Idli Vada Video: ఇడ్లీతో స్టఫ్డ్ బజ్జీలు.. ఇలాంటి ప్రయోగాలు ఆపండి బాబోయ్ అంటూ నెటిజన్లు నిరసన..

ఈ వీడియోలో ఇడ్లితో కొత్త ఆహార పదార్థాన్ని తయారు చేసే ప్రక్రియ మొత్తాన్ని చూపుతుంది. ఈ ప్రత్యేకమైన వంటకం చేయడానికి.. ఒక ఇడ్లీని తీసుకొని దానికి కొంత బంగాళాదుంప, సగ్గుబియ్యంతో తయారు చేసిన కూరని స్టఫ్ గా పెట్టి.. దానిని శాండ్‌విచ్ లా మరొక ఇడ్లితో కవర్ చేశాడు. అనంతరం ఆ ఇడ్లీలను తోపులా కలిపినా శనగపిండిలో ముంచి దానిని తీసుకుని మరుగుతున్న నూనెలో వేసి వేయించాడు.

Idli Vada Video: ఇడ్లీతో స్టఫ్డ్ బజ్జీలు.. ఇలాంటి ప్రయోగాలు ఆపండి బాబోయ్ అంటూ నెటిజన్లు నిరసన..
Idli Vada Video Viral
Follow us

|

Updated on: Aug 11, 2023 | 1:07 PM

టిఫిన్స్ లో ఎన్ని రకాలున్నా ఇడ్లికి ఉన్న స్థానం ప్రత్యేకం. ఒకప్పుడు దక్షిణ భారతీయుల వంటకంగా ప్రసిద్ధి చెందిన ఈ ఇడ్లికి ఇప్పుడు దేశ వ్యాప్తంగా భారీ సంఖ్యలో అభిమానులున్నారు. తెల్లని మల్లెపువ్వుల్లా కనిపిస్తూ.. మెత్తని దూదిలా ఉండి సాంబార్, కొబ్బరి చట్నీ, కారంపొడి, నెయ్యి వంటి వాటిని జోడించి తింటే ఆహా అనాల్సిందే ఎవరైనా.. బలానికి బలం, ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని ఇచ్చే ఇడ్లి అందరికి ఇష్టమైన ఆహార పదార్ధం. కాలక్రమంలో వచ్చిన మార్పుల్లో భాగంగా ఇడ్లిలో కూడా భిన్నమైన రకాలుగా తయారు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంటాయి. స్ట్రీట్ ఫుడ్ గా నైనా, స్టార్ హోటల్స్ లో నైనా టిఫిన్ అంటే ఇడ్లి నే బెస్ట్ ఎంపిక అంటారు. అయితే ప్రస్తుతం నెట్టింట్లో ఇడ్లికి సంబంధించిన ఒక వీడియో వైరల్ అవుతుంది.

ఇడ్లీ తో స్టఫ్డ్ బజ్జీలు

మహ్మద్ ఫ్యూచర్‌వాలా (@MFuturewala) అనే ఒక స్ట్రీట్ ఫుడ్ విక్రేత ఇడ్లీతో తయారు చేస్తున్న ఓ వింత వంటకానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియోకి “ఇడ్లీ కాని ఇడ్లీ” అని టైటిల్ కూడా ఇచ్చాడు. చూసిన వారు ఎవరైనా సరే ఆ క్యాప్షన్ తో ఏకీభవిస్తారు కూడా.. !

ఇవి కూడా చదవండి

ఈ వీడియోలో ఇడ్లితో కొత్త ఆహార పదార్థాన్ని తయారు చేసే ప్రక్రియ మొత్తాన్ని చూపుతుంది. ఈ ప్రత్యేకమైన వంటకం చేయడానికి.. ఒక ఇడ్లీని తీసుకొని దానికి కొంత బంగాళాదుంప, సగ్గుబియ్యంతో తయారు చేసిన కూరని స్టఫ్ గా పెట్టి.. దానిని శాండ్‌విచ్ లా మరొక ఇడ్లితో కవర్ చేశాడు. అనంతరం ఆ ఇడ్లీలను తోపులా కలిపినా శనగపిండిలో ముంచి దానిని తీసుకుని మరుగుతున్న నూనెలో వేసి వేయించాడు. అతను ఇడ్లీ బంగాళాదుంప శాండ్‌విచ్‌లలా తయారు చేసి వేడి నూనెలో డీప్ ఫ్రై చేస్తాడు. అనంతరం ఈ ఫ్యూజన్ ఫ్రైడ్ ఇడ్లీ రిసిపిని సాంబార్, చట్నీతో అందిస్తాడు.

ఈ స్ట్రీట్ ఫుడ్ స్టాల్ ఎక్కడ ఉంది అని కొందరు కామెంట్ చేస్తే.. అది ఎక్కడో పూణేలో ఉన్నట్లు అనిపిస్తుంది, ఈ ట్వీట్‌లో కామెంట్ చేశారు.

లొకేషన్ పూణే అనిపిస్తుంది

చాలా మంది ఫుడ్ బ్లాగర్లు ఇటువంటి విచిత్రమైన వంటకాల వీడియోలను తరచుగా పంచుకుంటారు, ముఖ్యంగా స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్‌లో విక్రయించేవి. ఇడ్లీ అనేది ఒక అద్భుతమైన అల్పాహారం. ఇడ్లీ, శాండ్‌విచ్ , వడల కలయికతో నెటిజన్లు ఆకట్టుకోలేదు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..