Viral Video: ఛీ..ఛీ..స్వామీజీ ముసుగులో..అనాథ బాలికపై దారుణం.. వీడియో వైరల్.
విశాఖపట్నంలో దారుణం జరిగింది. ఓ ఆధ్యాత్మిక గురువు మైనర్ బాలికపై రెండేళ్లుగా అత్యాచారం చేస్తున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విశాఖలో ఈ సంఘటన ప్రస్తుతం కలకలం సృష్టిస్తోంది. బాధిత బాలిక ఫిర్యాదుతో అప్రమత్తమైన పోలీసులు స్వామీజీని అర్థరాత్రి అదుపులోకి తీసుకున్నారు.
విశాఖపట్నంలో దారుణం జరిగింది. ఓ ఆధ్యాత్మిక గురువు మైనర్ బాలికపై రెండేళ్లుగా అత్యాచారం చేస్తున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విశాఖలో ఈ సంఘటన ప్రస్తుతం కలకలం సృష్టిస్తోంది. బాధిత బాలిక ఫిర్యాదుతో అప్రమత్తమైన పోలీసులు స్వామీజీని అర్థరాత్రి అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా తనపై జరిగిన దారుణాల గురించి పాప ఒక్కొక్కటి చెబుతూ వచ్చింది. తనకు రెండేళ్లు స్వామీజీ నరకం చూపించాడని, చిత్రహింసలకు గురిచేశాడని పాప ఆవేదన వ్యక్తం చేసింది.
చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడంతో రాజమహేంద్రవరానికి చెందిన ఓ పన్నెంటేళ్ల బాలికను తమ బంధువులు ఐదో తరగతి వరకు చదివించారు. ఆ తరువాత సేవ నిమిత్తం విశాఖలోని కొత్త వెంకోజీపాలెం దగ్గర ఉన్న జ్ఞానానంద ఆశ్రమంలో చేర్పించారు. ఆశ్రమంలో ఉదయమంతా బాలిక ఆవులకు మేత మేడయం, పేడ తీయడం వంటి పనులు , చేస్తుండేది. అర్థరాత్రి అయ్యేసరికి ఎవరూ లేని సమయం చూసి ఆశ్రమ నిర్వాహకుడు గదిలోకి తనను తీసుకెళ్లి త్యాచారం చేసేవాడని బాలిక తెలిపింది. గత సంవత్సరకాలంగా తనపై స్వామీజీ అత్యాచారం చేస్తున్నాడని, తన కాళ్లకు గొలుసు వేసి బంధించేవాడని, ఎదురుతిరిగితే కొట్టేవాడని తెలిపింది. ప్రతి రోజు రెండు చెంచాల అన్నం, కేవలం నీటితో కలిపి పెట్టేవాడని కన్నీటిపర్యంతమయింది.
ఆశ్రమంలోని ఓ పనిమనిషి బాలికకు అండగా నిలిచింది. ఆమె సహాయంతోనే ఈ నెల13న బాధిత బాలిక ఆశ్రమంనుంచి తప్పించుకుని, విశాఖలో బాలిక తిరుమల ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కి ఓ ప్రయాణికురాలితో తన బాధను పంచుకుంది. ఆ మహిళా ప్రయాణికురాలు పాపను కృష్ణా జిల్లాలోని ఓ బాలల సంక్షేమ గృహంలో చేర్పించేందుకు ప్రయత్నించగా పోలీసుల నుంచి లేఖ కావాలని వారు అడిగారు. దీంతో మహిళ కంకిపాడు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లేఖ తీసుకుని గృహానికి వెళ్లింది. ఆ సమయంలో ఆశ్రమంలో తనపై జరిగిన దారుణాలను బాలిక వారికి వివరించింది. దీంతో సీడబ్ల్యూసీ సభ్యులు విజయవాడలోని దిశ పోలీసుస్టేషన్లో బాలికతో కంప్లైంట్ ఇప్పించారు. పోలీసులు విశాఖ ఆశ్రమంలో ఉంటున్న పూర్ణానంద స్వామీజీపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అనంతరం బాలికను మెడికల్ చెకప్‌ల కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. మరోవైపు సోమవారం రాత్రి పోలీసులు స్వామీజీని అరెస్టు చేశారు. ఈ క్రమంలో ఆశ్రమ భూములు కాజేయాలని కొందరు చూస్తున్నారని అందులో భాగంగానే తనపై ఈ కుట్ర చేస్తున్నారని స్వామీజీ ఆరోపిస్తున్నారు. ఈ కేసులో న్యాయ పోరాటం చేస్తానని చెప్పారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Adipurush Fake News: ఆదిపురుష్ విషయంలో అది ఫేక్ న్యూస్.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
Newly Couple: పెళ్లింట తీరని విషాదం.. ఫస్ట్ నైట్ రోజే.. ఆవిరైన ఆశలు.. వీడియో.
Prabhas – Kriti sanon: కృతి ఓర చూపులకి ప్రభాస్ పడిపోయేనా..? ఆ లుక్స్ ఎవరైనా పడిపోలసిందే..!