Viral Video: ఛీ.. మనిషా..? రాక్షసా..? వీధి కుక్కపై యాసిడ్ పోసిన మహిళ.. వీడియో వైరల్.
ముంబైలో దారుణం జరిగింది. మాల్వాని ప్రాంతంలోని అపార్ట్‌మెంట్ సముదాయం వద్ద 35 ఏళ్ల సబిస్తా అన్సారీ అనే మహిళ ఒక వీధి కుక్కపై యాసిడ్ పోసింది. దీంతో కుక్క బ్రౌనీ బాధతో అల్లాడిపోయింది ఈ సంఘటనలో అది ఒక కన్ను కోల్పోయింది. ఈ నేపథ్యంలో ఒక వ్యక్తి ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆ మహిళపై కేసు నమోదు చేశారు. విషయం తెలిసిన వెంటనే టీవీ నటి జయ భట్టాచార్య, ఆమె బృందం రంగంలోకి దిగారు.
ముంబైలో దారుణం జరిగింది. మాల్వాని ప్రాంతంలోని అపార్ట్‌మెంట్ సముదాయం వద్ద 35 ఏళ్ల సబిస్తా అన్సారీ అనే మహిళ ఒక వీధి కుక్కపై యాసిడ్ పోసింది. దీంతో కుక్క బ్రౌనీ బాధతో అల్లాడిపోయింది ఈ సంఘటనలో అది ఒక కన్ను కోల్పోయింది. ఈ నేపథ్యంలో ఒక వ్యక్తి ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆ మహిళపై కేసు నమోదు చేశారు. విషయం తెలిసిన వెంటనే టీవీ నటి జయ భట్టాచార్య, ఆమె బృందం రంగంలోకి దిగారు. జంతు సంరక్షణ కేంద్రానికి ఆ కుక్కను తరలించి చికిత్స అందించారు. యాసిడ్ దాడి వల్ల అది ఒక కన్ను కోల్పోయినట్లు వారు ఆరోపించారు. కుక్కపై యాసిడ్ దాడి చేసిన సబిస్తా అన్సారీపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఆమెపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఆ మహిళ పిల్లులకు ఆహారం పెడుతుందని, ఆ పిల్లులపై కుక్క దాడి చేయడంతో ఆగ్రహించి ఈ చర్యకు పాల్పడినట్లు స్థానికులు ఆరోపించారు. కాగా, ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...