కూటి కోసం కోటి విద్యలంటే ఇదేనేమో.. ఆహారం కోసం ఎలుగుబంట్ల పాట్లు

కూటి కోసం కోటి విద్యలంటే ఇదేనేమో.. ఆహారం కోసం ఎలుగుబంట్ల పాట్లు

Phani CH

|

Updated on: Apr 15, 2023 | 9:39 AM

కూటి కోసం కోటి విద్యలు సామెత అందరికీ తెలిసిందే. కుటుంబాన్ని పోషించడం కోసం మనిషి రకరకాల పనులు చేస్తుంటారు. అయితే ఇది కేవలం మనుషులకే కాదు... పశుపక్ష్యాదులకూ వర్తిస్తుంది. అందుకు ఉదాహరణే ఈ వీడియో.. ఇందులో ఆహారం కోసం కొన్ని ఎలుగుబంట్లు చేస్తున్న విన్యాసా

కూటి కోసం కోటి విద్యలు సామెత అందరికీ తెలిసిందే. కుటుంబాన్ని పోషించడం కోసం మనిషి రకరకాల పనులు చేస్తుంటారు. అయితే ఇది కేవలం మనుషులకే కాదు… పశుపక్ష్యాదులకూ వర్తిస్తుంది. అందుకు ఉదాహరణే ఈ వీడియో.. ఇందులో ఆహారం కోసం కొన్ని ఎలుగుబంట్లు చేస్తున్న విన్యాసాలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. జూలో ఓ చోట కొన్ని ఎలుగుబంట్లు ఉన్నాయి. వాటికి ఆహారం ఇచ్చేందుకు వచ్చాడో వ్యక్తి. అతన్ని చూడగానే ఎలుగుబంట్లు డాన్స్‌ చేయడం మొదలుపెట్టాయి. అతను ఎలుగుబంట్ల వైపు ఆహారాన్ని విసురుతున్నాడు. దాన్ని ఆ ఎలుగుబంట్లు ఎంతో చాకచక్యంగా క్యాచ్‌ పట్టుకుంటున్నాయి. అలా ఒక్కొక్క దానికి ఆహారం వేస్తుంటే మరో ఎలుగుబంటి తన వంతుకోసం ఎదురుచూస్తూ తనదైనశైలిలో స్టెప్స్‌ వేస్తుంది. వీడియో చివరిలో ‘ప్లీజ్ నాకు వేయి’ అంటూ ఓ ఎలుగు చేసిన పెర్ఫామెన్స్‌కి ఎంతటివారైనా కరిగిపోవాల్సిందే. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చిన్నారి గొంతులో హనుమాన్ విగ్రహం !! 6 గంటలు నరకం

ఇది కథ కాదు.. నిజం.. బాటిల్‌లో రాళ్లు వేసి నీళ్లు తాగిన కాకి

Vakeel Saab 2: దిమ్మతిరిగే న్యూస్.. వకీల్ సాబ్ 2 వచ్చేస్తోంది..

మరీ దారుణంగా జబర్దస్త్‌ కమెడియన్ ఆరోగ్యం !!

Allu Arjun: చెర్రీ దారిలో అల్లు అర్జున్.. బాలీవుడ్ సినిమాలో పుష్ప రాజ్

 

Published on: Apr 15, 2023 09:32 AM