‘42 ఏళ్ల తర్వాత అత్తారింటికి వెళ్లి.. బస్సులో పడుకున్నాడు‘.. బాబుపై కొడాలి నాని సంచలన కామెంట్స్..

గుడివాడ అభివృద్ధిపై చంద్రబాబుకు ఓపెన్‌ ఛాలెంజ్‌ చేశారు మాజీ మంత్రి కొడాలి నాని. వచ్చే ఎన్నికల్లోనూ గుడివాడలో టీడీపీని ఓటర్లు చిత్తు చిత్తుగా ఓడిస్తారని ఆయన జోస్యం చెప్పారు. అటు కొడాలి వ్యాఖ్యలపై జిల్లా టీడీపీ నేతలు కౌంటర్‌ అటాక్‌ చేశారు.

‘42 ఏళ్ల తర్వాత అత్తారింటికి వెళ్లి.. బస్సులో పడుకున్నాడు‘.. బాబుపై కొడాలి నాని సంచలన కామెంట్స్..
Kodali Nani
Follow us
Shiva Prajapati

|

Updated on: Apr 14, 2023 | 9:39 PM

గుడివాడ అభివృద్ధిపై చంద్రబాబుకు ఓపెన్‌ ఛాలెంజ్‌ చేశారు మాజీ మంత్రి కొడాలి నాని. వచ్చే ఎన్నికల్లోనూ గుడివాడలో టీడీపీని ఓటర్లు చిత్తు చిత్తుగా ఓడిస్తారని ఆయన జోస్యం చెప్పారు. అటు కొడాలి వ్యాఖ్యలపై జిల్లా టీడీపీ నేతలు కౌంటర్‌ అటాక్‌ చేశారు.

చంద్రబాబు విమర్శలకు కొడాలి నాని కౌంటర్‌..

టీడీపీ అధినేత చంద్రబాబు గుడివాడ పర్యటన తర్వాత స్థానిక రాజకీయం వేడెక్కింది. చంద్రబాబు చేసిన విమర్శలకు తనదైన శైలిలో బదులిచ్చారు స్థానిక వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని. చంద్రబాబు నిమ్మకూరుకు వెళ్లడంపైనా సెటైర్లు వేశారు. పెళ్లయిన 42 ఏళ్ల తర్వాత అత్తారింటికి వెళ్లిన చంద్రబాబు రాత్రి బస్సులో పడుకున్నారని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి. నిమ్మకూరు అభివృద్ధికి రాజ్యసభ సభ్యుడిగా నందమూరి హరికృష్ణ, జూనియర్‌ ఎన్టీఆర్‌ తాను ఎంతో కృషి చేశామన్నారు నాని.

చంద్రబాబుకు కొడాలి ఓపెన్‌ ఛాలెంజ్‌..

గుడివాడలో తనను ఓడిస్తానన్న చంద్రబాబు వ్యాఖ్యలపైనా మండిపడ్డారు నాని. అసలు కుప్పంలో చంద్రబాబు.. మంగళగిరిలో లోకేష్‌ గెలవలేరని.. చంద్రబాబు మళ్లీ మహాకూటిమి కడితే 2009 సీనే రిపీట్‌ అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుడివాడ అభివృద్ధిపై చంద్రబాబుకు ఓపెన్‌ ఛాలెంజ్‌ చేశారు నాని.

ఇవి కూడా చదవండి

మాజీ మంత్రి విమర్శలపై కృష్ణా జిల్లా టీడీపీ నేతలు కౌంటర్‌ అటాక్‌ చేశారు. మూడేళ్లలో మంత్రి పదవి ఎందుకు పోయిందో చెప్పాలన్నారు దేవినేని ఉమా. ఇక గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు స్వాగతం చెబుతున్న సమయంలో కాసేపు ఉద్రిక్తతకు దారితీసింది. టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగి.. ఒకరు గాయపడ్డారు. చంద్రబాబు గుడివాడ నుంచి నూజివీడు వెళ్తుండగా.. ఆరుగొలను దగ్గర ఈ ఘటన జరిగింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..