Viral Video: విదేశీ కాన్వొకేషన్ వేడుకలో మువ్వన్న జెండా రెపరెప.. తన దేశ భక్తిని చాటిన స్టూడెంట్..
ఒక విద్యార్థి ర్యాంప్ పై నడుస్తూ వచ్చాడు. అది కూడా భారతీయ సాంప్రదాయ దుస్తులను ధరించి రావడమే కాదు.. నా జేబులో ఉన్న భారత జాతీయ జెండాను తీసుకుని విప్పి అక్కడ ప్రదర్శించాడు. విద్యార్థి చేసిన దేశభక్తి చర్యకు కొందరు నెటిజన్లు సమర్ధిస్తే.. మరికొందరు అంటా బూటకం అని అంటున్నారు.
ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనిన పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవము అని రాయప్రోలు మన దేశాన్ని కీర్తించడమే కాదు.. భారతీయులుగా దేశం పట్ల చూపించాల్సిన ప్రేమని గౌరవాన్ని తన గీతంతో తెలియజెప్పారు. ఈ పాటను ఓ ప్రవాస విద్యార్థి మళ్ళీ గుర్తు చేశాడు. విదేశాలలో చదువుతున్న భారతీయ విద్యార్థికి సంబంధించిన ఒక వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో ప్రతి ఒక్క భారతీయుడి హృదయాన్ని కదిలిస్తుంది. ట్విట్టర్‌లో ఓ రేంజ్ లో హల్ చల్ చేస్తోంది. వీడియోలోఓ విద్యార్థి తన కుర్తా నుండి త్రివర్ణ పతాకాన్ని బయటకు తీశాడు.. అనంతరం ఆ జెండాను విప్పి రెండు చేతులతో పైకి పట్టుకున్నాడు.
ఒక విద్యార్థి ర్యాంప్ పై నడుస్తూ వచ్చాడు. అది కూడా భారతీయ సాంప్రదాయ దుస్తులను ధరించి రావడమే కాదు.. నా జేబులో ఉన్న భారత జాతీయ జెండాను తీసుకుని విప్పి అక్కడ ప్రదర్శించాడు. విద్యార్థి చేసిన దేశభక్తి చర్యకు కొందరు నెటిజన్లు సమర్ధిస్తే.. మరికొందరు అంటా బూటకం అని అంటున్నారు. అయితే ఎక్కువ మంది ఆ స్టూడెంట్ కు మద్దతుగా నిలిచారు. అతను భారతదేశానికి తిరిగి రాడని.. అంతర్జాతీయ వేదికపై దేశభక్తిని ప్రదర్శించడంలో అర్థం లేదని ఎక్కువమంది అభిప్రాయపడ్డారు.
ఒక వినియోగదారు స్టూడెంట్ చేసిన పనిని విమర్శిస్తూ” ఇందులో గర్వించదగిన ఘట్టం ఏముంది? అతను విదేశీ కరెన్సీలో పెట్టుబడి పెట్టాడు. అంతేకాని భారత దేశానికి ఏమి మేలు.. ఇక్కడ చదువుకుని పై చదువులంటూ విదేశాలకు వెళ్ళాడు.. ఇక్కడే ఉంటె భారతదేశ ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేసేవాడు.” అని కామెంట్స్ చేస్తున్నారు.
ఇక్కడ వీడియో చూడండి
The way he took out our Flag ♥️🇮🇳
Thats called Patriotism ♥️🇮🇳
Goosebumps 🙌 Proud of you champ … ⚡️✨🙌🌈 pic.twitter.com/Hpm3PfGqZk
— 🇮🇳 𝓜𝓲𝓷𝓲 🇮🇳 (@Mini_Tripathii) August 10, 2023
వీడియోలో స్టూడెంట్ పేరు మహేష్ నారాయణ్ అని తెలుస్తోంది. అతను సాంప్రదాయ భారతీయ దుస్తులు, కుర్తా , ధోతీ ధరించి వేదికపైకి ప్రవేశించాడు. ఒక వినియోగదారు అతని దుస్తులను మెచ్చుకుని, “సాంప్రదాయ పంచె.. బాగుంది సోదరా” అని వ్రాశాడు.
అయితే, మరొక వినియోగదారు విద్యార్థి దేశభక్తిని ప్రశ్నించాడు .. విదేశాల నుంచి “భారతదేశానికి ఎంతమంది తిరిగి వచ్చి స్థిరపడతారు అనేది ప్రశ్న.” వేయగా.. మరికొందరు మన దేశంలో భారీ జనాభా ఉంది.. కనీసం వారు మన దేశం పేరును ఉన్నతంగా ఉంచుతున్నారు” అని కామెంట్ చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..