Sabarimala: శబరిమల అయ్యప్పస్వామి భక్తులకు కేంద్రం శుభవార్త..
శబరిమల అయ్యప్ప భక్తులకు కేంద్రం శుభవార్త చెప్పింది. శబరిమల సమీపంలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపింది. శబరిమల సమీపం లోని కొట్టాయం దగ్గర గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్
శబరిమల అయ్యప్ప భక్తులకు కేంద్రం శుభవార్త చెప్పింది. శబరిమల సమీపంలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపింది. శబరిమల సమీపం లోని కొట్టాయం దగ్గర గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి ఆమోదం తెలిపినందుకు ప్రధాని మోదీకి కేంద్ర టూరిజం శాఖ మంత్రి కిషన్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు కిషన్ రెడ్డి ఆదివారం ప్రకటన విడుదల చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని భారత ప్రభుత్వం విమాన ప్రయాణాన్ని ప్రజాస్వామ్యీకరించడం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. తద్వారా మధ్యతరగతి, తక్కువ ప్రాధాన్యత కలిగిన వారు తక్కువ ఖర్చుతో కూడిన విమాన ప్రయాణాన్ని పొందగలరంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వివరించారు. 2014 నుంచి ప్రధాని మోడీ ఆధ్వర్యంలో భారత ప్రభుత్వం ఈ లక్ష్యం కోసం అహర్నిషలు పని చేస్తోందన్నారు. దీంతో విమాన రంగంలో పెను మార్పులు వచ్చాయని తెలిపారు. నేడు దాదాపు 150 ఆపరేషనల్ ఎయిర్‌పోర్ట్‌లు ఉన్నాయని.. వాటిలో సగం (74) 2014 తర్వాత ప్రారంభించినట్లు కిషన్ రెడ్డి తెలిపారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Lati Charge on Allu Arjun Fans: అర్థరాత్రి పోలీసోళ్లకు చుక్కలే..! ఏమాత్రం తగ్గని బన్నీ ఫ్యాన్స్..