Sleeping: అతిగా నిద్రపోతే మీ గుండె ప్రమాదంలో పడినట్లే..! ఇంకెన్నో ఆరోగ్య సమస్యలు కూడా..

నిద్రలేమి మాత్రమే కాదు, అతి నిద్ర కూడా ఆరోగ్యానికి హానికరమే. అవును, మానవ శరీరానికి 6 నుంచి 8 గంటల నిద్ర సరిపోతుంది. కానీ ఖాళీగా ఉన్నాం కదా అని అదే పనిగా నిద్రపోతారు. ఇది ఆరోగ్యానికి..

Sleeping: అతిగా నిద్రపోతే మీ గుండె ప్రమాదంలో పడినట్లే..! ఇంకెన్నో ఆరోగ్య సమస్యలు కూడా..
Sleeping Side Effects
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Mar 28, 2023 | 9:07 AM

మానవ ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే ఎన్నో అంశాలలో నిద్ర కూడా ఒకటి. సరిపడినంతగా నిద్రించకపోతే అనేక రకాల ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. జీవరాశి మనుగడుకు ఆహారం తర్వాత అత్యంత ప్రధాన్యత కలిగిన నిద్ర లేకపోతే.. ముఖ్యంగా మనిషి ఉత్సాహంగా, చురుకుగా ఉండలేడు. అందుకే చాలా మంది నిద్రలేక ఎప్పుడూ నీరసంగా, విసుక్కుంటూ ఉంటారు. అయితే వాస్తవానికి నిద్రలేమి మాత్రమే కాదు, అతి నిద్ర కూడా ఆరోగ్యానికి హానికరమే. అవును, మానవ శరీరానికి 6 నుంచి 8 గంటల నిద్ర సరిపోతుంది. కానీ ఖాళీగా ఉన్నాం కదా అని అదే పనిగా నిద్రపోతారు. ఇది ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. ఈ క్రమంలో ఎవరైతే 8 గంటలకు మించి నిద్రపోతారో వారిలో కొన్ని రకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందువల్ల అతినిద్రకు దూరంగా ఉండడం మంచిది. అయితే అతి నిద్ర వల్ల కలిగే ఆరోగ్య సమస్యలేమిటో మనం ఇప్పుడు చూద్దాం..

తలనొప్పి: ఎక్కువ సమయం నిద్రించడం వల్ల తలనొప్పి కలిగే అవకాశం ఎక్కువగా ఉంది. 8 గంటలకు మించిన నిద్ర వల్ల మెదడులోని కొన్ని రకాల న్యూరో ట్రాన్స్‌మీటర్ల‌పై ప్రభావం పడుతుంది. ఇది తలనొప్పికి దారితీస్తుంది. ఇంకా ఉదయం పూట నిద్రపోతే, రాత్రిపూట నిద్రకు భంగం కలుగుతుంది. దీనివల్ల కూడా తలనొప్పి వస్తుంది.

ఊబకాయం: అతినిద్ర ఊబకాయానికి కూడా కారణం అవుతుంది.అవును, 8 గంటలకు మించి నిద్రపోకపోవడమే మంచిది. అంతకుమించి నిద్రపోయే వారిలో బరువు త్వరగా పెరిగే అవకాశం ఉంది. అలాగే అవసరమైన దానికంటే తక్కువ గంటలు నిద్రపోయే వారిలో కూడా ఊబకాయం వచ్చే ఛాన్సులు ఎక్కువ. కాబట్టి 6 నుంచి 8 గంటల పాటు మాత్రమే నిద్రించడం ఆరోగ్యానికి మంచిది.

ఇవి కూడా చదవండి

డయాబెటిస్: నిద్రకూ, డయాబెటిస్‌కు పరోక్ష సంబంధం ఉంది. ఎలా అంటే తక్కువగా నిద్రించినా, ఎక్కువగా నిద్రించినా డయాబెటీస్ సమస్య ఎదురవుతుందని వైద్యులు, నిపుణులు అంటున్నారు. కాబట్టి అతిగా నిద్రించేవారు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి.

గుండె వ్యాధులు: అతినిద్ర గుండె జబ్బులకు దారితీస్తుంది. అవసరమైన దానికంటే నిద్ర ఎక్కువైతే హృదయ సంబంధ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని ఇప్పటికే ఎన్నో అధ్యయనాలు తెలిపాయి. అతి నిద్రకు, గుండె జబ్బులకు ప్రత్యక్ష సంబంధం లేనప్పటికీ ప్రతి రోజూ 9 గంటలు పాటూ నిద్రపోయే వారితో పోలిస్తే, రోజులో 7, 8 గంటలు నిద్రపోయే వ్యక్తుల్లో గుండె జబ్బులు వచ్చే అవకాశం తక్కువ అని హెల్త్ రిపోర్ట్స్ చెబుతున్నాయి.

డిప్రెషన్: డిప్రెషన్‌తో బాధపడుతున్న చాలామంది నిద్రలేమితో బాధపడుతుంటారు. అయితే అతినిద్ర కూడా డిప్రెషన్‌కు కారణం అవుతుంది. కాబట్టి మీకు నిత్యం నిద్ర వస్తూ ఉంటే వైద్యుల్ని సంప్రదించడం ముఖ్యం.

మరిన్ని లైఫ్‌స్టైల్  వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..