Viral Video: ఫుట్‌బాల్ ఆడుతున్న పిల్ల ఏనుగు సందడే సందడి.. అందమైన వీడియోకు నెటిజన్లు ఫిదా..
ఏనుగులు సాధారణంగా అడవుల్లో సంచరిస్తూ, తమ శక్తితో భారీ వృక్షాలను నరికేసి, తమ పిల్లలను సంరక్షిస్తూ కనిపిస్తుంటాయి. అదే సమయంలో పిల్ల ఏనుగులు చేసే అల్లరికి సంబంధించిన వీడియోలు ఎంతో అందంగా ఉంటాయి. ఏనుగు పిల్లలు తరచూ తల్లితో చేసే అల్లరికి సంబంధించిన ఘటనలే ఎక్కువగా కనిపిస్తుంటాయి.
సోషల్ మీడియాలో ప్రతిరోజూ ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. అది చూసిన వినియోగదారులు సంతోషంతో ఒత్తిడి నుంచి విముక్తి పొందుతుంటారు. సోషల్ మీడియాలో యూజర్లు ప్రతిరోజూ ఇలాంటి వీడియోల కోసం ఎదురుచూస్తుంటారు. ముఖ్యంగా అడవి జంతువులు, పెంపుడు జంతువులకు సంబంధించిన వీడియోలపై ప్రజలు మరింత ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. అటువంటి ఫన్నీ వీడియో ఒకటి సోషల్ మీడియాలో కనిపించింది. ఈ వీడియోలో పిల్ల ఏనుగు ఫుట్‌బాల్‌తో ఆడుతూ తెగ సందడి చేస్తోంది. ఏనుగులు సాధారణంగా అడవుల్లో సంచరిస్తూ, తమ శక్తితో భారీ వృక్షాలను నరికేసి, తమ పిల్లలను సంరక్షిస్తూ కనిపిస్తుంటాయి. అదే సమయంలో పిల్ల ఏనుగులు చేసే అల్లరికి సంబంధించిన వీడియోలు ఎంతో అందంగా ఉంటాయి. ఏనుగు పిల్లలు తరచూ తల్లితో చేసే అల్లరికి సంబంధించిన ఘటనలే ఎక్కువగా కనిపిస్తుంటాయి. అలాంటిదే ఈ వీడియో కూడా..
ఈ వీడియోను బుటెంగేబీడెన్ అనే ఖాతా ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో ఏనుగు పిల్ల సరదాగా గడుపుతోంది. ఏనుగు పిల్ల ఫుట్‌బాల్‌తో ఆడుకుంటూ కనిపించింది. వీడియోలో పిల్ల ఏనుగు ఫుట్‌బాల్‌ను కొన్నిసార్లు కాళ్లతో కొన్నిసార్లు ట్రంక్‌తో నెట్టడం కనిపిస్తుంది. ఇంతలో ఏనుగు పిల్ల ఫుట్‌బాల్ ఆడుతూ జారిపడింది. దీని తర్వాత లేచి మళ్లీ ఆట కొనసాగించడం నిజంగా ఎంతో అద్భుతంగా కనిపించింది.
Baby elephant having fun.. ? pic.twitter.com/NkKU2VKUqB
— Buitengebieden (@buitengebieden) March 22, 2023
ఏనుగు పిల్లకు సంబంధించిన ఈ క్యూట్ వీడియో సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షించింది. ఇప్పటి వరకు వీడియోకు 3 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. 56 వేల మందికి పైగా వినియోగదారులు ఈ వీడియోని లైక్ చేశారు. వీడియోపై స్పందిస్తూ.. సంతోషంగా ఉందంటూ.. చాలా అందమైన వీడియోగా అభివర్ణించారు. మరోవైపు, పిల్ల ఏనుగులు చాలా అందంగా ఉన్నాయంటూ మరి కొందరు నెటిజన్లు కామెంట్ చేశారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..