర్చిన సమాచారం వారివారి నమ్మకం, విశ్వాసాల మీద ఆధారపడి ఉంటుంది. దీన్ని నిర్ధారించేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకుల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సమాచారాన్ని అందించాము.
మరిన్ని జ్యోతిష్య కథనాలు చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.