రూ.280 కోట్ల విలువైన హెరాయిన్‌ను అక్రమంగా తరలిస్తూ పట్టుబడ్డ పాక్‌ స్మగ్లర్లు.. 

భారత సముద్ర మార్గంలో అక్రమంగా 40 కేజీల హెరాయిన్‌ను తరలిస్తూ పది మంది పాకిస్తాన్‌ స్మగ్లర్లు పట్టుబడ్డారు. గుజరాత్ ఏటీఎస్‌, ఇండియన్‌ కోస్ట్ గార్డ్‌ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో..

రూ.280 కోట్ల విలువైన హెరాయిన్‌ను అక్రమంగా తరలిస్తూ పట్టుబడ్డ పాక్‌ స్మగ్లర్లు.. 
Pakistan Smugglers
Follow us
Srilakshmi C

|

Updated on: Dec 27, 2022 | 3:34 PM

భారత సముద్ర మార్గంలో అక్రమంగా 40 కేజీల హెరాయిన్‌ను తరలిస్తూ పది మంది పాకిస్తాన్‌ స్మగ్లర్లు పట్టుబడ్డారు. గుజరాత్ ఏటీఎస్‌, ఇండియన్‌ కోస్ట్ గార్డ్‌ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో ఈ మేరకు నిందితులను అరెస్టు చేశారు.  వారివద్ద 280 కోట్లకు పైగా విలువైన 40 కేజీల హెరాయిన్‌, 6 తుపాకులను స్వాధీనం చేసుకున్నట్లు ఏటీఎస్ అధికారులు మీడియాకు తెలిపారు. నిందితులతోపాటు, వీరు ప్రయాణిస్తున్న ఇండియన్‌ కోస్ట్ గార్డ్‌ షిప్‌ (ఐసీజీ నౌక)ను కూడా ఓఖా తీరానికి చేరవేశారు. పాకిస్థాన్‌ స్మగ్లర్లు ఆయుధాలతో పట్టుబడినట్లు ఎన్‌సీబీ, ఎన్‌ఐఏకు సమాచారం అందించినట్లు ఏటీఎస్ అధికారులు తెలిపారు.

‘హెరాయిన్, ఆయుధాలతో కొంతమంది డ్రగ్స్ స్మగ్లర్లు గుజరాత్ తీరానికి ఓడలో బయలుదేరినట్లు సమాచారం అందడంతో ఏటీఎస్‌ అధికారులు  అప్రమత్తం అయ్యారు. దీంతో ఓఖా తీరప్రాంతంలో పెట్రోలింగ్‌ ప్రారంభించారు. ఆదివారం రాత్రి ఓడపై దాడి చేయగా.. స్మగ్లర్లు పారిపోవడానికి ప్రయత్నించారు. వారిని వెంబడించి అదుపులోకి తీసుకున్నాం. అరెస్టైన వారి నుంచి దాదాపు 40 కిలోల హెరాయిన్, సుమారు ఆరు తుపాకులను స్వాధీనం చేసుకున్నాం. నార్కో-టెర్రర్ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్లు’ ఓ అధికారి మీడియాకు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.