Kesineni Nani Vs Chinni: కేశినేని బ్రదర్స్‌ మధ్య ముదిరిన ఆధిపత్య పోరు.. డోర్‌ పోస్టర్లతో మరోసారి భగ్గుమన్న విభేదాలు

కొంతకాలం వరకూ కేశినేని నానికి అనుకూలంగా ఉన్న తిరువూరు టీడీపీ ఇంచార్జి దేవదత్ ను కూడా ఎంపీకి దూరం చేసారని చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతుంది. పార్టీలో జరుగుతున్న అంతర్గత పోరు ఇప్పుడు స్పష్టంగా కనిపించింది. తాజాగా తిరువూరు ఇంచార్జ్ దేవదత్ వేసిన డోర్ పోస్టర్లలో..

Kesineni Nani Vs Chinni: కేశినేని బ్రదర్స్‌ మధ్య ముదిరిన ఆధిపత్య పోరు.. డోర్‌ పోస్టర్లతో మరోసారి భగ్గుమన్న విభేదాలు
Kesineni Brothers
Follow us
Basha Shek

|

Updated on: Apr 07, 2023 | 6:20 AM

విజయవాడ పార్లమెంటు పరిధిలో ఎంపీ కేశినేని నాని- ఆయన తమ్ముడు కేశినేని శివనాధ్ అలియాస్ చిన్ని మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. పార్లమెంట్ పరిధిలో అన్ని నియోజకవర్గాలను తన గుప్పెట్లో పెట్టుకోవాలని కేశినేని శివనాధ్ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని అసెంబ్లీ స్థానాల్లో ఇంఛార్జ్ లను తన వైపు తిప్పుకున్నారు చిన్ని. తాజాగా తిరువూరు పై దృష్టి పెట్టారు.కొంతకాలం వరకూ కేశినేని నానికి అనుకూలంగా ఉన్న తిరువూరు టీడీపీ ఇంచార్జి దేవదత్ ను కూడా ఎంపీకి దూరం చేసారని చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతుంది. పార్టీలో జరుగుతున్న అంతర్గత పోరు ఇప్పుడు స్పష్టంగా కనిపించింది. తాజాగా తిరువూరు ఇంచార్జ్ దేవదత్ వేసిన డోర్ పోస్టర్లలో ఎన్టీఆర్, చంద్రబాబు, లోకేష్ తో పాటు స్థానిక ఎంపీ కేశినేని నాని ప్లేస్ లో చిన్ని ఫోటో ముద్రించడంతో వివాదాలకు మరింత ఆజ్యం పోసినట్లైంది. ఎంపీ స్థానంలో ఆయన తమ్ముడు ఫోటో ఉండటంపై నాని అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలే నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటే.. ఈ టైంలో కొత్త వివాదం తీసుకిచ్చారని నాని అనుచరులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

అయితే చివరకు ఎంపీ ఫొటో ప్లేస్ లో చిన్ని ఫోటో వేయించుకోవడం ద్వారా ఆధిపత్యం సాధించారని చెప్తుకుంటున్నారు శివనాథ్ అనుచరులు. కొన్ని రోజులుగా తిరువూరిపై పట్టు సాధించేందుకుఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు కేశినేని బ్రదర్స్. అన్నను రాజకీయంగా దెబ్బ కొట్టాలనే ఉద్దేశంతో చిన్ని పావులు కదుపుతురనేది తాజా ఘటనతో తెలుగు తమ్ముళ్లలో చీలిక స్పష్టంగా బయటపడింది. తిరువురులో పోస్టర్లు అతికిస్తున్న వారిని నాని అనుచరులు ప్రశ్నించినా సమాధానం రాలేదు. అటు ఇంచార్జి దేవదత్ సైతం ఈ అంశం పై మాట్లాడేందుకు నిరాకరించారు. ఈ ఘటనతో ఎంపీ విషయంలో అన్యాయం జరుగుతుందంటూ ఆయన అనుచరులు మాత్రం సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..