Andhra Pradesh: హవ్వ.. ఇదేం పని..?! భక్తుడిలా వచ్చి బిగ్ ట్విస్ట్ ఇచ్చాడు.. సీసీకెమెరాలో రికార్డ్ అయిన షాకింగ్ దృశ్యాలు..

తెల్లవారుజామున నిద్రలేచాక.. స్నానం ఆచరించి ఇష్టదైవానికి పూజ చేస్తుంటారు చాలామంది భక్తులు. కొంతమంది ఇంట్లోనే దేవుడి ఫోటోకు హారతి పట్టి మొక్కుకుంటే.. మరి కొంతమంది సమీపంలో ఉన్న ఆలయానికి వెళ్లి పూజలు చేస్తారు. కానీ విశాఖలో మాత్రం ఓ ఐదు పదులు ఉన్న వ్యక్తి.. ఎంచక్కా ఆలయంలోకి వెళ్ళాడు. చేతిలో సంచి పట్టుకొని అమ్మవారికి దండం పెట్టుకుంటూ లోపల అటు ఇటు చూసాడు. గర్భగుడిలోకి కూడా వెళ్లాడు. కానీ.. ఆ వ్యక్తి వచ్చింది పూజ కోసం కాదు. దేవుడికే శఠగోపం పెట్టేందుకు! భక్తుడు రూపంలో వచ్చి ఆలయంలోని...

Andhra Pradesh: హవ్వ.. ఇదేం పని..?! భక్తుడిలా వచ్చి బిగ్ ట్విస్ట్ ఇచ్చాడు.. సీసీకెమెరాలో రికార్డ్ అయిన షాకింగ్ దృశ్యాలు..
Robbery In Temple
Follow us
Maqdood Husain Khaja

| Edited By: Shiva Prajapati

Updated on: Aug 20, 2023 | 11:37 AM

తెల్లవారుజామున నిద్రలేచాక.. స్నానం ఆచరించి ఇష్టదైవానికి పూజ చేస్తుంటారు చాలామంది భక్తులు. కొంతమంది ఇంట్లోనే దేవుడి ఫోటోకు హారతి పట్టి మొక్కుకుంటే.. మరి కొంతమంది సమీపంలో ఉన్న ఆలయానికి వెళ్లి పూజలు చేస్తారు. కానీ విశాఖలో మాత్రం ఓ ఐదు పదులు ఉన్న వ్యక్తి.. ఎంచక్కా ఆలయంలోకి వెళ్ళాడు. చేతిలో సంచి పట్టుకొని అమ్మవారికి దండం పెట్టుకుంటూ లోపల అటు ఇటు చూసాడు. గర్భగుడిలోకి కూడా వెళ్లాడు. కానీ.. ఆ వ్యక్తి వచ్చింది పూజ కోసం కాదు. దేవుడికే శఠగోపం పెట్టేందుకు! భక్తుడు రూపంలో వచ్చి ఆలయంలోని అమ్మవారి వెండి వస్తువుల అపహరించిన ఆ వ్యక్తి వ్యవహారం ఏంటో ఓసారి చూద్దాం..

విశాఖ పెందుర్తి నూకాంబిక అమ్మవారి ఆలయంలో చోరీ జరిగింది. పట్టపగలు భక్తుడు రూపంలో వచ్చి అమ్మవారి వెండి వస్తువులు అపహరించుకుపోయాడు దండగుడు. 40 తులాల వెండి వస్తువుల మూటగట్టుకున్నాడు. వెండి కిరీటం, పంచపాత్ర, శఠగోపం ఎత్తుకెళ్లిపోయాడు.

సీసీ కెమెరాలో దృశ్యాలు.. వాటిని మాత్రం వదిలేశాడు..

పెందుర్తి సంతబయలో నూకాంబిక అమ్మవారి ఆలయం తెల్లవారుజామున తెరుచుకుంటుంది. పూజారి అటు ఇటుగా వెళ్ళినప్పుడు.. భక్తుడిలా ఆలయంలోకి వెళ్లిన ఓ దుండగుడు నేరుగా గర్భగుడిలోకి వెళ్ళాడు. సమయం దాదాపు ఉదయం 10:30 గంటలు. గర్భాలయంలోని అమ్మవారి వద్ద ఉన్న వెండి కిరీటం పంచపాత్ర శఠగోపం సంచిలో వేసుకొని అక్కడ నుంచి జారుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత ఆలయంలోకి వెళ్లిన నిర్వాహకులు వెండి వస్తువులు మాయమైనట్టు గుర్తించారు. సీసీ కెమెరాలో వెరిఫై చేశారు. చోరీ దృశ్యాలు రికార్డు అయ్యాయి. అందులో ఓ 50 ఏళ్ల వయసు కలిగిన వ్యక్తి లోపలికి వెళ్లి సామాన్లు సర్దుకుని పారిపోయినట్టు గుర్తించారు. అయితే.. అమ్మవారి మూలవిరాట్‌పై ఉన్న నాలుగు కిలోల వెండి వస్తువుల జోలికి వెళ్లలేదు. ఆలయ నిర్వహకుల ఫిర్యాదుతో రంగాల్లోకి దిగిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..