వామ్మో! ఆ దంపతులిద్దరూ సీరియల్ కిల్లర్స్, నరమాంస భక్షకుడు జైల్లో మృతి.. మిస్టరీగా మారిన 30 డెత్ కేసులు

ఒక భార్యాభర్తల జంట మనుషులను మాత్రం ఎందుకు తినకుండా వదిలేయాలి అనుకున్నారేమో.. నరమాంసం భక్షకులుగా మారారు. ఒకరిని కాదు ఇద్దరిని కాదు ఏకంగా ముఫై మంది వ్యక్తులను తినేశారు. చేసిన పాపం పండి పోలీసులకు చిక్కి ఇప్పుడు ఆ దంపతులు జైలు శిక్షకు గురయ్యారు. భర్త జైలులోనే శిక్షను అనుభవిస్తూ రెండేళ్ల క్రితం మరణించాడు.

వామ్మో! ఆ దంపతులిద్దరూ సీరియల్ కిల్లర్స్, నరమాంస భక్షకుడు జైల్లో మృతి.. మిస్టరీగా మారిన 30 డెత్ కేసులు
Russian 'cannibal Couple
Follow us

|

Updated on: Apr 30, 2023 | 11:17 AM

చైనీయులు నడిచేవి, పాకేవి, ఎగిరేవి, ఈదేవి అన్నిటిని ఆహారంగా తింటారు.. ఒక్క మనుషులను తప్ప అని సరదాగా కామెంట్ చేస్తారు.. అయితే ఒక భార్యాభర్తల జంట మనుషులను మాత్రం ఎందుకు తినకుండా వదిలేయాలి అనుకున్నారేమో.. నరమాంసం భక్షకులుగా మారారు. ఒకరిని కాదు ఇద్దరిని కాదు ఏకంగా ముఫై మంది వ్యక్తులను తినేశారు. చేసిన పాపం పండి పోలీసులకు చిక్కి ఇప్పుడు ఆ దంపతులు జైలు శిక్షకు గురయ్యారు. భర్త జైలులోనే శిక్షను అనుభవిస్తూ ఇటీవలే మరణించాడు. ఈ ఘటన జరిగి ఏళ్ళు గడిచినా అప్పుడప్పుడు ఈ మనిషి మాంసాన్ని రుచి మరిగిన రష్యన్ ‘ నరమాంస జంట‘ ను గుర్తు చేసుకుంటూ ఉంటారు. వివరాల్లోకి వెళ్తే..

క్రాస్నోడార్‌కు చెందిన డిమిత్రి బక్షీవ్, నటాలియా బక్షీవా దంపతులు ఓ మహిళను చంపినట్లు ఆరోపణలు వినిపించాయి. బక్షీవ్‌ దంపతులు వరుస హత్యలు, నరమాంస భక్షణ చేసినట్లు నిర్ధారించారు. 2019లో జైలు పాలయ్యారు.

డిమిత్రి బక్షీవ్ తన భార్య నటాలియాలు నివసించే సైనిక స్థావరం వద్ద ఛిన్నాభిన్నమైన మృతదేహం సంచలనం సృష్టించింది. రంగంలోకి దిగిన పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.  డిమిత్రి బక్షీవ్, నటాలియా బక్షీవా దంపతుల ఇంటిలో అనేక ఆహార పదార్థాలు, మాంసన్ని, వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. DNA టెస్ట్ కోసం పంపించారు.

ఇవి కూడా చదవండి

దంపతుల జీవిత చరిత్ర డిమిత్రి 1982లో నటాలియా 1975లో జన్మించారు. నటాలియా కొంత కాలం పాటు AK సెరోవ్ పైలట్‌ల క్రాస్నోడార్ హయ్యర్ మిలిటరీ ఏవియేషన్ స్కూల్‌లో పారిశుద్ధ్య విభాగంలో సీనియర్ నర్సుగా పనిచేసింది. మద్యానికి బానిసై పనిని నిర్లక్ష్య చేయడంతో ఉద్యోగం పోగొట్టుకుంది. డిమిత్రి దోపిడీ ఓసారి కారు దొంగతనం కోసం ప్రయత్నించాడు. అపార్ట్‌మెంట్ రిపేర్‌మెన్‌గా, సాధారణ కార్మికుడిగా పనిచేశాడు. బక్షీవ్‌లు 2012 నుండి పాఠశాల వసతి గృహంలో కలిసి జీవించారు. ఈ జంట సంఘవిద్రోహ జీవనశైలి వైపు నడిచారు.

ఈ దంపతుల నేరాలు ఎలా వెలుగులోకి వచ్చాయి అంటే:

డిమిత్రి తన మొబైల్ ఫోన్‌ను పోగొట్టుకున్నాడు. ఆ సెల్ లో మనిషి అవశేషాల చిత్రాలున్నాయి. ఆ ఫొటోలో ఒకటి మనిషి చేతిని నోటిలో పెట్టుకుని తింటున్నట్లుంది. ఈ ఫోన్ రోడ్డు శుభ్రం చేస్తున్న కార్మికుల చేతిలో పడింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సెల్ ఫోన్ లో ఫోటోలు చూసి షాక్ తిన్న పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. అక్కడ పొదల్లో మానవ అవశేషాలను కనుగొన్నారు. అప్పుడు ఈ దంపతులు తాము మహిళను చంపినట్లు అంగీకరించారు.

దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. మద్యం తాగుతున్న సమయంలో నటాలియా .. మరో మహిళ ఎలెనా మధ్య అకస్మాత్తుగా గొడవ జరిగింది. అప్పుడు ఎలెనా ను చంపమని నటాలియా  తన భర్తను కోరింది. ఎలెనను కత్తితో పొడిచి చంపేశాడు. శవాన్ని ఛిన్నాభిన్నం చేశారు. కొన్ని అవశేషాలను తమ ఇంటిలో ఉంచారు. మరికొన్నింటిని చుట్టుపక్కల ప్రాంతంలో విసిరారు.

బక్షీవ్ ఇంట్లో సెలైన్ ద్రావణంలో మనిషి శరీరం ముక్కలు, ఆహారం కనిపించాయి. అంతేకాదు ఇంటి నేలమాళిగలో ఉన్న భూభాగంలో మరణించినవారి శరీరం అవశేషాలను గుర్తించారు.  వెంటనే వాటిని స్వాధీనం చేసుకుని టెస్ట్ కోసం పంపించారు. దీంతో దంపతుల నేరం నిర్ధారణ అయింది.

నటాలియా బక్షీవా ఫిబ్రవరి 2019లో దోషిగా నిర్ధారించి.. హత్యకు ప్రేరేపించినందుకు కోర్టు ఆమెను దోషిగా నిర్ధారించింది. ఆమెకు 10 సంవత్సరాలు జైలు శిక్ష విధించారు. అయితే తన శిక్షపై తగ్గించమంటూ మళ్ళీ .  అప్పీల్ చేసింది. అయినా శిక్ష మారలేదు. జూన్ 28, 2019 న డిమిత్రి బక్షీవ్‌కు 12 సంవత్సరాల 2 నెలల శిక్ష విధించబడింది. అంతేకాదు మానసిక వైద్యం చేయించాలని సూచించింది . అయితే జైలులో ఉన్న సమయంలోనే ఫిబ్రవరి 16, 2020న డిమిత్రి టైప్ వన్ డయాబెటిస్‌తో మరణించాడు.

ఈ జంట 1999 నుండి మనుషులను హత్య చేసి మాంసాన్ని తింటున్నారు. ఈ నరమాంస భక్షకులు  బాధితులను చంపే ముందు హింసించేవారని తెలుస్తోంది. శరీరాన్ని ముక్కలుగా కట్ చేసి వివిధ రకాల  వంటకాలను తయారు చేసి, అవశేషాలను క్యాన్‌లో ఉంచారని అనేక వార్త పత్రికల కథనం.

ప్రాథమిక నివేదికల ప్రకారం, నటాలియా తాను పనిచేసిన పాఠశాలకు క్యాన్డ్ మానవ మాంసాన్ని సరఫరా చేసింది. నటాలియా 30 హత్యలను అంగీకరించినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ, వివాహిత జంట నరమాంస భక్షణ కోసం చేసిన వరుస హత్యలు నేటికీ సంచనలనమే..

సేకరణ :Dmitry and Natalia Baksheevy

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..