Weekly Horoscope(20-26 August): వారి ఆర్థిక పరిస్థితి చక్కబడుతుంది.. 12 రాశుల వారికి వారఫలాలు ఇలా..

Weekly Horoscope in Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు, నక్షత్రాలు మీ జాతకచక్రానికి అనుకూలంగా ఉన్నాయా? ఆరోగ్యం, ఆర్థికపరంగా ఎలా ఉండబోతుంది..? ఉద్యోగపరంగా మీ రాశికి దిన ఫలాలు ఎలా ఉంటాయి? ఆగస్టు 20, 2023న(ఆదివారం) నుంచి ఆగస్టు 26, 2023 (శనివారం) వరకు 12 రాశుల వారి వారఫలాలు ఎలా ఉంటాయో తెలుసుకోండి..

Weekly Horoscope(20-26 August): వారి ఆర్థిక పరిస్థితి చక్కబడుతుంది.. 12 రాశుల వారికి వారఫలాలు ఇలా..
Weekly Horoscope 20 26 August 2023
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Aug 20, 2023 | 4:01 AM

Weekly Horoscope in Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు, నక్షత్రాలు మీ జాతకచక్రానికి అనుకూలంగా ఉన్నాయా? ఆరోగ్యం, ఆర్థికపరంగా ఎలా ఉండబోతుంది..? ఉద్యోగపరంగా మీ రాశికి దిన ఫలాలు ఎలా ఉంటాయి? ఆగస్టు 20, 2023న(ఆదివారం) నుంచి ఆగస్టు 26, 2023 (శనివారం) వరకు 12 రాశుల వారి వారఫలాలు ఎలా ఉంటాయో తెలుసుకోండి..

