Viral Video: గుండె ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి.. ఒక్కసారిగా గాల్లోకి లేచిన కారు.. భీకర రోడ్డు ప్రమాదం..
మనం సినిమాల్లో చూస్తూనే ఉంటాం.. ఫైటింగ్ సీన్లలోనూ, ప్రత్యేక సందర్భంలోనో కార్లు ఎగిరిపడుతుంటాయి. వాహన ప్రమాదాలను అత్యంత భయానకంగా చిత్రీకరిస్తుంటారు. యాక్షన్ సినిమాల్లో రోడ్డుపై వెళ్తున్న వాహనం ఒక్కసారిగా ఎగిరి పడుతుంటుంది. పల్టీల మీద పల్టీలు కొడుతూ రోడ్డుపై దూసుకెళ్తుంటుంది.
మనం సినిమాల్లో చూస్తూనే ఉంటాం.. ఫైటింగ్ సీన్లలోనూ, ప్రత్యేక సందర్భంలోనో కార్లు ఎగిరిపడుతుంటాయి. వాహన ప్రమాదాలను అత్యంత భయానకంగా చిత్రీకరిస్తుంటారు. యాక్షన్ సినిమాల్లో రోడ్డుపై వెళ్తున్న వాహనం ఒక్కసారిగా ఎగిరి పడుతుంటుంది. పల్టీల మీద పల్టీలు కొడుతూ రోడ్డుపై దూసుకెళ్తుంటుంది. అదంతా సినిమాలో.. మరి రియల్‌లో ఇలాంటి భయనకమైన సీన్‌ను ఎప్పుడైనా చూశారా? ఎలాంటి పొరపాటు లేకుండా ఓ కారు అమాంతం గాల్లో ఎగిరి.. దాదాపు కొంత దూరం వరకు పల్టీలు కొడుతూ వెళ్లింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో నెటిజన్లను షాక్‌కు గురిచేస్తుంది.
వైరల్ అవుతున్న ఈ వీడియో విదేశాలకు సంబంధించింది. ఇందులో.. రోడ్డుపై వాహనాలు వెళ్తున్నాయి. సాధారణంగానే చాలా విదేశాల్లో కార్లలో కెమెరాలు ఉంటాయి. ముందు జరుగుతున్న పరిణామాలన్నీ రికార్డ్ అవుతాయి. ఇక్కడ కూడా అదే జరిగింది. ఓ కారు రయ్‌మంటూ రోడ్డుపై దూసుకుపోతోంది. ఇంతలో దానికి కాస్త ముందు వెళ్తున్న కారు టైర్ ఊడిపడింది. అలా ఊడిన టైర్.. స్పీడ్‌గా దూసుకెళ్తున్న కారు కిందకు వెళ్లింది. ఇంకేముంది.. ఆ కారు అమాంతం పైకి ఎగిరింది. ఆపై పల్టీల మీద పల్టీలు కొట్టింది. ఈ భీకర దృశ్యమంతా వెనుకాలే వస్తున్న మరో కార్ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఆ రోడ్డు ప్రమాద దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. నెటిజన్లు షాక్ అవుతున్నారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో ఇదే..
Witnessed and recorded the most INSANE car crash yesterday, you can see Autopilot also swerve and avoid the rouge tire for me $TSLA pic.twitter.com/csMh2nbRNX
— Anoop (@Anoop_Khatra) March 25, 2023
మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..