Funny Video: అడవిలో ప్రైవేట్ చెక్ పోస్ట్ పెట్టిన ఏనుగు.. వాహనం ఆపి ఏం చేస్తుందో చూడండి..

దేశంలో కొన్ని రహదారులు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. సాధారణ ప్రాంతాల్లోనే కాకుండా.. అటవీ ప్రాంతాలు, కొండగుట్టల గుండా కూడా రహదారులు ఉన్నాయి. అయితే, అటవీ మార్గంలో ఉన్న రహదారులపై వెళ్లే వాహనాలు చాలా జాగ్రత్తగా వెళ్లాల్సిన అవసరం ఉంది. కారణం వణ్యప్రాణాలు.

Funny Video: అడవిలో ప్రైవేట్ చెక్ పోస్ట్ పెట్టిన ఏనుగు.. వాహనం ఆపి ఏం చేస్తుందో చూడండి..
Elephant
Follow us
Shiva Prajapati

|

Updated on: Mar 29, 2023 | 8:50 AM

దేశంలో కొన్ని రహదారులు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. సాధారణ ప్రాంతాల్లోనే కాకుండా.. అటవీ ప్రాంతాలు, కొండగుట్టల గుండా కూడా రహదారులు ఉన్నాయి. అయితే, అటవీ మార్గంలో ఉన్న రహదారులపై వెళ్లే వాహనాలు చాలా జాగ్రత్తగా వెళ్లాల్సిన అవసరం ఉంది. కారణం వణ్యప్రాణాలు. అడవిలో వణ్యప్రాణాలు సంచరిస్తుంటాయి. ఒక్కోసారి అవి రోడ్డు దాటాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాంటి సమయంలో వాహనాలను నిలపాల్సి వస్తుంది. అయితే, అడవిలో పులులు, సింహాలు సహా చిన్న జంతువులతో పాటు.. భారీ ఏనుగులు కూడా ఉంటాయి. ఓక్కోసారి అవి రోడ్డుపైనే తిష్ట వేస్తాయి. వచ్చిపోయే వాహనాలను చూస్తూ తమకు నచ్చిన ఆహారం ఏమైనా దొరుకుతుందేమో అని ఎదురుచూస్తుంటాయి. తాజాగా అలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

సాధారణంగా జాతీయ రహదారులపై టోల్ ప్లాజా ఉంటుంది. ఆ ప్లాజాల్లో టోల్ వసూలు చేస్తుంటారు. మరి అడవిలో టోల్‌ప్లాజా గురించి ఎప్పుడైనా విన్నారా? అదీ జంతువులే చెక్ పోస్ట్ పెట్టి, ఫీజు కింద ఆహారాన్ని ఎత్తుకెళ్లడం చూశారా? అయితే, ఈ వీడియోలో చూసేయండి. అవును, ఓ భారీ ఏనుగు రోడ్డు పక్కన నిల్చుని వాహనాలను ఆపుతోంది. వచ్చిపోయే ట్రక్కులకు అడ్డంగా నిల్చుని చెక్ చేస్తోంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో కొన్ని ట్రక్కులు చెరుకు లోడ్‌తో వెళ్తున్నాయి. అది గమనించిన ఏనుగు మొదట ఒక ట్రక్కును ఆపింది. అందులో కొన్ని చెరుకు గడలను తీసుకుంది. వాటిని తిన్నది. ఆ తరువాత మరో ట్రక్కు రాగా, దాన్ని కూడా ఆపేసింది ఏనుగు. అందులో ఉన్న చెరుకు గడలను కూడా తీసుకుంది. ఆ తరువాత ఇక వెళ్లొచ్చు అంటూ ఆ వాహనానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఇవి కూడా చదవండి

ఈ బ్యూటీఫుల్ వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి సుశాంతనంద సోషల్ మీడియాలో ట్వీట్ చేయగా అదికాస్తా వైరల్ అయ్యింది. నెటిజన్లు ఈ వీడియోను చూసి ఫిదా అయిపోతున్నారు. అడవిలో ఏనుగు టోల్ ప్లాజా.. టోల్ చెల్లించలేదో జరిమానా తప్పదు మరి అంటూ ఫన్నీ రిప్లై ఇస్తున్నారు సోషల్ మీడియా యూజర్లు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఇదే..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..