Dance Video: సామి..సామి.. అంటూ హోరెత్తించిన స్కూల్ విద్యార్ధినులు.. వీడియో

Dance Video: సామి..సామి.. అంటూ హోరెత్తించిన స్కూల్ విద్యార్ధినులు.. వీడియో

Anil kumar poka

|

Updated on: Mar 15, 2023 | 9:22 PM

ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్‌ నటించిన పుష్ప సినిమా ప్రపంచవ్యాప్తంగా బ్లాక్‌ బస్టర్‌ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా వచ్చి ఏడాది దాటినా పుష్ప మేనియా జనాలను ఇంకా వదల్లేదు.

ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్‌ నటించిన పుష్ప సినిమా ప్రపంచవ్యాప్తంగా బ్లాక్‌ బస్టర్‌ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా వచ్చి ఏడాది దాటినా పుష్ప మేనియా జనాలను ఇంకా వదల్లేదు. ఇక ఈ సినిమాలోని సామి సామి పాట ఎంత పాపులర్‌ అయిందంటే.. సామాన్యులనుంచి సెబ్రిటీల వరకూ వయసుతో సంబంధం లేకుండా రీల్స్‌ చేశారు. తాజాగా ఓ స్కూల్లో చిన్నారులు సామి సామి పాటకు అదిరిపోయే స్టెప్పులతో డాన్స్‌ చేశారు. స్కూల్‌ యూనిఫారంలో ఉన్న చిన్నారి అక్కడి వేదికపై ఎంతో ఉత్సాహంగా డాన్స్‌చేస్తుంటే, అది చూసి మితా విద్యార్ధులు కూడా కాలు కదిపారు. ఎనర్జిటిక్‌ డాన్స్‌తో ఆకట్టుకున్న చిన్నారుల పెర్‌ఫార్మెన్స్‌కు సంబంధించిన వీడియో సబితా చంద్ర అనే ట్విట్టర్‌ యూజర్‌ షేర్‌ చేసారు. నెట్టింట ఓ రేంజ్‌లో వైరల్‌ అవుతున్న ఈ వీడియోను ఇప్పటికే 34 వేలమందికి పైగా వీక్షించారు. అంతేకాదు, సో క్యూట్‌, రాక్‌ స్టార్‌ అంటూ తమదైన శైలిలో కామెంట్లు కురిపిస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Naatu Naatu Song in Oscar 2023: వరల్డ్‌వైడ్‌గా ఆస్కార్‌ ఫీవర్‌.. ప్రపంచ వేదికపై తెలుగోడి సత్తా..

Allu Arjun – Shah Rukh Khan: షారుఖ్‌కు దిమ్మతిరిగే పంచ్‌ ఇచ్చిన బన్నీ.. వీడియో.

Allu Arjun: అర్జున్ రెడ్డి 2.O.. వచ్చేస్తున్నాడు పాన్ ఇండియా మూవీ.. కాస్కోండి మరి..!

Published on: Mar 15, 2023 09:22 PM