Watch Video: ఇదేం మేకప్‌రా బాబు..! ముఖం కూడా కనిపించనంతగా అలంకరిస్తున్న చిన్నారి.. నెట్టింట నవ్వులు పూయిస్తున్న వీడియో..

మేకప్ అనే దానికి అమ్మాయిలు పెట్టింది పేరు. సరదాగా బయటకు వాకింగ్‌కి వెళ్లాలన్నా, స్కూల్, కాలేజ్, ఆఫీస్ ఇలా ఎక్కడకు వెళ్లాలన్నా చిన్నాపెద్దా తేడా లేకుండా అంతా మేకప్ వాడుతుంటారు. మేకప్ వారి..

Watch Video: ఇదేం మేకప్‌రా బాబు..! ముఖం కూడా కనిపించనంతగా అలంకరిస్తున్న చిన్నారి.. నెట్టింట నవ్వులు పూయిస్తున్న వీడియో..
Little Baby Make Up
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Mar 27, 2023 | 1:58 PM

సోషల్ మీడియాలో అనేక రకాల వీడియోలో వైరల్ అవుతుంటాయి. వాటిలో అమ్మాయిల ఫ్యాషన్‌కు సంబంధించిన వీడియోలు కూడా ఉంటాయి. ఇక మేకప్ అనే దానికి అమ్మాయిలు పెట్టింది పేరు. సరదాగా బయటకు వాకింగ్‌కి వెళ్లాలన్నా, స్కూల్, కాలేజ్, ఆఫీస్ ఇలా ఎక్కడకు వెళ్లాలన్నా చిన్నాపెద్దా తేడా లేకుండా అంతా మేకప్ వాడుతుంటారు. మేకప్ వారి అందాన్ని కూడా రెట్టింపు చేస్తుందని చెప్పుకోవాలి. అయితే ప్రస్తుతం ఓ మేకప్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఆ వీడియోలో మేకప్ వేసుకున్న చిన్నారిని చూస్తే.. అయ్యో పాపం అనకుండా ఉండలేరు. ఇంకా నవ్వుకోవడం అయితే ఆపలేరు కూడా. వైరల్ అవుతున్న వీడియోలో ఓ మూడేళ్ల చిన్నారి తన చేతిలో ఉన్న మేకప్ టూల్‌తో తన ముఖం నిండా దాని రంగు అలుముకుంటుంది. ఇక దీనికి సంబంధించిన వీడియో నెట్టింట ప్రత్యక్షం కావడంతో.. అది కాస్త వైరల్‌గా మారింది.

sweetestcreaturesever అనే ఇన్‌స్టా ఖాతా నుంచి షేర్ అయిన వీడియోలో మీరు ఈ దృశ్యాలను కల్లకు కట్టినట్లు చూడవచ్చు. ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆ చిన్నారి ప్రయత్నాన్ని మెచ్చుకుంటున్నారు, ఇంకా నవ్వుకుంటున్నారు. మరోవైపు ఈ వీడియోకు ఇప్పటివరకు దాదాపు 5 లక్షల 1 వేయికి పైగా లైకులు, 20 లక్షల 21వేలకు పైగా వీక్షణలు వచ్చాయి. ఇంకా 6 వేలకు పైగా నెటిజన్లు ఈ వీడియోపై కామెంట్ చేశారు. ఈ క్రమంలోనే ఒక నెటిజన్ ‘రానున్న కాలంలో ఆమె గొప్ప మేకప్ ఆర్టిస్ట్ అవుతుంద’ని రాసుకొచ్చారు. మరో నెటిజన్ ‘హాలోవీన్ మేకప్ స్టైల్’ అంటూ సరదా కామెంట్ చేశాడు. అలాగే ‘ చూడడానికి అందంగా ఉంది’ అని ఇంకొకరు తెలిపారు. ఇలా వీడియోను చూసిన నెటిజన్లు వారి వారి స్పందనలను కామెంట్ల ద్వారా తెలియజేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

వైరల్ అవుతున్న చిన్నారి మేకప్ వీడియోను ఇక్కడ చూడండి..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..