Trees: పొరుగింటి ఆవరణలో చెట్లు నరికివేసిన వ్యక్తి.. కోర్టును ఆశ్రయించిన చెట్ల యజమాని.
పక్కింట్లో చెట్లను నరికినందుకు ఓ వ్యక్తికి కోర్టు అక్షరాలా 14 కోట్లు జరిమానా విధించింది. ఈ వింతఘటన అమెరికాలో చోటుచేసుకుంది. న్యూజెర్సీకి చెందిన సమీహ్ షిన్వే అనే వ్యక్తి ఇంటి ఆవరణలో ఉన్న దాదాపు 32 చెట్లను పొరుగింట్లో ఉండే యాంటీ టెర్రరిజం..
పక్కింట్లో చెట్లను నరికినందుకు ఓ వ్యక్తికి కోర్టు అక్షరాలా 14 కోట్లు జరిమానా విధించింది. ఈ వింతఘటన అమెరికాలో చోటుచేసుకుంది. న్యూజెర్సీకి చెందిన సమీహ్ షిన్వే అనే వ్యక్తి ఇంటి ఆవరణలో ఉన్న దాదాపు 32 చెట్లను పొరుగింట్లో ఉండే యాంటీ టెర్రరిజం కంపెనీకి చెందిన సీఈవో హెబర్ ఆ చెట్లన్నింటినీ నరికివేయించాడు. తన ఇంటి ముందున్న పర్వతాలు, ఆకాశం కనిపించడం లేదని, అందుకు చెట్లు అడ్డుగా ఉన్నాయన్న కారణంతో దాదాపు అర ఎకరం స్థలంలో ఉన్న ఓక్ చెట్లు, మాపుల్స్, బిర్చ్ చెట్లను నరికివేయించాడు. దీంతో సదరు చెట్ల యజమాని కోర్టు కెక్కాడు.
ఒక్కో చెట్టుకు వెయ్యి డాలర్ల చొప్పున మొత్తం 32,000 డాలర్లను కోర్డు జరిమానా విధించింది. ఆ రాష్ట్ర చట్టం ప్రకారం చట్టవిరుద్ధంగా చెట్లను కొట్టివేస్తే జరిమానా విధించడం లేదా వాటి స్థానంలో కొత్త మొక్కలను పెంచడం చేయాలి. ఐతే షిన్వే తన ఇంటి ఆవరణలోని స్థలాన్ని అపరిశుభ్రం చేసినందుకు, 20 నుంచి 150 ఏళ్ల వయసున్న పురాతన చెట్లను నరికినందుకు కూడా పరిహారం చెల్లించవల్సిందిగా డిమాండ్ చేశాడు. అందుకు 1.2 మిలియన్ల డాలర్లు కోరాడు. అతని చర్య తన హృదయాన్ని ముక్కలు చేసిందని, ఎంతో ఇష్టంగా పెంచుకున్న చెట్లను నరికివేశాడని, అవి మళ్లీ పెరగడానికి చాలా సమయం పడుతుందని షిన్వే ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక నిందితుడు హెబర్ విషయానికొస్తే ఇప్పటికే కొర్టు అతనికి 14 కోట్ల జరిమాని విధించింది. ఇక చెట్లను నరకడానికి అతను చేసిన ఖర్చు మరో 4 లక్షల డాలర్లు అంటే 3,28,38,500 కోట్లవరకు అదనంగా ఉంటుంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...