Zodiac Signs: రవి, శని గ్రహాల సమ సప్తకం.. వారికి ఒక విధమైన విపరీత రాజయోగం పట్టే అవకాశం.. !

రవి, శని గ్రహాలు సమ సప్తకంలో ఉండడం లేదా పరస్పర దృష్టి కలిగి ఉండడం అనేది వ్యక్తిగత జీవితాల్లో సమూలమైన మార్పులకు, విప్లవాత్మక, తిరుగుబాటు ధోరణులకు దోహదం చేస్తుంది. సాంప్రదాయ విరుద్ధమైన భావాలను ఇది ప్రేరేపిస్తుంది. పట్టుదలను, మొండి ధైర్యాన్ని పెంచుతుంది. రవి, శనులు తండ్రి, కుమారులు. అయితే, ఈ రెండు గ్రహాల మధ్య బద్ధ వైరం ఉంది.

Zodiac Signs: రవి, శని గ్రహాల సమ సప్తకం.. వారికి ఒక విధమైన విపరీత రాజయోగం పట్టే అవకాశం.. !
Zodiac Signs
Follow us

| Edited By: Janardhan Veluru

Updated on: Aug 18, 2023 | 10:43 PM

Zodiac Signs: రవి, శని గ్రహాలు సమ సప్తకంలో ఉండడం లేదా పరస్పర దృష్టి కలిగి ఉండడం అనేది వ్యక్తిగత జీవితాల్లో సమూలమైన మార్పులకు, విప్లవాత్మక, తిరుగుబాటు ధోరణులకు దోహదం చేస్తుంది. సాంప్రదాయ విరుద్ధమైన భావాలను ఇది ప్రేరేపిస్తుంది. పట్టుదలను, మొండి ధైర్యాన్ని పెంచుతుంది. రవి, శనులు తండ్రి, కుమారులు. అయితే, ఈ రెండు గ్రహాల మధ్య బద్ధ వైరం ఉంది. అందువల్ల ఈ గ్రహాల సమ సప్తకం తండ్రి, కుమారుల మధ్య వివాదాలకు, విభేదాలకు కూడా కారణమవుతుంది. ఈ రెండు గ్రహాలు ఎవరి స్వస్థానాల్లో అవి ఉండడం వల్ల వాటికి మరింతగా బలం పెరిగి, మరింత తీవ్రస్థాయిలో వ్యవహరించడం జరుగు తుంది. శని తన స్వక్షేత్రమైన కుంభరాశిలో సంచరిస్తుండగా, రవి గత 17న తన స్వక్షేత్రమైన సింహ రాశిలోకి ప్రవేశించడం జరిగింది. రవి గ్రహం సింహ రాశిలో సెప్టెంబర్ 17 వరకు కొనసాగుతాడు. ఏ రాశివారికి ఈ సమ సప్తకం ఏ విధంగా పనిచేస్తుందో పరిశీలిద్దాం.

