PM Modi: ఇకపై ఫ్రాన్స్‌లోనూ యూపీఐ సేవలు.. ఇండియన్ కరెన్సీలోనే చెల్లింపులు.. ఎన్ఆర్ఐల సమావేశంలో ప్రధాని మోదీ..

Unified Payments Interface: దేశంలో 2016 నాటి నుంచి యూపీఐ సేవల వినియోగం క్రమక్రమంగా పెరుగుతూ వచ్చింది. డిజిటల్ ట్రాన్సక్షన్స్‌ని కేవలం భారత్‌కి మాత్రమే పరిమితం కాకుండా అంతర్జాతీయ స్థాయిలో విస్తరించాలని ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం..

PM Modi: ఇకపై ఫ్రాన్స్‌లోనూ యూపీఐ సేవలు.. ఇండియన్ కరెన్సీలోనే చెల్లింపులు.. ఎన్ఆర్ఐల సమావేశంలో ప్రధాని మోదీ..
French president Emmanuel Macron and PM Modi
Follow us

|

Updated on: Jul 14, 2023 | 6:44 AM

Unified Payments Interface: దేశంలో 2016 నాటి నుంచి యూపీఐ సేవల వినియోగం క్రమక్రమంగా పెరుగుతూ వచ్చింది. డిజిటల్ ట్రాన్సక్షన్స్‌ని కేవలం భారత్‌కి మాత్రమే పరిమితం కాకుండా అంతర్జాతీయ స్థాయిలో విస్తరించాలని ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉంది. ఇంకా ఈ విధానమైన లావాదేవీలు ఎంతో సులభంగా, సురక్షితంగా ఉండటంతో ప్రపంచ దేశాలు సైతం యూపీఐ నెట్‌వర్క్‌లో భాగస్వామ్యం అయ్యేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. ఈ లిస్టులో తాజాగా యూరోపియన్ దేశమైన ఫ్రాన్స్ కూడా చేరింది. రెండు రోజుల ఫ్రాన్స్ పర్యటన నిమిత్తం ఆ దేశానికి గురువారం సాయంత్రం చేరుకున్నారు ప్రధాని మోదీ. ఈ క్రమంలో ఆయన ప్రవాస భారతీయులతో సమావేశమయ్యారు.

వారితో ప్రధాని మోదీ.. త్వరలో ఫ్రాన్స్‌లో కూడా యూపీఐ సేవలు ప్రారంభం కానున్నాయని, ఈ విధమైన చెల్లింపుల కోసం ఇరు దేశాలు అంగీకరించ్చాయని, పారీస్ పర్యటనకు వచ్చిన భారతీయ పర్యాటకులు ఇకపై ఇండియన్ కరెన్సీలోనే చెల్లింపులు చేయవచ్చని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

కాగా ఇప్పటికే యూఏఈ, భూటాన్, నేపాల్ సహా పలు ప్రపంచ దేశాల్లో యూపీఐ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇంకా భారత్ రిజర్వ్ బ్యాంక్ లెక్కల ప్రకారం, 2022-23 అర్థిక సంవత్సరంలో దాదాపు రూ.139.2 ట్రిలియన్ల లావాదేవీలు జరిగాయి. అలాగే PwC నివేదికల ప్రకారం 2026-27 నాటికీ రోజువారీ లావాదేవీలు 1 బిలియన్ వరకు చేరుకునే అవకాశం ఉంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..