Cows – Tiger: ఐకమత్యమే బలం అంటే ఇదే.. ఆవుల మంద చేసిన పనికి నెటిజన్లు ఫిదా.. వీడియో.

ఐకమత్యమే బలం.. కలిసి ఉంటే కలదు సుఖం.. ఇలాంటి మాటలు మనం చిన్నప్పట్నుంచీ వింటూనే ఉన్నాం. కేవలం వినడానికి, వల్లించడానికే కాదు ఇది ఆచరణసాధ్యం కూడా అని నిరూపించే సంఘటనలూ లేకపోలేదు. అందుకు ఉదాహరణే ఈ వీడియో.

Follow us
Anil kumar poka

|

Updated on: Jun 25, 2023 | 9:25 AM

ఈ వీడియోలో ఓ గోవుల మంద పెద్దపులి బారినుంచి తమ తోటి గోవును ఎలా కాపాడుకున్నాయో చూస్తే ఐకమత్యంలో ఉన్న బలమేంటో తెలుస్తుంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఆవుల మంద నుంచి కాస్త దూరంగా ఒంటరిగా ఉన్న ఓ ఆవుపైకి నక్కినక్కి వచ్చి దాడికి దిగింది ఓ పెద్దపులి. దీంతో ఆవు పెద్దగా అరవడంతో అది గమనించిన మిగతా ఆవుల మంద పరుగు పరుగున అక్కడికి వచ్చాయి. వాస్తవానికి ఆవుపై దాడిచేస్తున్న పులిని చూసి మిగతా ఆవులు భయంతో పారిపోవాలి.. కానీ అవి అలా చేయలేదు. తమ తోటి ప్రాణికోసం అండగా నిలిచాయి. క్షణం ఆలస్యం చేయకుండా ధైర్యంగా ముందుకు ఉరికాయి. అన్ని ఆవులూ కలిసి పులిపై దాడికి దిగాయి. అన్ని ఆవులు ఒక్కసారిగా దూసుకురావడంతో భయపడిన పులి పట్టుకున్న ఆవును అక్కడే వదిలి పొదల్లోకి పరుగు లంఘించుకుంది. అయితే పులి అక్కడక్కడే ఉండడంతో.. గాయపడిన ఆ ఆవును చుట్టుముట్టి మళ్లీ దాడికి దిగకుండా తెల్లవారే దాకా కాపలాగా ఉన్నాయి మిగతా ఆవులు. ఆదివారం అర్ధరాత్రి భోపాల్‌ కేర్వా శివారుల్లోని ఓ డెయిరీ ఫామ్‌ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే.. గాయపడిన ఆ ఆవు పరిస్థితి పాపం విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీఫుటేజీ బయటకు రావడంతో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ వీడియో వీక్షించిన వేలాదిమంది నెటిజన్లు తమదైనశైలిలో స్పందిస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం: Videos Adipurush Fake News: ఆదిపురుష్‌ విషయంలో అది ఫేక్ న్యూస్‌.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్.. Newly Couple: పెళ్లింట తీరని విషాదం.. ఫస్ట్ నైట్ రోజే.. ఆవిరైన ఆశలు.. వీడియో.

Prabhas – Kriti sanon: కృతి ఓర చూపులకి ప్రభాస్‌ పడిపోయేనా..? ఆ లుక్స్ ఎవరైనా పడిపోలసిందే..!