  1. మేషం: పంచమ, లాభ స్థానాల్లో ఉన్న రవి, శనులు పరస్పరం వీక్షించుకోవడం వల్ల ఆలోచనా ధోరణిలో తీవ్రమైన మార్పులు చోటు చేసుకుంటాయి. సాంప్రదాయ విరుద్ధ భావాలు చోటు చేసుకుంటాయి. కొత్త నిర్ణయాలు, కొత్త ప్రయత్నాలకు అవకాశం ఉంటుంది. ఈ రాశివారికి, వారి తండ్రికి మధ్య విభేదాలు తలెత్తే సూచనలున్నాయి. లేదా తండ్రికి దూరం కావడం జరుగుతుంది. అధికారులతో కూడా మాట పట్టింపులు ఏర్పడుతాయి. మందకొడితనం స్థానంలో చురుకుదనం పెరుగుతుంది.
  2. వృషభం: ఈ రాశివారికి గృహ, వాహన సంబంధమైన సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. అయితే, అధికారులతో ముఖాముఖీ తలపడే అవ కాశం కూడా ఉంది. తల్లి ఆరోగ్యం ఆందోళన కలిగించవచ్చు. తల్లి వైపు బంధువులతో శత్రుత్వం ఏర్పడవచ్చు. స్థాన చలనానికి అవకాశం ఉంది. గుండె సంబంధమైన సమస్యలు తలెత్తకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. కుటుంబ సమస్యలు చాలావరకు పరిష్కారమవుతాయి.
  3. మిథునం: బంధుమిత్రులతో వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. పట్టుదలగా ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేస్తారు. కొన్ని సమస్యల విషయంలో అమీ తుమీ తేల్చుకోవాలన్న ఆలోచన చేస్తారు. తోబుట్టు వులతో ఆస్తి వ్యవహారాలను పరిష్కరించుకుంటారు. ఆదాయ వృద్ధికి ప్రయాణాలు చేస్తారు. ధైర్యంగా, సరికొత్త ఆత్మవిశ్వాసంతో వ్యక్తిగత సమస్యలకు ముగింపు పలుకుతారు. నిరుద్యోగులు, అవివాహితుల ప్రయత్నాలు సఫలం అవుతాయి. సహాయ కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు.
  4. కర్కాటకం: ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి కుటుంబ సమస్యలను పరిష్కరించుకోవడం, కుటుంబ వ్యవహారాలను చక్కబెట్టడం జరుగుతుంది. ఆదాయాన్ని పెంచుకుని, ఆర్థిక సమస్యలను పరిష్కరించుకునేందుకు నడుంబిగిస్తారు. అదనపు ఆదాయానికి ప్రయత్నాలు చేపడతారు కుటుంబ సభ్యుల తోనూ, అధికారులతోనూ ఆచితూచి మాట్లాడడం మంచిది. ఇతరులు మీ మాటల్ని అపార్థం చేసుకునే అవకాశం ఉంది. మాట తొందర వల్ల ధన నష్టం జరిగే సూచనలున్నాయి.
  5. సింహం:  వాహన ప్రమాద సూచనలున్నాయి. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చడం వల్ల పోలీస్ స్టేషన్ లేదా కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తండ్రితో తీవ్రస్థాయి విభేదాలు తలెత్తే సూచనలు న్నాయి. ఎంత జాగ్తత్తగా ఉంటే అంత మంచిది. నష్టదాయకమైన ఒప్పందాలకు దూరంగా ఉండ డం మంచిది. సన్నిహితులతో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం అవసరం. జీవిత భాగస్వా మితో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. పొరపాటున కూడా దుస్సాహసాలకు ఒడిగట్టవద్దు.
  6. కన్య: రవి, శనుల సమ సప్తకం వల్ల ఈ రాశివారికి ఒక విధమైన విపరీత రాజయోగం పట్టే అవకాశం ఉంది. దీనివల్ల శత్రు జయం, రోగ నివారణ, రుణ నివృత్తి వంటివి చోటు చేసుకునే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో తప్పకుండా అధికార యోగం ఉంటుంది. ఆలోచనా ధోరణిలో మార్పులు వస్తాయి. తిరుగుబాటు వైఖరి అభివృద్ధి చెందుతుంది. సంప్రదాయ విరుద్ధమైన ధోరణులు ప్రబలుతాయి. తండ్రితో కానీ, సమీప బంధువులతో కానీ విభేదాలు రాకుండా చూసు కోవాలి.
