Andhra Pradesh: కోలకతాలో నిలువునా మోసపోయిన ఏపీ వృద్ధురాలు..హౌరా బ్రడ్జిపై ఆత్మహత్యాయత్నం.. చివరికి

Old Woman Rescued: పోలీసు వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. వృద్ధురాలి పేరు శ్యామల. ఆమె ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మహిళగా గుర్తించారు. ఆమె భర్త చనిపోవడంతో ఆస్తులన్నీ అమ్మేసి ముంబై వెళ్లింది. కొన్నాళ్లు అక్కడే గడిపింది. ఇటీవల తన చివరి క్షణాలను ఆశ్రమంలో గడపాలని నిర్ణయించుకుంది. కలకత్తాలో మంచి ఆశ్రమం ఉందని ఓ వ్యక్తి మాయమాటలు చెప్పాడు.

Andhra Pradesh: కోలకతాలో నిలువునా మోసపోయిన ఏపీ వృద్ధురాలు..హౌరా బ్రడ్జిపై ఆత్మహత్యాయత్నం.. చివరికి
Old Woman From Ap
Follow us

| Edited By: Vimal Kumar

Updated on: Dec 21, 2023 | 7:23 PM

Howrah: భర్త చనిపోవడంతో.. ఆస్తులన్నీ అమ్మీ ముంబై వెళ్లింది. అంతా బాగానే ఉందనుకున్న సమయంలో.. ఆమెకు తన చివరి రోజులను ఓ మంచి ఆశ్రమంలో గడపాలని కోరిక కలిగింది. ఈ క్రమంలో ఆశ్రమం గురించి వెతుకుతోంది. ఇది గమనించిన ఓ వ్యక్తి ఆమెకు మాయమాటలు చెప్పి,  కోల్‌కతాలో మంచి చోటు ఉందని నమ్మబలికాడు. ఆమె వద్ద ఉన్న డబ్బునంతా తీసుకుని, కొంత మొత్తం ఆమెకు ఇచ్చి పరారయ్యాడు. దీంతో మోసపోయానని తెలుసుకున్న ఆ మహిళ.. దిక్కుతోచని పరిస్థితిలో హౌరా బ్రిడ్జిపై ఆత్మహత్యకు ప్రయత్నించింది. చుట్టుపక్కల వారు గమనించి, పోలీసులకు చెప్పడంతో ప్రమాదం తప్పింది. ఆమె బస చేసేందుకు పోలీసులు తగిన ఏర్పాట్లు చేసి, కేసు నమోదు చేసుకుని, విచారిస్తున్నారు.

పోలీసు వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. వృద్ధురాలి పేరు శ్యామల. ఆమె ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మహిళగా గుర్తించారు. ఆమె భర్త చనిపోవడంతో ఆస్తులన్నీ అమ్మేసి ముంబై వెళ్లింది. కొన్నాళ్లు అక్కడే గడిపింది. ఇటీవల తన చివరి క్షణాలను ఆశ్రమంలో గడపాలని నిర్ణయించుకుంది. కలకత్తాలో మంచి ఆశ్రమం ఉందని ఓ వ్యక్తి మాయమాటలు చెప్పాడు. ఆ వ్యక్తి వృద్ధురాలి వద్దనున్న డబ్బునంతా దోచుకుని, కేవలం ఆమెకు రూ.10,000లు మాత్రమే ఇచ్చాడు. ఎవరికీ చెప్పుకోలేకపోయిన ఆ మహిళ, దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది.

ఈ క్రమంలో గత బుధవారం హౌరా వంతెనపై నుంచి దూకేందుకు ఆమె ప్రయత్నించింది. స్థానిక వ్యాపారులు ఆమెను రక్షించి, హౌరా పోలీస్ స్టేషన్ పోలీసులకు అప్పగించారు. వృద్ధురాలిని ఓ గుడిలో తాత్కాలికంగా ఉండేందుకు బస ఏర్పాటు చేసిన పోలీసులు.. వృద్ధురాలి గురించి మరింత సమాచారం తెలుసుకునేందుక ప్రయత్నిస్తున్నారు. కాగా, వృద్ధురాలి గురించి పూర్తిగా తెలుసుకునేందుకు పశ్చిమ బెంగాల్ రేడియో క్లబ్‌కు సమాచారం అందించారు.

ఇవి కూడా చదవండి

గురువారం వృద్ధురాలితో మాట్లాడామని, ముందుగా ఆంధ్రప్రదేశ్‌లో ఆమె కుటుంబం కోసం వెతికామని పశ్చిమ బెంగాల్ రేడియో క్లబ్ ఎడిటర్ అంబరీష్ నాగ్ బిశ్వాస్ తెలిపారు. అక్కడ ఆమెకు సంబంధించిన వారెవరూ లేరని తేలింది. అనంతరం చేసేందేమీ లేక హౌరా సిటీ పోలీసుల సహాయంతో డైమండ్ హార్బర్‌లోని స్వచ్ఛంద సంస్థకు అప్పగించినట్లు ఆయన తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..