Viral News: 12 మంది భార్యలు, 102 మంది పిల్లలు.. ఇక పిల్లలు వద్దంటూ భార్యలకు గర్భనిరోధక మాత్రలు

మూసా హసహ్యా (67) అనే వ్యక్తి 12 మంది భార్యలున్నారు. వీరందరికి కలిపి 102 మంది పిలల్లున్నారు. అంతేకాదు మూసాకు మనవళ్లు , మనవరాళ్లు కలిపి 568 మంది ఉన్నారు. వీరంతా 12 బెడ్‌రూమ్‌ల ఇంట్లో కలిసి ఉంటున్నారు

Viral News: 12 మంది భార్యలు, 102 మంది పిల్లలు.. ఇక పిల్లలు వద్దంటూ భార్యలకు గర్భనిరోధక మాత్రలు
Uganda Man Musa Hasahya
Follow us
Surya Kala

|

Updated on: Dec 27, 2022 | 3:43 PM

ఒక్క భార్యతోనే వేగలేకపోతున్నాం అంటున్నారు.. అంతేకాదు.. ఇప్పుడు ఒక్క పిల్లే చాలు.. వారికీ చదువు, మంచి భవిష్యత్ ఇవ్వడానికి అని ఆలోచిస్తున్న వారు అధికంగా ఉన్నారు. అయితే ఇలా ఆలోచించే వారికీ  ఉగాండాలోని ఒక వ్యక్తిని చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే అతనికి ఒకరు కాదు.. ఇద్దరు ఏకంగా 12 మంది భార్యలున్నారు.. 102 మంది పిల్లలు ఉన్నారు. అతని వయస్సు ఇప్పుడు 67 సంవత్సరాలు.. ఇక నేను పిల్లలను పోషణకు అయ్యే ఖర్చు భరించ లేను కనుక తన కుటుంబంలో భవిష్యత్తులో మరో బిడ్డ పుట్టడం ఇష్టం లేదు..అందుకనే తన భార్యలకు పిల్లలు పుట్టకుండా గర్భనిరోధక మాత్రలను వాడమని సూచించాడు.. మరి ఎవరీ కలియుగ దృతరాష్ట్రుడు వివరాల్లోకి వెళ్తే..

ఉగాండాలోని బుగిసాకు చెందిన మూసా హసహ్యా (67) అనే వ్యక్తి 12 మంది భార్యలున్నారు. వీరందరికి కలిపి 102 మంది పిలల్లున్నారు. అంతేకాదు మూసాకు మనవళ్లు , మనవరాళ్లు కలిపి 568 మంది ఉన్నారు. వీరంతా 12 బెడ్‌రూమ్‌ల ఇంట్లో కలిసి ఉంటున్నారు. కుటుంబ సభ్యుల సంఖ్య భారీగా ఉండడంతో  కుటుంబ పోషణ రోజు రోజుకీ కష్టంగా మారుతుంది.. పిల్లలు వద్దనుకున్నా మూసా .. తన భార్యలను ఇక నుంచి గర్భనిరోధక మాత్రలు వాడమని కోరాడు. ఇదే విషయంపై మూసా హసహ్యా మాట్లాడుతూ.. తన ఆదాయం పరిమితంగా ఉన్నందున .. ఎక్కువ మంది పిల్లలను పెంచలేను. అందుకే గర్భధారణ వయస్సులో ఉన్న భార్యలందరికీ గర్భనిరోధక మాత్రలను వాడమని సలహా ఇచ్చానని పేర్కొన్నాడు.

మూసా హసహ్యా ఇంకా మాట్లాడుతూ..ఎక్కువ పెళ్లిళ్లు చేసుకోవాలనుకునే యువకులకు కొన్ని సలహాలు సూచనలు కూడా ఇస్తున్నాడు. ఇక నుంచి నాలుగు కంటే ఎక్కువ పెళ్లిళ్లు  వారు అలా చేయవద్దని యువతకు సలహా ఇస్తున్నాడు. ఎందుకంటే ఎక్కువమంది భార్యలు, పిల్లలు ఉంటె.. కొన్ని సంఘటనలు  చెడుగా మారడం ప్రారంభిస్తాయని చెప్పాడు.

ఇవి కూడా చదవండి

మూసాకు ఇప్పటి వరకూ తన పిల్లలు, మనవళ్లందరి పేరు పూర్తిగా తనకు తెలియదని చెప్పాడు. ముసా తన 16 ఏళ్ల వయసులో 1971 సంవత్సరంలో హనీఫాను మొదటిసారి వివాహం చేసుకున్నాడు. రెండేళ్ల తర్వాత తొలిసారి తండ్రి అయ్యాడు. అప్పుడు హనీఫా ఆడపిల్లకు జన్మనిచ్చింది.  గ్రామానికి చైర్‌పర్సన్, వ్యాపారవేత్త అయిన మూసా తన వద్ద డబ్బు ..  భూమి ఉన్నందున తన కుటుంబాన్ని పెంచుకోవాలని అనుకున్నాడు.  తాను సంపాదించగలను..  అందుకే మరిన్ని పెళ్లిళ్లు చేసి కుటుంబాన్ని పెంచుకోవాలని నిర్ణయించుకుని 12 మందిని పెళ్లి చేసుకున్నానని వందమంది పిల్లలని కన్నట్లు చెప్పాడు.

తన భర్త గురించి మొదటి భార్య హనీఫా మాట్లాడుతూ.. అందరి మాటలు వింటాడు. ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా తొందరపడడు. ఆయన అన్ని పక్షాల వాదనలను కచ్చితంగా వింటారు. మమ్మల్ని అందరినీ సమానంగా చూస్తారని చెప్పింది.

అయితే, ఇప్పుడు మూసా తన కుటుంబ పోషణ కోసం పిల్లల భవిష్యత్ కోసం ప్రభుత్వం నుండి సహాయం కోరుతున్నాడు. పిల్లలందరి చదువులకు తన వద్ద డబ్బులు లేవని అంటున్నాడు. అయితే ఇంత పెద్ద కుటుంబం ఉన్నప్పటికీ.. తమకు ఎటువంటి సమస్యలు లేవని మూసా కుటుంబం చెబుతోంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..