  7. తుల: ఈ రాశికి రవి, శనుల సమ సప్తకం వల్ల విశేషమైన మేలు జరుగుతుంది. రాజకీయంగా ప్రముఖులైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడడం గానీ, రాజకీయాల్లో ప్రవేశించడం గానీ జరుగుతుంది. రియల్ ఎస్టేట్, లిక్కర్ వంటి వ్యాపారాలవారు విపరీతంగా లాభాలను ఆర్జిస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన పురోగతి ఉంటుంది. కుటుంబ పెద్దల నుంచి ఊహించని సహాయ సహకారాలు అందుతాయి. రాజకీయ నాయకులకు యాక్టివిటీ పెరుగుతుంది. మంచి గుర్తింపు లభిస్తుంది.
  8. వృశ్చికం: ఈ రాశివారికి వృత్తి, ఉద్యోగాల్లో అనుకోని సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అధికారులతో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. వ్యాపారాల్లో కూడా యజమానులు తమ కస్టమర్లతో మాట ల్లోనూ, చేతల్లోనూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఉద్యోగాలు పోవడం, ఉద్యోగావకా శాలు చేజారిపోవడం వంటివి జరిగే అవకాశం కూడా ఉంది. తల్లి ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండడం మంచిది. కుటుంబంలో కలతలు రేగే అవకాశం కూడా ఉంది. వాహన ప్రమాదాలతో జాగ్రత్త.
  9. ధనుస్సు: ఈ రాశివారికి కూడా ఈ రవి, శనుల సమ సప్తకం అనుకూల ఫలితాలనే ఇస్తుంది. భావాలలో లోతైన సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. శత్రువులెవరో, మిత్రులెవరో అర్థమై, అందుకు తగ్గ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ రాశివారు ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. అయితే, తండ్రితో భేదాభిప్రాయాలు తలెత్తే ప్రమాదం ఉంది. ఎంత సంయమనంతో వ్యవహరిస్తే అంత మంచిది. వృత్తి, ఉద్యోగాల్లో అధికార యోగం పట్టడం జరుగుతుంది.
  10. మకరం: ఈ రాశివారు వివాదాల్లో ఇరుక్కునే పరిస్థితి తలెత్తుతుంది. బంధుమిత్రులతోనే కాక, కుటుంబ సభ్యులతో కూడా తరచూ అపార్థాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల్లో మోసపోవడం జరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో భారీ మార్పులు చోటు చేసుకోవచ్చు. జీతభత్యాలు ఆశించిన స్థాయిలో పెరగడం జరుగుతుంది. అధికారులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. శుభకార్యాలు, దైవ కార్యాల మీద ఎక్కువగా ఖర్చవుతుంది. సేవా కార్యకమాల్లో పాల్గొంటారు.
  11. కుంభం: వాహనాల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. జీవిత భాగస్వామితో విభేదాలు తలెత్తే సూచనలున్నాయి. గత కాలపు విషయాలను తవ్వి తీయడం సమంజసం కాదు. తండ్రితో వ్యవహరించడంలో జాగ్రత్తలు పాటించడం మంచిది. తండ్రి ఆరోగ్యం ఆందోళన కలిగించవచ్చు. వ్యాపార భాగస్వాముల సహాయ సహకారాలతో వ్యాపారం తీరును మార్చే అవకాశం ఉంది. అనుకోకుండా పెళ్లి సంబంధాలు కలిసి వస్తాయి. పట్టువిడుపులతో వ్యవహరించడం మంచిది.
  12. మీనం: ఈ రాశివారికి ఏలిన్నాటి శని ప్రభావం బాగా తగ్గే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి. ప్రతి ప్రయత్నంలోనూ పట్టుదల పెరుగుతుంది. ఆధ్యాత్మిక చింతన కొత్త పుంతలు తొక్కుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. తండ్రితో సఖ్యత పెరుగుతుంది. తండ్రి నుంచి ప్రేమను పొందుతారు. ఆస్తి వివాదం ఒకటి కుటుంబ పెద్దల జోక్యంతో సానుకూలంగా పరిష్కారం అవుతుంది. బంధువులలో మీ మాటకు విలువ పెరుగుతుంది.

Note: ఇక్కడ సమకూర్చిన సమాచారం వారివారి నమ్మకం, విశ్వాసాల మీద ఆధారపడి ఉంటుంది.  దీన్ని నిర్ధారించేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకుల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సమాచారాన్ని అందించాము.

మరిన్ని జ్యోతిష్య కథనాలు చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి