Telangana: పరీక్ష రాసి ఇంటికొచ్చిన కుమార్తె.. దారుణంగా చంపిన తండ్రి.. అడ్డుకోబోయిన తల్లిని కూడా..
వ్యసనాలకు బానిసైన ఓ భర్త.. భార్యతోపాటు కన్న కూతురిని అతి దారుణంగా నరికి చంపాడు. ఈ దారుణ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని వేషాలపల్లిలో చోటుచేసుకుంది. దీంతో వేషాలపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి.
వ్యసనాలకు బానిసైన ఓ భర్త.. భార్యతోపాటు కన్న కూతురిని అతి దారుణంగా నరికి చంపాడు. ఈ దారుణ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని వేషాలపల్లిలో చోటుచేసుకుంది. దీంతో వేషాలపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని వేషాలపల్లికి చెందిన ఎలగంటి రమణాచారి అనే వ్యక్తి వ్యసనాలకు అలవాటు పడి తరచూ ఇంట్లో గొడవ చేస్తూ భార్యను హింసించేవాడు. గత కొద్ది రోజుల క్రితం భూపాలపల్లి పోలీస్ స్టేషన్లో రమణాచారి భార్య రమ ఈ విషయంపై ఫిర్యాదు చేసింది. అయితే, అప్పుడు పోలీసులు దంపతులు ఇద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు.
అంతా బాగానే ఉందనుకున్న క్రమంలో.. రమణాచారి కూతురు అయిన ఎలగంటి చందన (18) ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలను ఈరోజు పూర్తిచేసుకుని బుధవారం సాయంత్రం ఏడు గంటల సమయంలో ఇంటికి వచ్చింది. అనంతరం ఆమె ఇంట్లోనున్న దుస్తులు ఉతుకుతుండగా తండ్రి ఎలాగంటి రమణ చారి (40) అక్కడి చేరుకున్నాడు. అనంతరం కూతురితో గొడవపడి చందన(18)పై కత్తితో దాడి చేశాడు. ఇది చూసి భార్య భార్య రమ(35) అడ్డుకోబోయింది. దీంతో కూతురితోపాటు.. భార్యను కూడా దారుణంగా నరికి చంపాడు.
అంతటితో ఆగకుండా 8ఏళ్ల కొడుకు విశ్వను సైతం చంపేందుకు కత్తితో వెంబడించాడు. ఈ క్రమంలో విశ్వ.. అరుస్తూ బయటికి పరుగులు తీశాడు. ఇది చూసిన గ్రామస్థులు.. అతన్ని నిలువరించారు. భార్య, కూతురిని చంపాడన్న విషయం తెలిసి గ్రామస్థులు రమణాచారిని చితకబాదారు. సమచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని రమణచారిని హాస్పిటల్ తరలించారు. ఈఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టినట్లు భూపాలపల్లి పోలీసులు తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..