Viral Video: పిక్నిక్‌ను ఎంజాయ్ చేస్తున్న జనాలు.. ఒక్కసారిగా దూసుకొచ్చిన అనుకోని అతిధి..
వీకెండ్ వస్తే చాలు.. అప్పుడప్పుడూ లాంగ్ డ్రైవ్స్, ట్రెక్కింగ్, పిక్నిక్‌లకు జనాలు వెళ్తుండటం సర్వసాధారణం. కానీ పిక్నిక్‌లు ఎంజాయ్ చేస్తున్నప్పుడు..
మన పల్లెటూర్లలో లేదా గ్రామాల్లో బీచ్‌కి వెళ్తుండటం, వన భోజనాలకు అందరూ కలిసి వెళ్లడం చూస్తూనే ఉంటాం. అలాగే విదేశాల్లో వీకెండ్ వస్తే చాలు.. అప్పుడప్పుడూ లాంగ్ డ్రైవ్స్, ట్రెక్కింగ్, పిక్నిక్‌లకు జనాలు వెళ్తుండటం సర్వసాధారణం. కానీ పిక్నిక్‌లు ఎంజాయ్ చేస్తున్నప్పుడు.. అనుకోని అతిధులు మనల్ని భయబ్రాంతులకు గురి చేసే అవకాశం ఉంది. పిక్నిక్‌లకు అటవీ ప్రాంతానికి వెళ్తే.. కొన్నిసార్లు పాములు, జంతువులు లాంటివి మన వైపుకు వచ్చే అవకాశం ఉంటుంది. తాజాగా అలాంటి వీడియోనే ఒకటి ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.
లేటెస్ట్ సైటింగ్స్ అనే ట్రావెల్ సంస్థ ప్రకారం.. కొంతమంది నేచర్ లవర్స్ ఎంచక్కా పిక్నిక్ ఎంజాయ్ చేస్తుండగా.. ఓ మొసలి ఎక్కడ నుంచి వచ్చిందో గానీ.. వారి వైపుకు ఒక్కసారిగా దూసుకొచ్చి.. డ్రింక్స్ ఉన్న కూలర్ బాక్స్‌ను పట్టుకుని నీటిలోకి వెళ్లిపోయింది. వేడి ఉడుకు తట్టుకోలేకపోయిందో.. ఏమో.. ఆ ఐస్ క్యూబ్స్ ఎత్తుకుపోయింది. ఎవ్వరికీ ఏ హాని తలపెట్టకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన దక్షిణాఫ్రికాలోని జోహాన్స్‌బర్గ్‌లో ఉన్న వాటర్ బెర్గ్ పర్వత ప్రాంతం దగ్గర జరిగింది.
ఈ వీడియోను ఇటీవల ఫేస్‌బుక్‌లో ‘లేటెస్ట్ సైటింగ్స్’ అనే పేజీ షేర్ చేసింది. దీనికి మిలియన్ల కొద్దీ వ్యూస్.. లక్షల్లో లైక్స్ వచ్చాయి. ఇక నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. లేట్ ఎందుకు మీరూ వీడియోపై ఓ లుక్కేయండి.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం..