Chinese Chip Implant: చైనాలో మద్యం వ్యసనంతో ఏటా లక్షల మరణాలు.. ఆల్కహాల్ అలవాటు తగ్గించేందుకు కొత్త చిప్‌ తయారీ

ఒక నివేదిక ప్రకారం మద్యం సేవించడం వల్ల చైనాలో ప్రతి సంవత్సరం 7లక్షలకు పైగా మరణిస్తున్నారు. ఏటా 6,50,000 మంది పురుషులు, 59,000 మంది మహిళలు మరణిస్తున్నారు. మద్యపానం చేసేవారిలో 45 నుండి 59 సంవత్సరాల వయస్సు గల వారి సంఖ్య అత్యధికంగా ఉంది.

Chinese Chip Implant: చైనాలో మద్యం వ్యసనంతో ఏటా లక్షల మరణాలు.. ఆల్కహాల్ అలవాటు తగ్గించేందుకు కొత్త చిప్‌ తయారీ
Chinese Chip Implant
Follow us

|

Updated on: Apr 29, 2023 | 11:11 AM

చైనా ప్రజల్లో పెరుగుతున్న మద్య వ్యసనంతో ఎన్నో ఏళ్లుగా ఇబ్బంది పడుతోంది. మద్యం కారణంగా ప్రతి సంవత్సరం సగటున 7 లక్షలకు పైగా మరణాలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతుంది. ఈ నేపథ్యంలో మద్యం వ్యసనం ఎదుర్కోవడానికి.. చైనాలో మొదటిసారిగా సర్జికల్ చిప్‌ను ఉపయోగించారు. మద్యం వ్యసనాన్ని అధిగమించేందుకు ఈ చిప్ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఇప్పటికే ఈ చిప్ ట్రయల్‌లో భాగంగా 36 ఏళ్ల లియుకి చిప్ అమర్చబడింది. ఈ శస్త్రచికిత్స 5 నిమిషాల పాటు కొనసాగింది. చైనాలో ఈ చికిత్స చేయించుకున్న మొదటి వ్యక్తి లియుగా రికార్డ్ సృష్టించాడు.

చైనాలోని హునాన్ ప్రావిన్స్‌లోని బ్రెయిన్ హాస్పిటల్‌లో ఈ సర్జరీ జరిగింది. చిప్ క్లినికల్ ట్రయల్‌గా శస్త్రచికిత్స జరిగింది. అయితే మరోవైపు చైనాలో మరణాలను తగ్గించడంలో కొత్త చిప్ సహాయపడుతుందా లేదా అనే  ప్రశ్న చాలామందిలో ఉదయిస్తోంది.

చిప్ ఆల్కహాల్ వ్యసనం నుంచి ఎలా బయటపడేస్తుందంటే..? SCMP నివేదిక ప్రకారం.. లియు శస్త్రచికిత్స ఏప్రిల్ 12 న జరిగింది. అయితే చిప్ దుష్ప్రభావాలు, ప్రభావాలను అర్థం చేసుకున్న తర్వాతనే నివేదిక జారీ చేశారు. ఐక్యరాజ్యసమితికి చెందిన ఇంటర్నేషనల్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో వైస్ ప్రెసిడెంట్, సర్జన్ డాక్టర్ హావో వీ మద్య వ్యసనం నుండి బయటపడేందుకు సర్జికల్ చిప్‌ను సిద్ధం చేశారు. పేషెంట్‌కి సర్జరీ చేసి చిప్‌ను అమర్చింది ఆయనే. ఈ చిప్‌కు ఆల్కహాల్ క్రేవింగ్ చిప్ అని పేరు పెట్టారు. నివేదిక ప్రకారం.. కొత్త చిప్.. ఇంప్లాంట్ చర్మం దిగువన అమర్చినట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

చిప్ ఎలా పని చేస్తుందంటే..? 

వాస్తవానికి ఈ చిప్ సాధారణ శస్త్రచికిత్స చేసి రోగికి అమరుస్తారు. శస్త్రచికిత్స అనంతరం చిప్ లోని ఈ ప్రత్యేకమైన రసాయనం నాల్ట్రెక్సోన్‌ను విడుదల చేస్తుంది. ఈ రసాయనాన్ని శరీరం సంగ్రహిస్తుంది. మద్యం సేవించమని సందేశాలు పంపే మెదడులోని భాగాన్ని నిరోధించేలా ఈ ఔషధం పనిచేస్తుంది. ఈ విధంగా ఆల్కహాల్ తాగాలని కోరికను తగ్గిస్తుంది.

చిప్‌లోని మందు ఎంత ప్రభావవంతం అంటే? ఈ చిప్‌ తయారు చేయడానికి ముందు ఆల్కహాల్‌ అలవాటును తగ్గించేలా డిసల్ఫిరామ్ మందు ఉపయోగించారు. అయితే దీని దుష్ప్రభావాల కారణంగా ఇప్పుడు ఈ చిప్ తో భర్తీ చేశారు. నాల్ట్రెక్సోన్ వాడే వ్యక్తులు మద్యం తాగడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. అంతకు ముందులా మద్యం తాగాలనే కోరిక కలగడం లేదని నిపుణులు చెబుతున్నారు. చిప్ ట్రయల్ కొనసాగుతోంది. దీనిలో ఉన్న మందు ఇప్పటికే ప్రభావవంతంగా పనిచేస్తుందని నిరూపించబడింది. కనుక ఈ చిప్ ప్రయోగం కూడా విజయవంతమయ్యే అవకాశం ఉంది.

దుష్ప్రభావాల ప్రమాదం ఏమిటి? మెంటల్ హెల్త్ అండ్ అడిక్షన్ ట్రీట్‌మెంట్ సెంటర్ నాల్ట్రెక్సోన్ ఆల్కహాల్ వ్యసనం నుండి బయటపడటానికి సురక్షితమైన మార్గమని చెబుతోంది. అయితే ఈ చిప్ వలన కొన్ని దుష్ప్రభావాలు  కూడా ఉన్నాయి. శరీరంపై నొప్పి, ఎరుపు, దురద, ఇన్ఫెక్షన్ లేదా వాపు వంటివి కలగవచ్చు.

చైనాలో మద్యం ఎంత సమస్యగా మారిందంటే?  ఒక నివేదిక ప్రకారం మద్యం సేవించడం వల్ల చైనాలో ప్రతి సంవత్సరం 7లక్షలకు పైగా మరణిస్తున్నారు. ఏటా 6,50,000 మంది పురుషులు, 59,000 మంది మహిళలు మరణిస్తున్నారు. మద్యపానం చేసేవారిలో 45 నుండి 59 సంవత్సరాల వయస్సు గల వారి సంఖ్య అత్యధికంగా ఉంది. చైనాలో కొత్త చిప్‌ను మార్పిడి చేసిన తర్వాత.. క్లినికల్ ట్రయల్ విజయవంతమైతే అది ఉపశమనం కలిగించే విషయమని ప్రజలు అంటున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..