Viral : అదృష్టం అంటే ఇలా ఉండాలి.. కొడితే దెబ్బకు లైఫ్ సెటిలైపోవాలంటే..
కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలన్నది నానుడి. అలాగే అదృష్టం వరించిందంటే దెబ్బకు లైఫ్ సెటిలైపోవాలంటే. తాజాగా అలాంటి అదృష్టమే ఓ వ్యక్తి ఇంటి తలుపుతట్టి మరీ వరించింది. అవును అతను లాటరీలో ఏకంగా 1.58 బిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో దాదాపు 13 వేల కోట్లకు సమానం. అంతపెద్ద మొత్తాన్ని లాటరీలో గెలుచుకున్నాడు. అయితే ఎందుకోగానీ లాటరీ సంస్థ ఆ వ్యక్తి వివరాలను గోప్యంగా ఉంచింది.
కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలన్నది నానుడి. అలాగే అదృష్టం వరించిందంటే దెబ్బకు లైఫ్ సెటిలైపోవాలంటే. తాజాగా అలాంటి అదృష్టమే ఓ వ్యక్తి ఇంటి తలుపుతట్టి మరీ వరించింది. అవును అతను లాటరీలో ఏకంగా 1.58 బిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో దాదాపు 13 వేల కోట్లకు సమానం. అంతపెద్ద మొత్తాన్ని లాటరీలో గెలుచుకున్నాడు. అయితే ఎందుకోగానీ లాటరీ సంస్థ ఆ వ్యక్తి వివరాలను గోప్యంగా ఉంచింది. ఈ ఘటన అమెరికాలోని ఫ్లోరిడాలో చోటుచేసుకుంది. ఫ్లోరిడాలోని నెప్యూన్ బీచ్‌లోని పబ్లిక్స్ స్టోర్‌లో అతడు ఇటీవల మెగా మిలియన్ లాటరీ టిక్కెట్టు కొనుగోలు చేశాడు. ఆగస్టు 8న తీసిన డ్రాలో విజేతగా నిలిచాడు. అతడు కొన్న టిక్కెట్టుకు జాక్‌పాట్ దక్కినట్టు నిర్వాహకులు ప్రకటించారు. అమెరికా చరిత్రలోనే ఇది మూడో అతిపెద్ద లాటరీ అని స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి. కాగా, లాటరీ నిర్వాహకులు ఈ మొత్తాన్ని 30 ఏళ్ల పాటు ఏటా కొంత మొత్తం చొప్పున లబ్ధిదారుడికి చెల్లిస్తారు. ఏకమొత్తంగా తీసుకోవాలనుకంటే అతడికి 783.3 మిలియన్ డాలర్లు అంటే 6,488 కోట్లు మాత్రమే వస్తుందని నిర్వాహకులు తెలిపారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...