Viral Video: దేశం కోసం గాడిదలా పని చేస్తున్నా.. తనను తాను గాడిదతో పోల్చుకున్న పాక్ విదేశాంగ మంత్రి భుట్టో

ఇప్పటి వరకూ పర్యటనల పేరుతో పాక్ ప్రజలపై ఎటువంటి భారం మోపలేదని .. అసలు ప్రజలపై భారం మోపని ఏకైక విదేశాంగ మంత్రి తానే అంటూ భుట్టో అభివర్ణించుకున్నారు. అంతేకాదు తన పర్యటనలు తన ప్రయోజనం కోసం కాదని .. వాటి వల్ల పాకిస్థాన్‌కు మేలు జరిగిందని స్పష్టం చేశారు. 

Viral Video: దేశం కోసం గాడిదలా పని చేస్తున్నా.. తనను తాను గాడిదతో పోల్చుకున్న పాక్ విదేశాంగ మంత్రి భుట్టో
Pak Minister Bilawal Bhutto
Follow us
Surya Kala

|

Updated on: Dec 23, 2022 | 4:09 PM

పాకిస్థాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో.. గత కొంత కాలంగా రకరకాలుగా కామెంట్స్ చేస్తూ.. తరచుగా వార్తల్లో నిలుస్తున్నారు. ఆయన మాట తీరుపై మాత్రమే కాదు.. విదేశీ పర్యటనలపై కూడా స్వదేశంలో కూడా నిరసన వ్యక్తం అవుతుంది.  తాజాగా మంత్రి బిలావల్ భుట్టో గురువారం అమెరికాలో విలేకరులతో మాట్లాడుతూ తరచుగా తాను చేస్తోన్న విదేశీ పర్యటనలను సమర్ధించుకున్నారు. అంతేకాదు తనను తాను గాడిదతో పోల్చుకున్నారు. తనకు ఇచ్చిన పదవి బాధ్యతలను నెరవేర్చడం కోసమే తాను తరచుగా విదేశాలకు వెళ్లాల్సి వస్తుందని పేర్కొన్నారు. అంతేకాదు ఇందుకు గాను అయ్యే ఖర్చు ప్రభుత్వంది కాదని.. తన సొంతం డబ్బులని చెప్పారు మంత్రి బిలావల్ భుట్టో.

పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ పోస్ట్ చేసిన వీడియోలో.. బిలావల్ భుట్టో తన విదేశీ పర్యటనల గురించి మాట్లాడుతూ.. తాను “కష్టపడి పనిచేస్తున్నానని ” .. తమ విదేశాంగ శాఖ తనను గాడిదలా పని చేసేలా చేస్తోందంటూ చెప్పారు. అంతేకాదు ఈ సందర్భంగా మంత్రి  భుట్టో తన విదేశీ పర్యటనలపై వస్తున్న విమర్శలపై స్పందించారు. ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంతో పోరాడుతున్న దేశం ఆర్ధిక పరిస్థితి గురించి తన పర్యటన అయ్యే ఖర్చు గురించి తరచుగా వినిపిస్తున్న ప్రశ్నలకు ప్రతిస్పందించారు.

ఇవి కూడా చదవండి

తాను వెళ్తున్న విదేశీ పర్యటనలకు అయ్యే ఖర్చు మొత్తం తన సొంతమేనని.. ప్లైట్ టికెట్స్, హోటల్ బిల్లు అన్నీ తన సొంత ఖర్చు అని వెల్లడించారు. తాను ఇప్పటి వరకూ పర్యటనల పేరుతో పాక్ ప్రజలపై ఎటువంటి భారం మోపలేదని .. అసలు ప్రజలపై భారం మోపని ఏకైక విదేశాంగ మంత్రి తానే అంటూ భుట్టో అభివర్ణించుకున్నారు. అంతేకాదు తన పర్యటనలు తన ప్రయోజనం కోసం కాదని .. వాటి వల్ల పాకిస్థాన్‌కు మేలు జరిగిందని స్పష్టం చేశారు.  ఇతరులుసెలవులకు విదేశాలకు వెళతారు. నేను మాత్రం దేశం కోసం గాడిదలా పని చేస్తున్నాను,” అని మంత్రి తన బృందాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

పాక్ విదేశాంగ మంత్రి ఇటీవల ఐక్యరాజ్యసమితిలో వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. భుట్టోను న్యూయార్క్‌లో అరెస్టు చేసినట్లు వచ్చిన వార్తలను పాకిస్థాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ గురువారం ఖండించింది. పూర్తిగా వాస్తవాలు లేదా ఆధారం లేనిదని వార్తలని చెప్పారు.  మరోవైపు తమ దేశానికి సాయం చేయమంటూ పలు అంతర్జాతీయ సంస్థలను మంత్రి బిలావల్ భుట్టో వేడుకుంటున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..