Onion Prices: త్వరలో  ఉల్లి ఘాటు తప్పదా..? నిత్యావసరాల ధరలతో  సామాన్యులు సతమతం.

Onion Prices: త్వరలో ఉల్లి ఘాటు తప్పదా..? నిత్యావసరాల ధరలతో సామాన్యులు సతమతం.

Anil kumar poka

|

Updated on: Aug 16, 2023 | 4:44 PM

రోజు రోజుకీ పెరుగుతున్న నిత్యావసరాల వస్తువుల ధరలతో సామాన్యులు సతమతం అవుతున్నారు. నిన్న టమాట, ఈరోజు ఉల్లిపాయలు. ఉల్లిపాయ ధరలు గత వారంతో పోల్చుకుంటే స్వల్పంగా పెరిగింది. దేశంలో పెరుగుతున్న ఉల్లిపాయల ధరలను నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ ఆర్థిక సంవత్సరానికి గాను మూడు లక్షల మెట్రిక్ టన్నుల ఉలిపాయలను కేంద్రం బఫర్ స్టాక్ గా గోదాముల్లో భద్రపరిచింది.

రోజు రోజుకీ పెరుగుతున్న నిత్యావసరాల వస్తువుల ధరలతో సామాన్యులు సతమతం అవుతున్నారు. నిన్న టమాట, ఈరోజు ఉల్లిపాయలు. ఉల్లిపాయ ధరలు గత వారంతో పోల్చుకుంటే స్వల్పంగా పెరిగింది. దేశంలో పెరుగుతున్న ఉల్లిపాయల ధరలను నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ ఆర్థిక సంవత్సరానికి గాను మూడు లక్షల మెట్రిక్ టన్నుల ఉలిపాయలను కేంద్రం బఫర్ స్టాక్ గా గోదాముల్లో భద్రపరిచింది. ఏటా మార్కెట్ లోకి సరఫరా తగ్గి,ధరలు పెరిగిన సందర్భాల్లో కేంద్రం ఆ బఫర్ స్టాక్ ను విడుదల చేస్తుంటుంది. దాంతో ఉల్లిపాయలు ధరలు పెరగకుండా నియంత్రిస్తుంది. దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ముఖ్యమైన మార్కెట్లకు ఉల్లిపాయల నిల్వలను పంపించాలని నిర్ణయించింది. ఈ ఏడాదిలోనే అత్యధిక ధరలు నమోదైన, దేశంలోని సగటు ఉల్లిగడ్డ ఎక్కువగా ఉన్న, గత నెలతో పోలిస్తే ధరలు పెరిగిన ప్రాంతాలకు వాటిని సరఫరా చేయాలని, దానితోపాటు ఈ-వేలం, ఈ-కామర్స్ ప్లాట్ఫాములలో రిటైల్ విక్రయ మార్గాల ద్వారా ఉల్లిని సరఫరా చేస్తామని ఆహారం మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రాలు ప్రజా పంపిణీ కోసం కోరితే తగ్గింపు ధరతో వాటిని సరఫరా చేస్తామని వెల్లడించింది. హైదరాబాద్ మలక్ పేట్ మార్కెట్ కు ఉల్లిపాయలు ప్రస్తుతం మహారాష్ట్ర నుండి దిగబడుతున్నాయి. వచ్చే నెల నుండి రాయలసీమ నుండి దిగుబడి వస్తుందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్ మార్కెట్ కి రోజుకి ఎన్ని క్వింటల్లా ఉల్లిపాయలు దిగబడి అవుతున్నాయి..? వ్యాపార వర్గాలు ఏమంటున్నారు..? ఉల్లిపాయ సంఘం అధ్యక్షుడు ధరల నియంత్రణ గురించి ఏమి చెప్తున్నారు..? పూర్తి వివరాలు ఈ వీడియోలో..

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...