Watch Video: ఇలా ఉన్నావేంట్రా..! ‘ఐలవ్‌యూ’ చెప్పలేదని అమ్మాయిని కొట్టిన బుడ్డోడు.. నెటిజన్లు ఏమంటున్నారంటే..?

ప్రస్తుతం నెట్టింట ఓ చిన్ని ప్రేమికుడికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. అవును, అయితే ఆ బుడ్డోడు చేసిన పని కొందరికి కోపం తెప్పించేదిగా, మరి కొందరికి క్యూట్‌గా అనిపించింది. ఇక నెటిజన్లు వారి తొచిన..

Watch Video: ఇలా ఉన్నావేంట్రా..! ‘ఐలవ్‌యూ’ చెప్పలేదని అమ్మాయిని కొట్టిన బుడ్డోడు.. నెటిజన్లు ఏమంటున్నారంటే..?
Boy Slaping Girl
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Mar 28, 2023 | 12:31 PM

సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. అందులో చిన్నపిల్లలు, ప్రేమికులకు సంబంధించిన వీడియోలు కూడా ఉండడం సహజం. అయితే ప్రస్తుతం నెట్టింట ఓ చిన్ని ప్రేమికుడికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. అవును, అయితే ఆ బుడ్డోడు చేసిన పని కొందరికి కోపం తెప్పించేదిగా, మరి కొందరికి క్యూట్‌గా అనిపించింది. ఇక నెటిజన్లు వారి తొచిన విధంగా ఆ వీడియోపై స్పందిస్తున్నారు.

bad_boy_sujit_tiwari_098 అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి షేర్ అయిన వీడియోలో ఓ చిన్న పిల్లవాడు పక్కనే ఉన్న మరో చిన్నారికి చేతిపై ముద్దు పెట్టి ప్రపోజ్ చేస్తాడు. అనంతరం తన చేతిని ఆ చిన్నారికి అందించి, దానిపై ముద్దు పెట్టి ప్రపోజ్ చేయమని అడుగుతాడు. అయితే ఆ చిన్నారి మాత్రం ప్రపోజ్ చేయకుండా చేతిపై ముద్దు పెడుతూ ఉంటుంది. అందుకు ఆ బుడ్డోడు ముద్దు పెట్టి ఐ లవ్ యూ అని చెప్పమంటాడు. అయితే ఎంతకీ ఆ చిన్నారి పాప చెప్పకపోవడం కోపం తెచ్చుకుంటాడు బడ్డోడు. అంతటితో ఆగక ఆ చిన్నారిని చెంప మీద కొట్టి కిందకు నెట్టేస్తాడు. ఇక ఇందుకు సంబంధించిన దృశ్యాలను మీరు వీడియోలో చూడవచ్చు.

ఇవి కూడా చదవండి

ఇక దీనిపై నెటిజన్లలోని కొందరు కోపం తెచ్చుకుంటుండగా, మరి కొందరు నవ్వేసుకుంటున్నారు. ఇదే క్రమంలో విభిన్నాభిప్రాయాలతో కామెంట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఒక నెటిజన్ ‘వామ్మో వీడేంటి..? ఇప్పుడే ఇలా ఉన్నాడు.?’ అని రాసుకొచ్చారు. అలాగే మరో నెటిజన్ ‘వీడిని కాదు, ఆ బుడ్డోడి తల్లిదండ్రులను అనాలిలే. ఎంత చెప్పినా ఏం లాభం..?’ అని కామెంట్ చేశారు. ఇదే విధంగా ఇంకో నెటిజన్ ‘చెప్పేయవమ్మా.. బెట్టు చేస్తే, బెల్టు తీసేలా ఉన్నాడు’ అని సరదాగా రాసుకొచ్చాడు. ఇక ఈ వీడియోకు ఇప్పటివరకు 12.3 లక్షల వీక్షణలు, అలాగే 4 లక్షల 57వేలకు పైగా లైకులు వచ్చాయి.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..