  1. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): శుభ గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల సమయం బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు, ఆర్థిక ప్రయత్నాలు చాలావరకు విజయవంతం అవుతాయి. శుభ వార్తలకు, శుభ కార్యాలకు అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఒకటి రెండు ముఖ్యమైన ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. కొత్త ఉద్యోగ, వివాహ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది. వృత్తి జీవితంలో ప్రాభవం పెరుగుతుంది. వ్యాపారులు అంచనాలకు మించి లాభాలు గడిస్తారు. అశ్విని నక్షత్రం వారికి ఆకస్మిక ధనలాభం ఉంది.
  2. వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): బుధ, రవి గ్రహాలు ఉద్యోగపరంగా మంచి అదృష్టాన్ని సూచిస్తున్నాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. అధికారులు ఎక్కువగా మీ మీద ఆధారపడే అవకాశం ఉంది. వృత్తి జీవి తంలో కూడా బాగా డిమాండ్ పెరుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగ ప్రయ త్నాలు సానుకూలంగా ఉంటాయి. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదరవచ్చు. బంధుమిత్రులకు సహాయం చేస్తారు. గృహ, వాహన సౌకర్యాలకు అవకాశం ఉంది. స్వల్ప అనారోగ్య సూచనలున్నాయి. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. రోహిణి నక్షత్రంవారు మరింతగా శుభ ఫలితాలు పొందుతారు.
  3. మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): రాశ్యధిపతి బుధుడు, శుక్రుడు, గురువు, శని అనుకూలంగా ఉండడం వల్ల ఏ ప్రయత్నం తల పెట్టినా విజయవంతం అవుతుంది. వృత్తి, వ్యాపారాల్లో కీలకమైన నిర్ణయాలు, ఆలోచనలు అమలు చేసి లబ్ధి పొందుతారు. ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయి. మంచి కంపెనీల నుంచి ఆశించిన సమాచారం అందు తుంది. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. కుటుంబంలో ఆనందోత్సాహాలు చోటు చేసు కుంటాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. బంధుమిత్రులకు అండగా నిలబడతారు. పునర్వసు నక్షత్రం వారు అత్యధిక ప్రయోజనం పొందుతారు.
  4. కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): కుజ, రవి గ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల వృత్తి, ఉద్యోగాలలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ప్రమోషన్ వచ్చే సూచనలున్నాయి. ఆశించిన స్థాయిలో జీతభత్యాలు పెరుగు తాయి. కుటుంబంతో కలిసి తీర్థయాత్రలు లేదా విహార యాత్రలకు ప్లాన్ చేస్తారు. ఎక్కువగా దైవ కార్యాల్లో పాల్గొంటారు. సమాజంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. తల్లి తండ్రుల్లో ఒకరి ఆరోగ్యం కొద్దిగా ఆందోళన కలిగిస్తుంది. కుటుంబ పెద్దల జోక్యంతో తోబుట్టువులతో ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. ఆహార విహారాల్లో జాగ్రత్తలు పాటించడం మంచిది. పుష్యమి నక్షత్రం వారికి సమయం బాగా అనుకూలంగా ఉంది.
  5. సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): రాశినాథుడైన రవి, కుజుడు, గురువు బలంగా ఉన్నందువల్ల వ్యక్తిగత ఉన్నతికి, యత్న కార్య సిద్ధికి అవకాశం ఉంది. కొత్త ఆలోచనలు, కొత్త ప్రయత్నాల వల్ల ఆశించిన ప్రయోజనాలు సమ కూరుతాయి. వృత్తి, ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో లాభాలు పెరుగు తాయి. శుభ కార్యాలు జరిగే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అప్రయత్నంగా వివాహ సంబంధం కుదిరే సూచనలు న్నాయి. పిల్లలకు సమయం అనుకూలంగా ఉంది. జీవిత భాగస్వామితో సామరస్యం పెరుగుతుంది. పుబ్బా నక్షత్రం వారికి ఆకస్మిక ధనలాభం ఉంది.
  6. కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): షష్ట స్థానంలో ఉన్న శనీశ్వరుడు ఉద్యోగంలో సానుకూల పరిస్థితులు కల్పిస్తాడు. లాభ స్థానంలో ఉన్న శుక్ర గ్రహం వల్ల ఆర్థికంగా పురోగతి ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా సాగి పోతాయి. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది కానీ, అనవసర ఖర్చుల వల్ల ఇబ్బంది పడతారు. వృత్తి ఉద్యోగాల్లో సహోద్యోగుల నుంచి ఇబ్బందులుంటారు. వ్యాపారాల్లో పోటీదార్లు సమస్యలు సృష్టించే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. మీ మాటకు విలువ ఉంటుంది. బంధుమిత్రులు మీ సలహాలు స్వీకరిస్తారు. ఉత్తరా నక్షత్రం వారు ఎక్కువగా లాభపడతారు.
  7. తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): శుభ గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నందువల్ల విపరీత రాజయోగం పట్టే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లోనే కాకుండా సామాజికంగా కూడా ఆదరణ, గౌరవాభిమానాలు పెరుగుతాయి. వ్యాపారం బాగా కలిసి వస్తుంది. కుటుంబంలో శుభ కార్యాలు జరగడానికి అవకాశం ఉంది. ఆధ్యాత్మిక చింతన పెరిగి దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఆర్థిక ప్రయత్నాలు ఆశించిన దాని కంటే ఎక్కువగా సఫలం అవుతాయి. ఆర్థిక సమస్యలతో పాటు ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో శుభవార్త అందుకుంటారు. విశాఖ నక్షత్రం వారు మరింత అదృష్టవంతులవుతారు.
  8. వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): రవి, కుజులు అనుకూలంగా ఉన్నందువల్ల వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరగడం జరుగుతుంది. ఆశించిన స్థాయిలో సంపాదన వృద్ధి చెందుతుంది. వ్యాపారాల్లో నష్టాలు ఉండవు. రియల్ ఎస్టేట్, రైతులు, భూ సంబంధమైన వృత్తుల్లో ఉన్నవారు అంచనాలకు మించి పురోగతి సాధిస్తారు. వాగ్దానాలు చేయడం, హామీలు ఉండడం మంచిది కాదు. ఇతర విషయాల్లో తలదూర్చవద్దు. అవమానాల పాలయ్యే సూచనలున్నాయి. ఆరోగ్యానికి లోటు ఉండదు. తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. కుటుంబ జీవితం సామరస్యంగా సాగిపోతుంది. ప్రయాణాలు పెట్టుకోవద్దు. అనూరాధ వారికి సమయం అనుకూలంగా ఉంది.
  9. ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): శనీశ్వరుడు, రాశినాథుడైన గురువు, బుధ, రవులు అనుకూలంగా ఉన్న కారణంగా కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో ప్రాభవం పెరగడంతో పాటు గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి. అధికార యోగానికి అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాలు అంచనాలకు మించి అభివృద్ధి చెందుతాయి. ఆర్థిక పరిస్థితి చాలావరకు మెరుగుపడు తుంది. ఆరోగ్యం సజావుగా సాగిపోతుంది. కొత్తగా ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది. ముఖ్యంగా ఉద్యోగ, వివాహ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. పూర్వాషాఢ నక్షత్రం వారికి రాజయోగం ఉంది.
  10. మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): శుక్రుడు, శనీశ్వరుడు అనుకూలంగా ఉండడంతో ముఖ్యమైన పనులను పట్టుదలగా పూర్తి చేయడం జరుగుతుంది. ఉద్యోగ జీవితం అనుకూలంగా సాగిపోతుంది. వృత్తి జీవితంలో డిమాండ్ పెరుగుతుంది. వ్యాపారాలలో లాభాలు ఆర్జిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆర్థిక పరిస్థితి చక్కబడుతుంది. కుటుంబ జీవితం సజావుగా సాగిపోతుంది. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. చిన్ననాటి స్నేహితులతో విందు కార్యక్రమంలో పాల్గొంటారు. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఉత్తరాషాఢ నక్షత్రం వారికి అదృష్టం పడుతుంది.
  11. కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): ఈ రాశివారికి ప్రస్తుతం అనుకూలంగా ఉన్న బుధుడు వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన లాభాలు ఇస్తాడు. ఉద్యోగ జీవితంలో మీ ప్రతిభా పాటవాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఆహార విహారాల్లోనే కాకుండా, ప్రయాణాల్లో కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు సాను కూలపడతాయి. అనవసర ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. మిత్రుల సహాయ సహకారాలతో ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేస్తారు. ఇతరుల విషయాల్లో తలదూర్చవద్దు. పూర్వాభాద్ర వారికి ఆశించిన శుభవార్త అందుతుంది.
  12. మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): గురు, శుక్ర గ్రహాల కారణంగా వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఉద్యోగ సంబంధమైన ఏ ప్రయత్నం అయినా అనుకూల ఫలితాలను ఇస్తుంది. వ్యాపారాల్లో అనుకోకుండా లాభాలు పెరుగుతాయి. ఎవరికీ వాగ్దానాలు చేయడం గానీ, హామీలు ఉండడం గానీ చేయవద్దు. ప్రముఖులతో సాన్నిహిత్యం పెరుగు తుంది. కుటుంబానికి సంబంధించి ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరిగి దైవకార్యాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి. ప్రయాణాలు పెట్టుకోవద్దు. ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి ఆకస్మిక ధన లాభం ఉంది.

Note: ఇక్కడ సమకూర్చిన సమాచారం వారివారి నమ్మకం, విశ్వాసాల మీద ఆధారపడి ఉంటుంది.  దీన్ని నిర్ధారించేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకుల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సమాచారాన్ని అందించాము.

మరిన్ని జ్యోతిష్య కథనాలు చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.