Viral: ఓరీ మీ భక్తి బంగారం కానూ.. పామును ఇంటికి తీసుకొచ్చి పూజలా.. వీడియో వైరల్.

Viral: ఓరీ మీ భక్తి బంగారం కానూ.. పామును ఇంటికి తీసుకొచ్చి పూజలా.. వీడియో వైరల్.

Anil kumar poka

|

Updated on: Aug 24, 2023 | 9:10 PM

నిజశ్రావణమాసం ప్రారంభంతోనే ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మొదటి శ్రావణ సోమవారంతో పాటు నాగపంచమి కూడా కావడంతో దేశంలోని పలు ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. భక్తులు కోలాహలంగా నాగదేవత విగ్రహాలకు పూజలు చేశారు. పుట్టలో పాలు పోసి.. తమ మొక్కులు చెల్లించుకున్నారు. పుట్ట దగ్గర పూజలు.. ఆ పుట్ట దగ్గర ఒకవేళ పాము ప్రత్యక్షంగా కనిపిస్తే నేరుగా దానికే పూజలు చేయడం మనం చూసి ఉంటాం.

నిజశ్రావణమాసం ప్రారంభంతోనే ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మొదటి శ్రావణ సోమవారంతో పాటు నాగపంచమి కూడా కావడంతో దేశంలోని పలు ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. భక్తులు కోలాహలంగా నాగదేవత విగ్రహాలకు పూజలు చేశారు. పుట్టలో పాలు పోసి.. తమ మొక్కులు చెల్లించుకున్నారు. పుట్ట దగ్గర పూజలు.. ఆ పుట్ట దగ్గర ఒకవేళ పాము ప్రత్యక్షంగా కనిపిస్తే నేరుగా దానికే పూజలు చేయడం మనం చూసి ఉంటాం. కానీ కర్ణాటక ఉత్తర కన్నడ జిల్లాలో నిజమైన పామును ఇంటికి తీసుకొచ్చి మరీ పూజలు చేసింది ఓ కుటుంబం. సిరాసీలోని ప్రశాంత్ హులేకల్ అనే వ్యక్తికి పాములు అంటే చాలా ఇష్టమట. అందుకే ప్రతి ఏటా నాగుల పంచమి రోజు కుటుంబ సమేతంగా అత్యంత భక్తిశ్రద్ధలతో పాములకు పూజలు చేస్తారట. ఇందులో విశేషమేముంది అనుకోకండి.. పండుగ రోజున ఏకంగా ఓ పామును ఇంటికి తీసుకొచ్చి దానిని ఓ పళ్లెంలో ఉంచి ప్రత్యేకంగా పూజలు చేస్తారు. ఎప్పటిలాగే ఈసారికూ నాగపంచమి సందర్భంగా ఓ పాము పిల్లకు పూజలు చేశారు. సమాజానికి పాములను సంరక్షించాలన్న సందేశాన్ని ఇచ్చేందుకే ఇలా చేస్తున్నట్లు ప్రశాంత్ పేర్కొన్నాడు. గడిచిన 35 ఏళ్లుగా ఆయన సరీసృపాల సంరక్షణకు కృషి చేస్తున్నాడు. సర్పాల గురించి అవగాహన కల్పించేందుకే తాను ఇలా పూజలు చేస్తానని, పాముల పట్ల తనకు ప్రత్యేక భక్తి ఉందని చెబుతున్నాడు. నాగుల పంచమి రోజు అడవి నుంచి పామును పట్టుకొచ్చి పూజలు చేసి, ఆ తర్వాత దాన్ని సురక్షితంగా అడవిలో విడిచిపెడతామని చెప్పాడు. ప్రశాంత్ తండ్రి సురేశ్ సైతం పాముల సంరక్షణకు పాటుపడేవారు. సురేశ్ మరణం తర్వాత ఆయన కొడుకులు ప్రశాంత్, ప్రకాశ్, ప్రణవ్​లు.. పాముల సంరక్షణకు పాటుపడుతున్నారు. స్థానికంగా ఎక్కడైనా పాము కనిపించిందని ఫోన్ వచ్చిందంటే వీరు అక్కడికి వెళ్లిపోతారు. పామును జాగ్రత్తగా పట్టుకొని ఆ తర్వాత దాన్ని దగ్గర్లోని అడవిలో విడిచిపెడతారు. అటవీ శాఖ అధికారులు సైతం పాములను పట్టేందుకు ప్రశాంత్ సాయం తీసుకుంటారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...