My India My LiFE Goals: మదర్ ఆఫ్ ట్రీస్.. వేలాది చెట్లకు తల్లి తిమ్మక్క.. సమాజం బాధించినా వెనకడుగు వేయకుండా..

My India My LiFE Goals: మదర్ ఆఫ్ ట్రీస్.. వేలాది చెట్లకు తల్లి తిమ్మక్క.. సమాజం బాధించినా వెనకడుగు వేయకుండా..

Shaik Madar Saheb

|

Updated on: Aug 07, 2023 | 8:13 PM

Mother of Trees Saalumarada Thimmakka: సాలుమరద తిమ్మక్క.. ఈమె ప్రస్తుత వయస్సు 112 ఏళ్లు ఈమె తన జీవితకాలంలో 65 ఏళ్లు మొక్కలు నాటడానికే అంకితమయ్యారు. స్వయానా రాష్ట్రపతి ప్రోటోకాల్‌ను పక్కనపెట్టి ఆమె కాళ్లకు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారంటే ఆమె గొప్పతనం ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు.. పర్యావరణ ప్రేమికురాలు.. కర్ణాటకకు చెందిన సాలుమరద తిమ్మక్క అందరికీ సుపరిచితమే.. ముద్దుగా వృక్షమాత అని పిలుచుకుంటారు.

Mother of Trees Saalumarada Thimmakka: సాలుమరద తిమ్మక్క.. ఈమె ప్రస్తుత వయస్సు 112 ఏళ్లు ఈమె తన జీవితకాలంలో 65 ఏళ్లు మొక్కలు నాటడానికే అంకితమయ్యారు. స్వయానా రాష్ట్రపతి ప్రోటోకాల్‌ను పక్కనపెట్టి ఆమె కాళ్లకు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారంటే ఆమె గొప్పతనం ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు.. పర్యావరణ ప్రేమికురాలు.. కర్ణాటకకు చెందిన సాలుమరద తిమ్మక్క అందరికీ సుపరిచితమే.. ముద్దుగా వృక్షమాత అని పిలుచుకుంటారు. పిల్లలు పుట్టలేదని ఒకప్పుడు సమాజం తిమ్మక్కను సూటిపోటి మాటలతో బాధించింది. ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు. కానీ భర్త అండగా నిలిచి నేర్పడంతో మొక్కలు నాటడం మొదలుపెట్టారు. వాటికి ఆయువు పోసారు మొక్కలనే సొంత బిడ్డలుగా భావించి ప్రేమను పంచి మహా వృక్షాలుగా చేశారు. దాదాపు 8వేలకు పైగా మొక్కలు నాటి మహా వృక్షాలుగా చేశారు. కర్నాటకలో పర్యావరణ పరిరక్షణకు ఆమె చేసిన కృషిని గుర్తించిన కేంద్రం ప్రతిష్ఠాత్మక 2019 పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ సందర్భంగా మదర్ ఆఫ్ ట్రీస్.. సాలుమరద తిమ్మక్క కార్యదక్షత ఎంతో మందికి ఆదర్శనీయం. జై హో గ్రీన్ వారియర్..

మరిన్ని జాతీయ వార్తల కోసం..