Viral: ఖాళీగా ఉన్న ఇంటికి వచ్చిన కరెంట్ బిల్లుతో ఓ కారు కొనొచ్చు..! రూ. 7,97,576/- బిల్లు.
ఓ ఇంటికి కరెంట్ బిల్లు ఎంత వస్తుంది? సాధారణంగా చూసుకుంటే ఐదు వందల వరకు వస్తుంది. మరీ వినియోగం ఎక్కువైతే ఓ 2 వేల వరకూ రావచ్చు. అదీ కరెంట్ వినియోగిస్తేనే. మరి ఖాళీగా ఉన్నా, ఆ ఇంటికి మినిమం కరెంట్ బిల్లు రావడం సహజం. అది ఏ వందో రెండొందలో వస్తుంది.
ఓ ఇంటికి కరెంట్ బిల్లు ఎంత వస్తుంది? సాధారణంగా చూసుకుంటే ఐదు వందల వరకు వస్తుంది. మరీ వినియోగం ఎక్కువైతే ఓ 2 వేల వరకూ రావచ్చు. అదీ కరెంట్ వినియోగిస్తేనే. మరి ఖాళీగా ఉన్నా, ఆ ఇంటికి మినిమం కరెంట్ బిల్లు రావడం సహజం. అది ఏ వందో రెండొందలో వస్తుంది. కానీ ఇక్కడ వినియోగించని ఓ ఇంటికి ఏకంగా లక్షల్లో బిల్లు వచ్చింది. ఉప్పల్ ఏఈ పరిధిలోని హైకోర్టు కాలనీలో ఓ ఇంటి కరెంట్ బిల్లు ఏకంగా 7,97,576 రూపాయలు వచ్చింది. ఆ బిల్లును చూసి ఇంటి యజమాని గుండె గుభేలుమంది. హైకోర్టు కాలనీలో నివాసముంటున్న పాశం శ్రీదేవి ఇంటికి రెండు కరెంట్ మీటర్లు ఉన్నాయి. గ్రౌండ్ ఫ్లోర్‌లో ఖాళీగా ఉన్న పోర్షన్‌కి ప్రతి నెల 200 నుంచి 300 వరకు కరెంట్ బిల్లు వచ్చేది. మే నెలకి సంబందించిన కరెంట్ బిల్లు జూన్ నెలలో వచ్చిన బిల్లు ఆన్లైన్‌లో చూడగానే వారికి గుండె ఆగినంత పనైంది. ఒక నెల బిల్లు ఏకంగా 7,97,576 రూపాలు వచ్చింది. విద్యుత్ అధికారులని సంప్రదిస్తే నిర్లక్ష్యంగా సమాధానం చెప్తూ, డిడి కట్టుకొని చెక్ చేయించుకోవాల్సిందని, లేని పక్షంలో వచ్చిన బిల్లు కట్టాల్సిందేనంటు చేతులు దులిపేసుకున్నారు. మీటర్ మార్పిడి కోసం ఉప్పల్‌లోని విద్యుత్ కార్యాలయానికి వెళ్లగా.. అక్కడా పట్టించుకోకుండా గంటలు తరబడి తమను వెయిట్ చేయించారని, శ్రీదేవి తల్లి అండాలు తెలిపారు. విద్యుత్ కార్యాలయం వద్ద ఇదే సమస్యతో అనేక మంది ఇబ్బందులకు గురవుతున్నారు అని అండాలు తెలిపారు. మీటర్లు సక్రమంగా పనిచేయక, ఇలా లక్షల్లో బిల్లులు వేసి, కట్టాల్సిందేనని ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని వాపోయారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Adipurush Fake News: ఆదిపురుష్ విషయంలో అది ఫేక్ న్యూస్.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
Newly Couple: పెళ్లింట తీరని విషాదం.. ఫస్ట్ నైట్ రోజే.. ఆవిరైన ఆశలు.. వీడియో.
Prabhas – Kriti sanon: కృతి ఓర చూపులకి ప్రభాస్ పడిపోయేనా..? ఆ లుక్స్ ఎవరైనా పడిపోలసిందే..!