MS Dhoni: ధోనీని ‘బిగ్ డాగ్’ అంటూ పిలచిన CSK మాజీ ప్లేయర్.. నెట్టింట్లో ఫ్యాన్స్ రచ్చ.. వైరల్ వీడియో..
MS Dhoni Big Dog Tweet: ఎంఎస్ ధోని ప్రాక్టీస్ వీడియోను చెన్నై సూపర్ కింగ్స్ షేర్ చేసింది. స్టేడియం మొత్తం ధోనీ పేరుతో మారుమోగుతోంది. అయితే, ఈ వీడియోపై మాజీ చెన్నై ఆటగాడు స్కాట్ స్టైరిస్ అతన్ని బిగ్ డాగ్ అంటూ ఓ ఇంగ్లీష్ సామెతను పేల్చాడు.
IPL 2023: ఎంఎస్ ధోని ఐపీఎల్ 2023 కోసం చెన్నైలో సిద్ధమవుతున్నాడు. చెన్నై సన్నాహాలను చూసేందుకు స్టేడియం మొత్తం అభిమానులతో నిండిపోయింది. ఈ మేరకు చెన్నై సూపర్ కింగ్స్ ఓ వీడియోను సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ వీడియోలో అభిమానులతో నిండిన స్టేడియంలో.. ధోని బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయడానికి మైదానంలోకి వెళ్తున్నట్లు చూడొచ్చు. ధోనీ మైదానంలోకి రాగానే స్టేడియం మొత్తం అతని పేరుతో మారుమోగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కాగా, ఇప్పటి వరకు అంతా బాగానే ఉన్నా.. ఆ తర్వాతే అసలు రచ్చ మొదలైంది. ఈ వీడియోని ధోని మాజీ సహచరుడు షేర్ చేస్తూ.. జార్ఖండ్ డైనమేట్‌ను ‘బిగ్ డాగ్’ అని సంభోదించాడు. దీంతో నెట్టింట్లో ధోని ఫ్యాన్స్ ఫైరవుతున్నారు.
చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఐపీఎల్ ఆడిన స్కాట్ స్టైరిస్.. ధోనీపై ప్రజల్లో ఉన్న క్రేజ్ చూసి ఆగలేకపోయాడు. అతను CSK వీడియోను రీట్వీట్ చేస్తూ.. ‘స్టిల్ ద బిగ్ డాగ్ ఎరౌండ్ టౌన్’ అంటూ ట్వీట్ చేశాడు.
చెన్నైలో ధోనీ ఇప్పటికీ అత్యంత ప్రజాదారణ కలిగిన వ్యక్తి అని స్టైరిస్ చెప్పాలనుకున్నాడు. అయితే అభిమానులు అతని వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారు. ధోనీని ‘బిగ్ డాగ్’గా పిలిచాడంటూ విరుచుకుపడ్డారు. అలాంటి పదాన్ని ధోని కోసం ఎవరైనా ఎలా ఉపయోగిస్తారంటూ వినియోగదారులు కామెంట్స్ చేస్తున్నారు. అయితే, ఈ వ్యాఖ్యలపై అపార్థాన్ని తొలగించడానికి ప్రయత్నించినప్పటికీ, స్టైరిస్ వ్యాఖ్యలపై రచ్చ సృష్టించే వారి సంఖ్య ఎక్కువగానే ఉంది.
Still the big dog around town!! ?? https://t.co/aDy8dInlIn
— Scott Styris (@scottbstyris) March 27, 2023
ఇక చెన్నై సూపర్ కింగ్స్ గురించి మాట్లాడితే, జట్టు మార్చి 31న అహ్మదాబాద్‌లో గుజరాత్ టైటాన్స్‌తో ఐపీఎల్ 2023 ప్రారంభ మ్యాచ్ ఆడనుంది.
Dhoni fans to each other: pic.twitter.com/FfYX0C0pGS
— Samarth (@sammy7997) March 27, 2023
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..