Viral Photo: రామాయణంలో బంగారు జింక.. నిజ జీవితంలో సిల్వర్ జింక.. వైరల్ అవుతున్న షాకింగ్ ఫోటో..

రామాయణం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి భారతీయుడికి రాయమణం గురించి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. ముఖ్యంగా రామాయణంలో కనిపించే బంగారు జింక ఎపిసోడ్‌తోనే అసలు కథ అంతా స్టార్ట్ అవుతుంది. శూర్పణఖ ఘటన తరువాత..

Viral Photo: రామాయణంలో బంగారు జింక.. నిజ జీవితంలో సిల్వర్ జింక.. వైరల్ అవుతున్న షాకింగ్ ఫోటో..
Silver Deer
Follow us
Shiva Prajapati

|

Updated on: Mar 29, 2023 | 8:45 AM

రామాయణం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి భారతీయుడికి రాయమణం గురించి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. ముఖ్యంగా రామాయణంలో కనిపించే బంగారు జింక ఎపిసోడ్‌తోనే అసలు కథ అంతా స్టార్ట్ అవుతుంది. శూర్పణఖ ఘటన తరువాత.. ఆమె సోదరుడు రావణాసురుడి ఆదేశానుసారం మారీచుడు బంగారు జింక వేషంలో సీతారాముడు, లక్ష్మణుడు ఉన్న ప్రదేశానికి వెళ్లిన విషయం తెలిసిందే. అలా మారు వేషంలో వెళ్లిన రాక్షస బంగారు జింకను చూసి అబ్బురపడిపోతుంది సీతమ్మ. రాముడు కూడా ఆ బంగారు జింకను చూసి చాలా ఆశ్చర్యపోతాడు. ఆ బంగారు వర్ణంలోని జింక తనకు కావాలని సీతమ్మ రామయ్యను కోరుతుంది.

ఇది రామాయణ కాలం నాటి బంగారు జింక కథ. మరి నిజ జీవితంలో ఎప్పుడైనా బంగారు వర్ణం జింకను చూశారా? బంగారం కాదు గానీ.. మీకోసం సిల్వర్ రంగు జింకను చూపిస్తున్నాం. అవును, సిల్వర్ రంగులో ఉన్న జింకకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అడవిలో తల్లి జింక వెంట నడుచుకుంటూ సిల్వర్ రంగులో ఉన్న జింక పిల్ల వెళ్తుండగా.. ఫోటో తీశారు కెమెరామెన్. ఈ దృశ్యం అంగుల్ జిల్లాలోని లబంగి గెస్ట్ హౌస్ పరిసరాల్లో కనిపించింది. ఇందుకు సంబంధించిన ఫోటో ఇప్పుడు వైరల్ అయ్యింది. ఇది నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం.. ఈ సిల్వర్ జింకను మీరూ చూసేయండి.

ఇవి కూడా చదవండి

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో ఇదే..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..