ప్రధాని మోదీ ఫోటో చింపిన కాంగ్రెస్ ఎమ్మెల్యేకు జరిమానా, జైలు శిక్ష..!

పటేల్, యువజన కాంగ్రెస్ సభ్యులతో సహా మరో ఆరుగురిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నేరారోపణకు పాల్పడిన ముగ్గురు నిందితులను కోర్టు దోషులుగా నిర్ధారించింది. వారికి జరిమానా విధించింది. అయితే, ఇది కేవలం రాజకీయ వైరమే దీనికి కారణమని కాంగ్రెస్ ఆరోపించింది .

ప్రధాని మోదీ ఫోటో చింపిన కాంగ్రెస్ ఎమ్మెల్యేకు జరిమానా, జైలు శిక్ష..!
Gujarat Congress Mla Anant
Follow us
Jyothi Gadda

|

Updated on: Mar 28, 2023 | 5:17 PM

విద్యార్థుల నిరసన సందర్భంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్‌ఛాన్సలర్‌ ఛాంబర్‌లోకి చొరబడి ప్రధాని మోదీ ఫొటోను చింపివేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేకు గుజరాత్ కోర్టు జరిమానా విధించింది. 2017లో వాన్‌సడా నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అనంత్ పటేల్, ఇతరులు నవ్‌సారి వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్-ఛాన్సలర్ కార్యాలయంలోకి ప్రవేశించి విద్యార్థుల నిరసన సందర్భంగా వికృతంగా ప్రవర్తించారు.వైస్-ఛాన్సలర్ డెస్క్‌పై ఉన్న ప్రధాని మోదీ ఫొటోను చించివేశారనే ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనకు సంబంధించి 2017 మేలో ఎమ్మెల్యే పటేల్‌తో పాటు మరో ఆరుగురిపై జలాల్‌పూర్ పోలీసులు కేసు నమోదు చేశారు.

అడిషనల్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ VA ధధల్, కాంగ్రెస్ ఎమ్మెల్యే పటేల్‌ను ఆయా సెక్షన్ల మేరకు నేరానికి పాల్పడినట్లు నిర్ధారించారు. పటేల్, యువజన కాంగ్రెస్ సభ్యులతో సహా మరో ఆరుగురిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నేరారోపణకు పాల్పడిన ముగ్గురు నిందితులను కోర్టు దోషులుగా నిర్ధారించింది. వారికి రూ. 99 జరిమానాను డిపాజిట్ చేయాలని ఆదేశించింది.

అంతేకాదు.. వారు డిఫాల్ట్‌లో 7 రోజుల సాధారణ జైలు శిక్షను అనుభవించాల్సి ఉంటుందని పేర్కొంది. ఐపీసీ సెక్షన్ 447ఆర్ కింద పటేల్‌కు గరిష్టంగా శిక్ష విధించాలని ప్రాసిక్యూషన్ కోరింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేకు 3 నెలల జైలు శిక్ష, రూ.500 జరిమానా విధించాలని కోర్టును అభ్యర్థించారు. ఇదిలా ఉంటే, ఇది కేవలం రాజకీయ వైరమే దీనికి కారణమని కాంగ్రెస్ ఆరోపించింది .

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..