ప్రియురాలి కోసం గంటకు 160 కి.మీ వేగంతో కారు నడిపిన ప్రియుడు.. చివరికీ

ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఎంత మొత్తుకున్న ఎక్కడో ఓ చోట తప్పిదాలు జరుగుతూనే ఉంటాయి. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించి దూసుకెళ్లడం భారత్ లోనే కాక వివిధ దేశాల్లోను జరుగుతోంది. అయితే తాజాగా అమెరికాలో ఫ్లోరిడాలో జెవన్ పీర్ జాక్సన్ (22) అనే వ్యక్తి

ప్రియురాలి కోసం గంటకు 160 కి.మీ వేగంతో కారు నడిపిన ప్రియుడు.. చివరికీ
Car Driving
Follow us
Aravind B

|

Updated on: Mar 27, 2023 | 3:16 PM

ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఎంత మొత్తుకున్న ఎక్కడో ఓ చోట తప్పిదాలు జరుగుతూనే ఉంటాయి. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించి దూసుకెళ్లడం భారత్ లోనే కాక వివిధ దేశాల్లోను జరుగుతోంది. అయితే తాజాగా అమెరికాలో ఫ్లోరిడాలో జెవన్ పీర్ జాక్సన్ (22) అనే వ్యక్తి ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా దూసుకెళ్లాడు. అది కూడా ఎవరికోసమంటే తన ప్రియురాలి కోసమే. జెనన్ ప్రియురాలికి ఓ ఇంటర్వ్యూ ఉంది. అక్కడికి వెళ్లేందుకు జెవన్ పీర్ తో కలిసి ఆమె కారులో బయలుదేరింది. అయితే కాస్త లేటవడంతో ఇంటర్వ్యూకి సరైన సమయానికి చేరుకోలవాలని ఆమె చెప్పింది. దీంతో జెవన్ రెచ్చిపోయాడు. కారు వేగాన్ని అమాంతం పెంచేశాడు. గంటకు 65 కిలోమీటర్లు ప్రయాణించాలని నిబంధన ఉన్న జోన్ లో.. గంటకు సుమారు 160 కిలోమీటర్ల వేగంతో కారును నడిపాడు.

రోడ్డుపై వేగంగా వెళ్తుండగా కొన్ని వాహనాలను కూడా ఢీ కొట్టబోయాడు. కానీ తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకన్నాడు. అయితే జెవన్ ఢీకొట్టబోయిన వాహనాల్లో పోలీసు వాహనంతో పాటు మరో ముగ్గురు చిన్నారులు ఉన్న వాహనం ఉండటంతో పోలీసులు అతడ్ని వెంబడించారు. ట్రాఫిక్ నిబంధలను ఉల్లంఘించడమే కాకుండా చిన్న పిల్లలకి హాని జరగబోయిందని కేసు పెట్టారు. అతని లైసెన్స్ ను కూడా రద్దు చేశారు. చివరికి అరెస్టు చేసి జైలుకు తీసుకెళ్లారు. వాస్తవానికి అమెరికాలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినమైన శిక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం..