Viral video: మి ఇంట్లో ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా..? ఇది భారతీయులకే సాధ్యం మరి..!
తాజాగా ఓ అద్భుతమైన వీడియోను ఇంటర్నెట్‌లో షేర్ చేస్తూ.. ఇది భారతీయులకు మాత్రమే సాధ్యం అంటూ ట్వీట్ చేశారు. ఈ వీడియోలో ఓ మహిళ ఎలాంటి ఫ్రిజ్ ఉపయోగించకుండా ఐస్ క్రీమ్ తయారు చేసింది.
మన టెక్ దిగ్గజం ఆనంద్ మహీంద్రా ఎప్పుడూ బిజినెస్‌లోనే కాదు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. ట్యాలెంట్ ఎక్కడ ఉన్నా ఈయన కంటినుంచి తప్పించుకోవడం అసాధ్యం. తాజాగా ఓ అద్భుతమైన వీడియోను ఇంటర్నెట్‌లో షేర్ చేస్తూ.. ఇది భారతీయులకు మాత్రమే సాధ్యం అంటూ ట్వీట్ చేశారు. ఈ వీడియోలో ఓ మహిళ ఎలాంటి ఫ్రిజ్ ఉపయోగించకుండా ఐస్ క్రీమ్ తయారు చేసింది. ఆ మహిళ పాలలో ఐస్‌క్రీమ్ తయారీకి అవసరమైన పదార్ధాలను వేసి బాగా మరిగించింది. వాటిని ఒక క్యానులో వేసి మూత పెట్టింది. దానిని మరో పెద్ద డబ్బాలో మధ్యలో పెట్టి, చుట్టూ ఐస్ ముక్కలు వేసింది. తర్వాత తన ఇంట్లోని సీలింగ్ ఫ్యాన్‌కింద ఓ టీపాయ్ వేసి, దానిమీద ఈ డబ్బాను ఉంచింది. సీలింగ్ ఫ్యాన్‌కు ఓ పొడవాటి తాడును కట్టింది. ఆ తాడును టీపాయ్‌మీద ఉన్న డబ్బాలోని క్యానుకు కట్టి, ఫ్యాన్ ఆన్ చేసింది. ఫ్యాన్‌తో పాటుగా ఆ క్యాన్ కూడా తిరిగి, తిరిగి.. కాసేపటికి ఐస్‌క్రీమ్ తయారైంది. ఈ వీడియో పోస్ట్ చేస్తూ చేయాలనే దృఢ సంకల్పం, శ్రద్ధ ఉంటే మార్గం అదే దొరుకుతుందని, ఈ హ్యాండ్ మేడ్, ఫ్యాన్ మేడ్ ఐస్‌క్రీమ్ చెప్పకనే చెప్పిందని, ఇలాంటివి ఇండియాలోనే సాధ్యం అంటూ క్యాప్షన్ ఇచ్చారు. అద్భుతమైన ఈ వీడియోను 2 మిలియన్ల మందికి పైగా వీక్షించారు. 55 వేల మంది లైక్ చేయగా 6 వేలమందికి పైగా రీట్వీట్ చేశారు. వరల్డ్ బెస్ట్ అండ్ ప్యూర్ ఐస్ క్రీమ్, గ్రేట్ ఎఫర్ట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jr.NTR – Ram Charan: కనిపించని దోస్తాన్.! చెర్రీ బర్త్‌డేకి ఎన్టీఆర్ ఎందుకు రాలేదు..?
Viral Video: రూ.80 లక్షలు ఇస్తానన్నా ఆమె ఒప్పుకోలేదు..
Rashmika Mandanna: ఇక ఆ డ్యాన్స్ చేయను..! నెటిజన్ ప్రశ్నకు రష్మిక సమాధానం..