Viral video: ఒక్క ఐడియా జీవితాన్నే మార్చేసింది.. ఉద్యోగాలు వదిలి..లక్షల్లో సంపాదన..
2015లో ఉద్యోగాలకు రాజీనామా చేసిన ఈ సింగ్ కపుల్ బెంగళూర్‌లో సమోసా సింగ్ పేరుతో ఫుడ్ స్టార్టప్‌ను ప్రారంభించి, రెండేళ్లలో తిరుగులేని సక్సెస్ సాధించారు.
సమోసా కావాలంటూ ఏడుస్తున్న చిన్నారి ఏడుపు అతని జీవితాన్నే మార్చేసింది. బెంగళూరుకు చెందిన ఓ జంట మంచి ఉద్యోగం చేస్తున్నారు. ఇద్దరికీ వేతనాలుకూడా భారీగానే ఉన్నాయి. అయినా వారు ఉద్యోగాలను వదిలి సమోసా వ్యాపారం చేస్తూ కోట్లలో ఆర్జిస్తున్నారు. అవును… ఇది నమ్మలేని నిజం.. బెంగళూరుకు చెందిన నిధి సింగ్ ఆమె భర్త శిఖర్ వీర్ సింగ్ భారీ వేతనాలతో కూడిన ఉద్యోగాలను విడిచిపెట్టడమే కాదు, సొంత ఇంటిని కూడా తెగనమ్మి సమోసా వ్యాపారంలో పెట్టుబడిగా పెట్టారు. ఈ దంపతులు చేసిన పనికి బంధువులు, మిత్రులు అంతా వీరి నిర్ణయం సరికాదేమో అని సందిగ్ధం వ్యక్తం చేసినా వెనకడుగు వేయలేదు. వారందరి అంచనాలనూ తలక్రిందులు చేస్తూ ‘సింగ్ సమోసా స్టార్టప్’ గ్రాండ్ సక్సెస్ అయింది. 2015లో ఉద్యోగాలకు రాజీనామా చేసిన ఈ సింగ్ కపుల్ బెంగళూర్‌లో సమోసా సింగ్ పేరుతో ఫుడ్ స్టార్టప్‌ను ప్రారంభించి, రెండేళ్లలో తిరుగులేని సక్సెస్ సాధించారు. ప్రస్తుతం ఈ కంపెనీ వార్షిక టర్నోవర్ 45 కోట్లకు చేరిందంటే నమ్మశక్యంగాలేదు కానీ అదే నిజం. శిఖర్ సింగ్‌కు తాను చదువుకునే రోజుల్లోనే సమోసా వ్యాపారం ప్రారంభించాలనే కోరిక ఉండేదట. ఓ రోజు శిఖర్ ఫుడ్ కోర్టులో ఉండగా ఓ బాలుడు సమోసా కోసం ఏడుస్తుండటం చూసి, తన మదిలో మెదిలిన ఆలోచనను ఆచరనలోకి తెచ్చి తిరుగులేని సక్సెస్ సాధించాడు. దేశవ్యాప్తంగా చిన్న, పెద్దా అత్యధికంగా ఇష్టపడే స్నాక్ సమోసా. అప్పుడే శిఖర్‌సింగ్ నిర్ణయించుకున్నారు. తర్వాత ఉద్యోగాన్ని విడిచిపెట్టిన శిఖర్ సమోసా స్టార్టప్‌ను ప్రారంభించాడు. సమోసా సింగ్ మెనూలో ఎన్నో రకాల సమోసా స్నాక్స్ ఆప్షన్స్ నోరూరిస్తాయి. ఇక తమ వ్యాపారాన్ని మరింత విస్తరించడానికి సింగ్ దంపతులు ప్రణాళికలు రచిస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jr.NTR – Ram Charan: ఎన్టీఆర్ తోపా..! రామ్ చరణ్ తోపా ..? డాన్స్ మాస్టర్ ప్రేమ్ రక్షిత్..
Viral Video: ఇది బైక్ కాదు పుష్పక విమానం.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు..! వైరల్ వీడియో..
Vidya Balan: ఆ దర్శకుడు నన్ను రూమ్‌కు రమ్మన్నాడు.. విద్యాబాలన్. వీడియో